Bandla Ganesh on Devara: నా టైటిల్ కొట్టేశారు.. ఎన్టీఆర్ మూవీపై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్
Bandla Ganesh on Devara: జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు దేవర అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్ తనదేనంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bandla Ganesh on Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు దేవర అనే టైటిల్ సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు ఈ మూవీ టైటిల్ ప్రకటనతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. సముద్ర తీరంలో చేతిలో బడిసేతో పవర్‌ఫుల్‌గా నిలుచున్న లుక్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమాకు దేవర టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ టైటిల్ విషయంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవర టైటిల్ తనదే అంటూ ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు.
"దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న టైటిల్. నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు." అంటూ కోపంగా ఉన్న ఎమోజీని షేర్ చేశారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే అసలు విషయానికొస్తే దేవర టైటిల్‌ను ముందుగా బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించుకున్న మాట వాస్తవమే. అయితే దాన్ని రెన్యూవల్ చేయించుకోవడం మర్చిపోవడంతో కొరటాల శివ రిజిస్టర్ చేయించుకున్నారట.
శుక్రవారం నాడు ఫస్ట్ లుక్ పోస్టర్ తర్వాత మరో ట్వీట్‌తో బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. దేవర టైటిల్ పెట్టుకోవడంలో తనకు ఏం ప్రాబ్లమ్ లేదని, ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా.. ఆయన కూడా తనకు దేవరేనని తెలిపారు. అంతేకాకుండా సూపర్‌గా ఉందంటూ ఎన్టీఆర్ పోస్టర్‌ను షేర్ చేశారు. మొత్తానికి దేవర టైటిల్ బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ అని తేలిపోయింది.
దేవర మూవీలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే..ఎన్టీఆర్ లుంగీ ధరించి చేతిలో బడిసే లాంటి పెద్ద ఆయుధాన్ని పట్టుకొని పవర్‌ఫుల్‌గా నిలుచున్నారు. పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో మెరిసిన తారక్.. సముద్ర తీరంలో అలలు పోటేతెత్తున్న సమయంలో బండ్ల రాతిపై నిల్చొని తీక్షణగా చూస్తున్నట్లు కనిపించారు.
NTR 30 చిత్రానికి దేవర అనే టైటిల్ మంచి యాప్ట్‌గా ఉంది. ఈ టైటిల్ ఇంకా హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్చున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు సిరిల్, రత్నవేలు ఛాయగ్రహణం, శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.
సంబంధిత కథనం