Ram Charan to become father: తండ్రి కాబోతున్న రామ్‌చరణ్‌.. ట్విటర్‌లో వెల్లడించిన చిరంజీవి-ram charan to become father announces megastar chiranjeevi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Charan To Become Father Announces Megastar Chiranjeevi

Ram Charan to become father: తండ్రి కాబోతున్న రామ్‌చరణ్‌.. ట్విటర్‌లో వెల్లడించిన చిరంజీవి

HT Telugu Desk HT Telugu
Dec 12, 2022 03:10 PM IST

Ram Charan to become father: తండ్రి కాబోతున్నాడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. ఈ విషయాన్ని అతని తండ్రి, మెగాస్టార్ చిరంజీవియే ట్విటర్‌లో స్వయంగా వెల్లడించాడు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులు
రామ్ చరణ్, ఉపాసన దంపతులు

Ram Charan to become father: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన జంట త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్‌ అందుకోనున్నారు. ఈ విషయాన్ని చెర్రీ తండ్రి, మెగాస్టార్‌ చిరంజీవి తన అధికారిక ట్విటర్‌లో వెల్లడించాడు. "ఆ హనుమాన్‌ ఆశీర్వాదాలతో ఉపాసన, రామ్‌చరణ్‌ వాళ్ల తొలి సంతానాన్ని పొందబోతున్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఇట్లు మీ సురేఖ, చిరంజీవి కొణిదెల, శోభన, అనిల్‌ కామినేని" అని చిరు ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌ నిమిషాల్లోనే వైరల్‌ అయింది. ఈ శుభవార్త కోసమే పదేళ్లుగా ఎదురు చేస్తున్న అభిమానులు.. చిరు చెప్పిన న్యూస్‌ను వైరల్‌గా మార్చేశారు. నిమిషాల్లోనే వేల కొద్దీ కామెంట్స్‌, లైక్స్‌, రీట్వీట్స్‌ చేశారు. 2012, జూన్‌ 14న రామ్‌చరణ్‌, ఉపాసన పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్యే వాళ్లు తమ పదో వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

అయితే ఈ పదేళ్లలో ఉపాసన ప్రెగ్నెంట్‌ అన్న వార్తలు చాలాసార్లు వచ్చాయి. అయితే ప్రతిసారీ అవన్నీ ఉత్త పుకార్లే అని తేలడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మరో తరం అడుగుపెట్టబోతోందన్న వార్త ఫ్యాన్స్‌లో ఆనందం నింపుతోంది.

IPL_Entry_Point