Kalki 2898 AD: అసలు నాగ్ అశ్విన్ ఏం తాగి ఆలోచించాడు.. కల్కి డైరెక్టర్‌పై అమితాబ్ బచ్చన్ డౌట్
Amitabh Bachchan About Nag Ashwin In Kalki Pre Release Event: కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌పై అమితాబ్ బచ్చన్ ఊహించని కామెంట్స్ చేశారు. నాగ్ అశ్విన్ ఏం తాగి ఆలోచించారు అంటూ కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందేహం వ్యక్తం చేశారు.
Amitabh Bachchan Nag Ashwin Kalki 2898 AD: ఇండియన్ స్క్రీన్‌పై రచ్చ చేసేందుకు సిద్ధంగా ఉంది కల్కి 2898 ఏడీ సినిమా. ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి అగ్ర తారలు నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. భారీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు అశ్వని దత్ నిర్మాతగా ఉన్నారు.
కల్కి 2898 ఏడీ ట్రైలర్ ఇప్పటికే అలరించగా.. ఇవాళ (జూన్ 21) సాయంత్రం 6 గంటలకు సెకండ్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా జూన్ 20న ప్రకటించారు. ఆన్‌లైన్‌లో కల్కి సెకండ్ ట్రైలర్ లీక్ కావడంతో మూవీ టీమ్ ఫైనల్ వార్ పేరుతో కల్కి 2898 ఏడీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనుంది.
ఇదిలా ఉంటే, ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో నలుగురు స్టార్స్ అదిరిపోయే ఔట్ ఫిట్స్‌తో దర్శనం ఇచ్చారు. అలాగే పలు సరదా సన్నివేశాలు జరగడంతోపాటు ఆసక్తికర విశేశాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్‌పై అమితాబ్ బచ్చన్ ఊహించని కామెంట్స్ చేశారు.
సుమారు గంటపాటు జరిగిన కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దాదాపుగా12 నిమిషాల పాటు నలుగురు అగ్రతారలతో క్యూ అండ్ ఏ సెషన్ నిర్వహించాడు హోస్ట్ దగ్గుబాటి రానా. ఈ సందర్భంగా కల్కి సినిమా గురించి, ఆ కథ విన్నప్పుడు చెందిన అనుభూతి గురించి అమితాబ్ బచ్చన్‌ను రానా దగ్గుబాటి ప్రశ్నించాడు.
"కల్కి 2898 ADలో పార్ట్ అవ్వడం గ్రేట్ హానర్. ట్రూలీ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఇది ఓ కొత్త ప్రపంచం. ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి సినిమాని అలోచించిన నాగ్ అశ్విన్‌కి, టీం అందరికీ అభినందనలు. నాగి ఈ కథ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఏం డ్రింక్ చేస్తే ఇలాంటి కథని ఆలోచించగలిగాడని అనిపించింది" అని అమితాబ్ బచ్చన్ అన్నారు. దాంతో అంతా నవ్వారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంకా కొనసాగిస్తూ "ఇందులో ఉన్న విజువల్స్ అన్ బిలివబుల్. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్‌ని తీయడం మహా అద్భుతం. తను అనుకున్న విజన్‌ని వండర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు. కల్కి ఎక్స్‌పీరియన్స్‌ని ఎప్పటికీ మర్చిపోలేను" అని చెప్పుకొచ్చారు.
"నాగ్ అశ్విన్ మా గురువు గారు బాలచందర్ గారిలా ఆర్డీనరిగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు నాగ్ అశ్విన్‌కి ఉంది. ఇందులో బ్యాడ్ మ్యాన్‌గా ప్లే చేశా. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశారు. నా ఫస్ట్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్‌ప్రైజ్ అవుతారు" అని ఉలగ నాయగన్ కమల్ హాసన్ తెలిపారు.
"అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్, దీపిక నలుగురూ ఇక్కడ ఉండటం, అందరి సమక్షంలో ఈ ఈవెంట్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను" అని కల్కి నిర్మాత అశ్విని దత్ అన్నారు.