తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajinikanth In Kantara 2: కాంతారా ప్రీక్వెల్‌లో రజనీకాంత్.. ఇంట్రెస్టింగ్ బజ్

Rajinikanth in Kantara 2: కాంతారా ప్రీక్వెల్‌లో రజనీకాంత్.. ఇంట్రెస్టింగ్ బజ్

Hari Prasad S HT Telugu

21 February 2023, 19:23 IST

    • Rajinikanth in Kantara 2: కాంతారా ప్రీక్వెల్‌లో రజనీకాంత్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడన్న వార్త ఆసక్తి రేపుతోంది. గతేడాది రిలీజై సంచలన విజయం సాధించిన కాంతారా మూవీకి ప్రీక్వెల్ తీసుకురాబోతున్నట్లు డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి వెల్లడించిన విషయం తెలిసిందే.
కాంతారా సక్సెస్ సందర్భంగా రిషబ్ శెట్టిని సన్మానిస్తున్న రజనీకాంత్
కాంతారా సక్సెస్ సందర్భంగా రిషబ్ శెట్టిని సన్మానిస్తున్న రజనీకాంత్ (twitter)

కాంతారా సక్సెస్ సందర్భంగా రిషబ్ శెట్టిని సన్మానిస్తున్న రజనీకాంత్

Rajinikanth in Kantara 2: కాంతారా మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు కదా. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.500 కోట్ల వరకూ వసూలు చేసింది. కన్నడలోనే కాదు తెలుగు, తమిళం, హిందీల్లోనూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయమే మేకర్స్ ను ఈ మూవీ ప్రీక్వెల్ తీసే దిశగా ప్రోత్సహించింది.

ట్రెండింగ్ వార్తలు

The Boys 4 OTT: సూపర్ హీరోలపై సెటైరికల్‌, వయెలెంట్ సిరీస్- ఓటీటీలోకి ది బాయ్స్ 4- 6 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

Vijay Deverakonda: ఫ్యామిలీస్టార్ డిజాస్ట‌ర్...అయినా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో దిల్‌రాజు మ‌రో మూవీ - ఈ సారి మాస్ క‌థ‌

Lineman OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన విలేజ్ కామెడీ డ్రామా.. సైలెంట్‌గా స్ట్రీమింగ్.. అంతలోనే ట్రెండింగ్.. ఎక్కడంటే?

OTT Releases: ఓటీటీలోకి ఒక్కరోజే 8 సినిమాలు- 3 మాత్రమే స్పెషల్- రెండు బోల్డ్, మరొకటి క్రైమ్ థ్రిల్లర్- ఎక్కడ చూస్తారంటే?

కాంతారాకు సీక్వెల్ వస్తుందని మొదట్లో వార్తలు వచ్చినా.. నిజానికి ప్రీక్వెల్ తీసుకొస్తున్నామని, ప్రేక్షకుల ఇప్పటికే రెండో పార్ట్ చూసేయగా.. తొలి పార్ట్ తీసుకురాబోతున్నట్లు ఈ మూవీ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి చెప్పాడు. అయితే ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించబోతున్నాడన్న వార్త ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతోంది.

ఈ సినిమా కోసం ఈ మధ్యే మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రిషబ్.. ఈ సందర్భంగా కాంతారా ప్రీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ప్రీక్వెల్ కోసమే ప్రస్తుతం తాము రీసెర్చ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ మూవీ కూడా కాంతారాలాంటి స్టోరీతోనే రానున్నా.. జానర్ మాత్రం మారబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు ఈ సినిమాలో రజనీ గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాడటగా అని రిషబ్ ను ప్రశ్నించినప్పుడు అతడు కేవలం నవ్వి ఊరుకున్నాడు. ఈ వార్తలను ఖండించలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంతోకొంత నిజం ఉందని స్పష్టమవుతోంది. నిజానికి కాంతారా మూవీపై గతంలో రజనీ ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా తనకు గూస్‌బంప్స్ తెప్పించదని అతడు అనడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడదే మూవీ ప్రీక్వెల్ లో గెస్ట్ రోల్ పోషించనున్నాడన్న వార్త మరింత ఆసక్తి రేపుతోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.