(1 / 7)
కమల్ హాసన్ తన అద్భుతమైన నటనతో పాటు సినిమాల్లో విభిన్న గెటప్స్ వేసి ఆశ్చర్యపరిచాడు. అందుకే ఆయన్ను లోకనాయకుడు అని పొగుడుతుంటారు. అయితే, భారతీయుడు నుంచి ప్రభాస్ కల్కి 2898 ఏడీ వరకు కమల్ హాసన్ వేసిన కొన్ని గెటప్స్ చూద్దాం.
(2 / 7)
ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ట్రైలర్‌లో కమల్ హాసన్ ఈ అవతార్‌లో కనిపించారు. మొదట కమల్ హాసన్‌ను ఎవరు గుర్తించలేకపోయారు. ఇప్పటికీ ఈ పాత్ర పేరు తెలియకపోయినప్పటికీ ఈ రూపంలో కమల్ మరోసారి ఆడియెన్స్‌కు థ్రిల్ పంచనున్నాడని తెలుస్తోంది.
(3 / 7)
1997లో విడుదలైన భామనే సత్యభామనే ఒక క్లాసిక్ కామెడీ చిత్రం. ఈ చిత్రంలో కమల్ హాసన్ తన కూతురికి దగ్గరగా ఉండేందుకు తన భార్య ఇంట్లోకి ఇలా బామ్మ రుక్మిణి గెటప్‌లో ఎంట్రీ ఇస్తాడు. ఈ పాత్రలో కమల్ హాసన్ నటనకు యావత్ సినీ ఇండస్ట్రీ ఫిదా అయిపోయింది.
(4 / 7)
కమల్ హాసన్ నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన హే రామ్ సినిమాలో మూడు విభిన్న రూపాల్లో కనిపిస్తాడు. తన భార్య రాణి ముఖర్జీ చనిపోయిన అనంతరం ఈ లుక్‌లో ఉంటాడు. తర్వాత 90 ఏళ్ల వృద్ధుడిగా సైతం కనిపిస్తాడు. ఈ సినిమాలో రాణి ముఖర్జీ, నసీరుద్దీన్ షాతోపాటు బాాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించడం విశేషం.
(5 / 7)
కమల్ హాసన్ పది అవతారాలతో మ్యాజిక్ చేసిన సినిమా దశావతారం. ఈ సినిమాలో పది రకాల గెటప్పుల్లో, పది పాత్రల్లో ఒదిగిపోయి నటించాడు. అందులో వైష్ణవుడిగా కనిపించిందే ఈ లుక్.
(6 / 7)
కమల్ హాసన్ గెటప్‌కు, నటనకు విపరీతమైన పేరు తీసుకొచ్చిన సినిమా భారతీయుడు. ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో కమల్ వృద్ధ తండ్రిగా, కొడుకుగా కనిపిస్తాడు. అలాగే సైనికుడిగా కూడా అలరిస్తాడు. ఇలా మూడు పాత్రల్లో కమల్ హాసన్ నటనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
(7 / 7)
కమల్ హాసన్ విశ్వరూపం చూపించిన సినిమా విశ్వరూపం. ఇందులో సాఫ్ట్ క్లాసికల్ డ్యాన్సర్ పాత్రతోపాటు ఇండియన్ రా ఏజెంట్‌గా కనిపిస్తాడు. స్పైలో భాగంగా పాకిస్తాన్‌లో టెర్రరిస్ట్‌లకు ట్రైనింగ్ ఇచ్చే కమాండర్ లుక్ ఇది. ప్రతి పాత్రలో ప్రతీ గెటప్‌లో జీవించి నటించడం కమల్ హాసన్ స్పెషాలిటీ.
ఇతర గ్యాలరీలు