Pushpa 2 Collection Day 2: 45 శాతం తగ్గిన పుష్ప 2 కలెక్షన్స్- అయినా 400 కోట్లు- జవాన్ రికార్డ్ ఢమాల్- రెండో రోజు ఎంతంటే?
07 December 2024, 11:06 IST
Pushpa 2 The Rule 2 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రెండు రోజుల్లో పుష్ప 2 మూవీ రూ. 400 కోట్లు దాటనుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు.
45 శాతం తగ్గిన పుష్ప 2 కలెక్షన్స్- అయినా 400 కోట్లు- జవాన్ రికార్డ్ ఢమాల్- రెండో రోజు ఎంతంటే?
Pushpa 2 The Rule Box Office Collection Day 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ వరల్డ్ వైల్డ్‌ఫైర్‌గా రాజుకుంది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి రికార్డ్స్ తిరగరాసింది. మొదటి రోజున పుష్ప 2 వైరల్డ్ వైడ్‌గా రూ. 294 కోట్లు కలెక్ట్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా తెలిపారు.
హిందీలో కూడా
దాంతో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది. అప్పటివరకు అతిపెద్ద ఓపెనింగ్ గల భారదేశ సినిమాలుగా ఉన్న ఆర్ఆర్ఆర్ (రూ. 223 కోట్లు), బాహుబలి 2 (రూ. 217 కోట్లు) రికార్డ్స్ పటాపంచలు చేశాడు పుష్పరాజ్. అలాగే, హిందీలో కూడా అతిపెద్ద ఓపెనింగ్ తెలుగు డబ్బింగ్ మూవీగా పుష్ప 2 రికార్డ్ కొట్టింది.
పుష్ప 2 ది రూల్ మూవీ హిందీలో మొదటి రోజు రూ. 72 కోట్లు కలెక్ట్ చేసి అక్కడ కూడా బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలిచింది. ఇంతవరకు హిందీలో అతిపెద్ద ఓపెనింగ్ మూవీగా షారుక్ ఖాన్ జవాన్ మూవీ రూ. 65.5 కోట్లతో ఉండేది. కానీ, బాలీవుడ్ బాద్ షా మూవీ రికార్డ్‌ను బ్రేక్ చేసి సత్తా చాటింది పుష్ప 2.
రెండో రోజు పుష్ప 2 కలెక్షన్స్
పుష్ప 2 సినిమాకు ఇండియాలో ప్రీమియర్ షో వసూళ్ల(రూ. 10.65 కోట్లు)తో కలిపి మొదటి రోజున రూ. 175 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండో రోజున ఇండియాలో పుష్ప 2 చిత్రానికి రూ. 90 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది. వాటిలో తెలుగు నుంచి రూ. 27 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ. 55 కోట్లు, కర్ణాటకలో ఆరు లక్షలు, తమిళం నుంచి 5.5 కోట్లు, మలయాళంలో 1.9 కోట్లుగా వసూళ్లు ఉన్నాయి.
అయితే, మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు పుష్ప 2 సినిమాకు భారతదేశంలో 45.14 శాతం కలెక్షన్స్ తగ్గాయి. ఇక రెండు రోజుల్లో పుష్ప 2 మూవీకి ఇండియాలో రూ. 265 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో తెలుగు నుంచి రూ. 118.05 కోట్లు, హిందీ ద్వారా 125.3 కోట్లు, తమిళంలో 13.2 కోట్లు, కర్ణాటక నుంచి 1.6 కోట్లు, మలయాళంలో 6.85 కోట్లుగా ఉన్నాయి.
పుష్ప 2 రెండు రోజుల కలెక్షన్స్
ఇక రెండో రోజున తెలుగులో పుష్ప 2 సినిమాకు 53 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. వీటిలో ఉదయం షోలకు 31.79 శాతం, మధ్యాహ్నాం 45.53 శాతం, సాయంత్రం 61.86 శాతం, నైట్ షోలకు 72.80 శాతంగా ఉంటూ షోకి షోకి థియేటర్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఇక పుష్ప 2 మూవీ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వెబ్ సైట్ సక్నిల్క్ వెల్లడించింది.
ఓవర్సీస్‌లో
ఇదిలా ఉంటే, పుష్ప 2 మూవీకి ఓవర్సీస్‌లో మొదటి రోజు 8 మిలియన్ డాలర్స్ కలెక్ట్ అయింది. అంటే, తెలుగు కరెన్సీలో సుమారుగా రూ. 67.73 కోట్లు. ఓవర్సీస్‌లో కూడా 2024లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది.
పుష్ప 2 రికార్డ్స్
మొదటి రోజు పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించింది. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. బాహుబలి 2, కేజీఎఫ్ 2 వంటి చిత్రాలను కూడా వెనక్కి నెట్టేసింది. గత ఏడాది వచ్చిన జవాన్ సినిమాను వెనక్కి నెట్టి హిందీలో విడుదలైన అతి పెద్ద సినిమా కూడా పుష్ప 2 ది రూల్ కావడం విశేషం.
టాపిక్