తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Twitter Review: కల్కి ట్విట్టర్ రివ్యూ.. సినిమాలో మిస్సయిన ఎమోషన్.. ప్రభాస్ కనిపించేది అంతేనట!

Kalki 2898 AD Twitter Review: కల్కి ట్విట్టర్ రివ్యూ.. సినిమాలో మిస్సయిన ఎమోషన్.. ప్రభాస్ కనిపించేది అంతేనట!

Sanjiv Kumar HT Telugu

27 June 2024, 8:49 IST

google News
  • Kalki 2898 AD Movie Twitter Review In Telugu: ప్రభాస్ లేటెస్ట్ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కల్కి 2898 ఏడీ ఇవాళ థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే పలుచోట్ల ప్రదర్శించబడిన ప్రీమియర్ షోలు చూసిన నెటిజన్స్ సినిమా ఎలా ఉందో కల్కి 2898 ఏడీ ట్విటర్ రివ్యూలో తెలిపారు.

కల్కి ట్విట్టర్ రివ్యూ.. సినిమాలో మిస్సయిన ఎమోషన్.. ప్రభాస్ కనిపించేది అంతేనట!
కల్కి ట్విట్టర్ రివ్యూ.. సినిమాలో మిస్సయిన ఎమోషన్.. ప్రభాస్ కనిపించేది అంతేనట!

కల్కి ట్విట్టర్ రివ్యూ.. సినిమాలో మిస్సయిన ఎమోషన్.. ప్రభాస్ కనిపించేది అంతేనట!

Kalki 2898 AD Twitter Review Telugu: ఎట్టకేలకు ఇవాళ (జూన్ 27) కల్కి 2898 ఏడీ సినిమా విడుదల కానుంది. అతి భారీ అంచనాలతో రానున్న ఈ సినిమా షోలు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. ఈపాటికే పలు చోట్ల ప్రీమియర్ షోలు పడిపోయాయి. అవి చూసిన నెటిజన్స్ సినిమా ఎలా ఉందో కల్కి 2898 ఏడీ ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.

కల్కి సినిమాలో యానిమేషన్ సూపర్‌గా ఉందని ఆడియెన్స్ చెబుతున్నారు. ప్రభాస్ లుక్ అదిరిపోయిందని, బుజ్జి రోల్ బాగుందని అంటున్నారు. ఇది కల్కి కాదు బుజ్జి అండ్ భైరవ. సూపర్ హిట్ మూవీ అంటూ ప్రేక్షకులు అంతా అరుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. యానిమేషన్ క్వాలిటీ, స్టోరీ టెల్లింగ్ చాలా బాగుందని చెబుతున్నారు.

"ప్రభాస్ స్క్రీన్ ప్రజన్స్ మైండ్ బ్లోయింగ్‌లా ఉంది. స్టోరీ లైన్ అసలు మాములుగా లేదు. వీఎఫ్ఎక్స్, బీజీఎమ్ అదిరిపోయాయి. బ్లాక్ బస్టర్ మూవీ" అని ఒకరు రివ్యూలో తెలిపారు. అంతేకాకుండా ప్రభాస్ ఎంట్రీ సీన్ అదిరిపోయిందని, కాకపోతే అది 20 నిమిషాల తర్వాత ఉండి గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని తెలిపారు.

"కల్కి 2898 ఏడీ సినిమా యావరేజ్‌గా ఉంది. కానీ, సినిమాలో బెస్ట్ యాక్షన్ సీన్స్, వీఎఫెఎక్స్ ఉన్నాయి. మంచి బిజినెస్ చేస్తుంది. అందరూ స్టార్స్ బాగా నటించారు. అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీన్స్ భారీగా ఉన్నాయి. ప్రభాస్, దీపికా పదుకొణె అదరగొట్టారు" అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు.

ఇండియాలో ఏ హీరో తట్టుకోలేడని, సలార్ కూడా పనికి రాదని పలువురు అభిమానులు చెప్పారు. ప్రభాస్ లుక్స్ బాగుందని, ప్రభాస్ ఫ్యాన్స్ సాటిస్‌ఫై అయ్యే విధంగా సినిమా ఉందని ఓ ప్రేక్షకురాలు చెప్పింది. విజవల్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి, నాగ్ అశ్విన్ డైరెక్షన్ అదిరిపోయింది, బాహుబలి కాదు హాలీవుడ్ రేంజ్‌లో ఉంది, ఒక్కొక్క సీన్ చూస్తుంటే మతి పోతోంది అని పలువురు తెలిపారు.

"కల్కి 2898 ఏడీ సూపర్ హిట్. ప్రభాస్ అదరగొట్టాడు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. కమల్ హాసన్ తన నటనతో షో మొత్తం తానై నిలిచాడు. ఓవరాల్‌గా సినిమా గొప్పగా ఉంది. కానీ, బోరింగ్‌గా కూడా ఉంది. నాగ్ అశ్విన్, అశ్వని దత్‌కు అభినందనలు" అని చెబుతూ 5కి 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు ఓ నెటిజన్.

ఇదిలా ఉంటే, సినిమాకు అదిరిపోయే టాక్ వస్తోంది. కొన్ని చోట్ల మాత్రం బోరింగ్, యావరేజ్ అని నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ, ఓవరాల్‌గా సినిమా బాగుందని చెబుతున్నారు. క్లైమాక్స్ అదిరిపోయిందని, ఊహించని కెమియో రోల్స్ ఉన్నాయని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో ఉండి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే సినిమా కల్కి 2898 ఏడీ అని ప్రేక్షకులు చెబుతున్నారు.

అలాగే కల్కి సినిమాలో పూర్తి స్థాయిలో ఎమోషన్ లేదని, అది ఉంటే మూవీ మరో రేంజ్ లో ఉండేదని రివ్యూలు చెబుతున్నారు. అలాగే ప్రభాస్ స్క్రీన్ ప్రజన్స్ చాలా తక్కువగా ఉందని, ఈ రెండు సినిమాకు చాలా మైనస్ గా మారాయని అంటున్నారు. 

కాగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమాలో భైరవగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటించారు. ఇక పవర్‌ఫుల్ విలన్, సుప్రీమ్ యస్కిన్‌గా విభిన్న గెటప్పులో కమల్ హాసన్ కనిపించారు. వీరితోపాటు దీపికా పదుకొణె, దిశా పటానీ, మాళవిక నాయర్, అన్నా బెన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం