తెలుగు న్యూస్ / ఫోటో /
Kalki 2898 AD Pre Release Event Photos: సిగ్గు పడిపోయిన ప్రభాస్.. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ఫొటోలు మాత్రం చూసుండరు!
Prabhas Photos In Kalki 2898 AD Pre Release Event: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 19 బుధవారం నాడు ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో అమితాబ్, కమల్‌తో మాట్లాడుతూ ప్రభాస్ తెగ సిగ్గుపడిపోయిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(1 / 7)
జూన్ 19న ముంబైలో కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. దగ్గుబాటి రానా హోస్ట్ చేసిన ఈ కార్యక్రమానికి ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, నిర్మాత సి అశ్వనిదత్, ఆయన కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్ హాజరు అయ్యారు.
(2 / 7)
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్, దీపికా పదుకొణె ఇలా బ్లాక్ కలర్ డ్రెస్సులో ఎంతో చూడముచ్చటగా కనిపించారు.
(3 / 7)
ముంబైలో జరిగిన కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ప్రభాస్‌తో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఏదో చెబుతుండగా కెమెరాలు క్లిక్‌మనిపించాయి.
(4 / 7)
కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్, కమల్, అమితాబ్, దీపికా పదుకొణె ఒక్కచోట చేరి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మాటల మధ్యలో కమల్ హాసన్‌కు ప్రభాస్ దండం పెడుతూ కనిపించాడు. అది చూసి దీపికా నవ్వడం చూడొచ్చు.
(5 / 7)
కల్కి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అంతా చేరి మాట్లాడుతుండగా మధ్య మధ్యలో ప్రభాస్ ఇలా సిగ్గుపడుతూ కనిపించాడు. అమితాబ్, దీపికా నవ్వుతూ కనిపించారు. ఈవెంట్‌లో చాలా వరకు ప్రభాస్ షై ఫీల్ అవుతూనే దర్శనం ఇచ్చాడు.
(6 / 7)
ఇక ఈ ఫొటోలో అమితాబ్ బచ్చన్‌కు ప్రభాస్ ఏదో చెబుతున్నట్లుగా కనిపిస్తోంది. కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ బ్లాక్ షర్ట్, షేడ్ బ్లాక్ జీన్స్‌తో అట్రాక్టివ్‌గా దర్శనం ఇచ్చాడు.
ఇతర గ్యాలరీలు