తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Unveils Saachi Trailer: ఆడపిల్ల బయటకొస్తే అణ్వాయుధం వచ్చినట్లే.. ప్రభాస్ లాంచ్ చేసిన సాచి ట్రైలర్

Prabhas unveils Saachi Trailer: ఆడపిల్ల బయటకొస్తే అణ్వాయుధం వచ్చినట్లే.. ప్రభాస్ లాంచ్ చేసిన సాచి ట్రైలర్

Hari Prasad S HT Telugu

22 February 2023, 16:34 IST

    • Prabhas unveils Saachi Trailer: ఆడపిల్ల బయటకొస్తే అణ్వాయుధం వచ్చినట్లే అంటూ సాచి మూవీ ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బుధవారం (ఫిబ్రవరి 22) ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేశాడు.
సాచి మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్
సాచి మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్

సాచి మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్

Prabhas unveils Saachi Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ చిన్న సినిమా అయిన సాచి ట్రైలర్ ను లాంచ్ చేయడం విశేషం. విధాత ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించగా.. స్టార్ మేకర్ గా పేరుగాంచిన సత్యానంద్ సమర్పిస్తున్నాడు. మహిళల సాధికారత చుట్టూ తిరిగే సందేశాత్మక కథతో ఈ సాచి మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం (ఫిబ్రవరి 22) ప్రభాస్ లాంచ్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Asuraguru Review: అసుర గురు రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న తన తండ్రి నుంచి అతని క్షురక వృత్తిని స్వీకరించిన ఓ అమ్మాయి కథే ఈ సాచి మూవీ. నిజ జీవిత కథ ఆధారంగానే ఈ సాచి మూవీ తెరకెక్కింది. వివేక్ పోతగోని ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు ప్రభాస్ బెస్ట్ విషెస్ చెప్పాడు.

"సాచి ట్రైలర్ నేను చూశాను. ఈ మూవీ మహిళల సాధికారతకు సంబంధించినది. సత్యానంద్ గారు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. వివేక్ పోతగోని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ఈ సందర్భంగా ప్రభాస్ చెప్పాడు.

నిజ జీవితం ఆధారంగానే ఈ మూవీని తెరకెక్కించినట్లు నిర్మాత, దర్శకుడు అయిన వివేక్ తెలిపాడు. బిందు అనే ఓ నాయీ బ్రాహ్మణ యువతే తమ సినిమాలో హీరో అని చెప్పాడు. తమ సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన ప్రభాస్ కు వివేక్ థ్యాంక్స్ చెప్పాడు. కొందరు ముఖ్యమైన వ్యక్తులకు తమ సాచి మూవీని ప్రత్యేకంగా చూపించినట్లు తెలిపాడు. తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఛీఫ్ పాల్వాయి శ్రీనివాస్ తమ సినిమాను ప్రశంసించారని వెల్లడించాడు.

ఈ సాచి మూవీ మార్చి 3న రిలీజ్ కాబోతోంది. సంజనా రెడ్డి, గీతికా రతన్, అశోక్ రెడ్డి మూలవిరాట్, చెల్లి స్వప్న, టీవీ రామన్ లాంటి వాళ్లు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. కేవీ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.