Gopichand Malineni: డైరెక్టర్ గోపీచంద్ మలినేని హిందీ మూవీ- పుష్ప 2 నిర్మాతలు- జాట్ టీజర్ రిలీజ్- తల తెగిన ఆయుధం వీడనంటూ!-gopichand malineni directed hindi movie jaat teaser release starrer by sunny deol in mythri movie makers production ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gopichand Malineni: డైరెక్టర్ గోపీచంద్ మలినేని హిందీ మూవీ- పుష్ప 2 నిర్మాతలు- జాట్ టీజర్ రిలీజ్- తల తెగిన ఆయుధం వీడనంటూ!

Gopichand Malineni: డైరెక్టర్ గోపీచంద్ మలినేని హిందీ మూవీ- పుష్ప 2 నిర్మాతలు- జాట్ టీజర్ రిలీజ్- తల తెగిన ఆయుధం వీడనంటూ!

Sanjiv Kumar HT Telugu
Dec 07, 2024 08:29 AM IST

Gopichand Malineni Jaat Teaser Released: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని హిందీలో దర్శకత్వం వహించిన మూవీ జాట్. బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా యాక్షన్ పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీగా రూపొందిన జాట్ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. జాట్ టీజర్ విశేషాల్లోకి వెళితే..

డైరెక్టర్ గోపీచంద్ మలినేని హిందీ మూవీ- పుష్ప 2 నిర్మాతలు- జాట్ టీజర్ రిలీజ్- తల తెగిన ఆయుధం వీడనంటూ!
డైరెక్టర్ గోపీచంద్ మలినేని హిందీ మూవీ- పుష్ప 2 నిర్మాతలు- జాట్ టీజర్ రిలీజ్- తల తెగిన ఆయుధం వీడనంటూ!

Gopichand Malineni Jaat Teaser Release: టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు గోపీచంద్ మలినేని. రవితేజ బలుపు, క్రాక్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని నందమూరి నటసింహం బాలకృష్ణతో వీర సింహారెడ్డి తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని హిందీలో దర్శకత్వం వహించిన సినిమా జాట్.

yearly horoscope entry point

హ్యూజ్ బజ్

బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ జాట్ మూవీలో హీరోగా నటించారు. పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కిన 'జాట్ కోసం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సన్నీ డియోల్ ఫస్ట్ టైం కొలాబరేట్ అయ్యారు. తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన జాట్ టైటిల్, ఫస్ట్ లుక్‌తో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది.

గొలుసుతో కట్టేసి

తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన జాట్ టీజర్ సినిమాపై మరింత ఎగ్జయిట్‌మెంట్ పెంచింది. జాట్ టీజర్ రెండు పాత్రల మధ్య సాగే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. వారిలో ఒకరు పోలీసు ఆఫీసర్. డైలాగ్ హీరో నటోరియస్ నేచర్, శత్రువులను భయపెట్టే విధ్వంస మార్గాన్ని తెలియజేస్తోంది. విలన్స్ అందరిని చేతులు, కాళ్లను పైన గొలుసులతో కట్టి ఉంచిన సీన్ మాములుగా లేదు.

విలన్‌గా రణదీప్ హుడా

అది సన్నీ డియోల్ క్యారెక్టర్ ఇంటెన్స్ ఇంట్రడక్షన్‌ని ప్రజెంట్ చేస్తోంది. టీజర్‌లోని చాలా మూమెంట్స్ సన్నీ డియోల్ ఫిజిక్ ప్రజెన్స్, ఇంటెన్స్ క్యారెక్టర్ గురించి తెలియజేస్తున్నాయి. మ్యాసీవ్ ఫ్యాన్‌ని ఉపయోగించి ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ రణదీప్ హుడా మెయిన్ విలన్‌గా నటిస్తున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.

తల తెగిన కూడా

మెయిన్ విలన్‌గా రణదీప్ హుడాను పరిచయం చేయడంతో జాట్ టీజర్ థ్రిల్లింగ్ నోట్‌తో ముగిసింది. అలాగే, టీజర్‌లో "తల తెగిన కూడా ఆయుధం విడిచిపెట్టను" అని హీరో చెప్పే డైలాగ్ గోపీచంద్ మలినేని మాస్ మార్క్ చూపిస్తోంది. రాపిడ్-ఫైర్ యాక్షన్, స్టన్నింగ్ విజువల్స్‌తో టీజర్ రోలర్-కోస్టర్ రైడ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ప్రతి సన్నివేశంతో ఆడియన్స్‌ని సీట్ ఎడ్జ్‌న ఉంచేలా చేసింది.

మాస్ అప్పీలింగ్

టీజర్‌లో సన్నీ డియోల్, రణదీప్ హుడా మధ్య ఇంటెన్స్ పేస్ ఆఫ్ మెయిన్ హైలైట్‌గా నిలిచింది. దర్శకుడు గోపీచంద్ మలినేని మాస్-అప్పీలింగ్ యాక్షన్‌ని తీయడంలో తన స్కిల్‌ని అద్భుతంగా చూపించారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది.

ఎలివేట్ చేసేలా బీజీఎమ్

ఈ సినిమాకు ఎస్ తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఆ బీజీఎమ్ జాట్ టీజర్‌లోని యాక్షన్‌ని ఎలివేట్ చేసింది. రిషి పంజాబీ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ప్రతి యాక్షన్ సన్నివేశాన్ని బ్రీత్ టేకింగ్ విజువల్‌గా నిలిపింది. హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్, ఎక్స్‌ఫ్లోజివ్ యాక్షన్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో టీజర్ మాస్ ఫీస్ట్‌ను అందించింది.

రెజీనా, సయామీ ఖేర్

ఇక జాట్ చిత్రంలో వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్‌ నిర్వర్తించగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. పీటర్ హెయిన్, అన్ల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్‌ యాక్షన్ కొరియోగ్రాఫర్‌లుగా వర్క్ చేస్తున్నారు. 2025 ఏప్రిల్ అంటే సమ్మర్‌లో జాట్ సినిమా థియేటర్లలోకి రానుంది.

Whats_app_banner