తెలుగు న్యూస్  /  Entertainment  /  Prashanth Neel And Ntr Movie Shoot Will Begins From March 2024

NTR 31 Update: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీపై అదిరే అప్డేట్.. షూట్ మొదలయ్యేది అప్పుడే

20 May 2023, 15:04 IST

    • NTR 31 Update: జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రానున్న మూవీపై అదిరే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు తారక్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్

NTR 31 Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ రోజుతో 40వ పడిలోకి అడుగుపెట్టాడు. సోషల్ మీడియా వేదికగా తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా గురించి అప్డేట్ కూడా విడుదలైంది. అంతేకాకుండా ఆ మూవీ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. తాజాగా తారక్ తదుపరి నటించబోయే సినిమా గురించి నెట్టింట చర్చ జరగబోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

NTR 31 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగబోతున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సిబ్బందిని త్వరలోనే చిత్రబృందం తెలియజేయనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మార్చి 2024 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు మన తారక్. ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్చున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు సిరిల్, రత్నవేలు ఛాయగ్రహణం, శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.