Gaami Twitter Review: గామి ట్విటర్ రివ్యూ.. విశ్వక్ సేన్ మూవీకి ఊహించని టాక్.. అతనికి మాత్రం గుడి కట్టాలంట!
Vishwak Sen Gaami Movie Twitter Review Telugu: వరుస సినిమాలతో సత్తా చాటుతూ దూసుకుపోతున్న విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా గామి. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా మార్చి 8న రిలీజ్ కానున్న నేపథ్యంలో గామి ట్విటర్ రివ్యూలోకి వెళితే..
Gaami Twitter Review In Telugu: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గామి. ఈ సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. కార్తిక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రానికి కార్తిక్ అండ్ క్రౌడ్ ఫండ్ చేశారు. V సెల్యులాయిడ్ సంస్థ సమర్పించింది. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే రాశారు. గామి మూవీలో విశ్వక్ సేన్‌కు జోడీగా చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించింది.
గామి సినిమాలో విశ్వక్ సేన్, చాందిని చౌదరితోపాటు ఎంజీ అభినయ, హారిక పెడాడ, మహ్మద్ సమద్ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం (మార్చి 8) ప్రేక్షకుల ముందుకు గామి సినిమా రానుంది. అయితే, ఇప్పటికే అమెరికా, యూకేలో గామి ప్రీమియర్ షోలు వేశారు. దీంతో గామి మూవీపై నెటిజన్స్, ఆడియెన్స్ ట్విటర్‌లో రివ్యూలు ఇస్తున్నారు. విశ్వక్ సేన్ కెరీర్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా వచ్చిన గామి ఎలా ఉందో ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.
"గామి విజువల్ వండర్. అత్యంత ఆసక్తికరంగా ఉంది. మ్యూజిక్ అయితే అదిరిపోయింది. గామి సినిమాను ఏం కొట్టి తీశారన్న. పక్కాగా నేషనల్ అవార్డ్ వస్తుంది. ఫిక్స్ అయిపోండి మూవీ టీమ్. విశ్వక్ సేన్ నెక్ట్స్ లెవెల్ ఉంది మూవీ. డైరెక్టర్ విద్యాధర్‌కు హ్యాట్సాఫ్. మ్యూజిక్ అయితే.." అమ్మో అని ఒక నెటిజన్ గామి సినిమాపై ప్రశంసలు కురిపించాడు.
"ఆ క్లైమాక్స్ ఈ సినిమాను మా తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకోవచ్చు. సెన్సిబిలిటీని బేస్ చేసుకుని ఇంత గొప్పగా చూపిస్తది అని గర్వంగా చెప్పుకోవచ్చు. దీన్ని పబ్లిసైజ్ చేసుకోలేకపోతే సాంబార్ తాగుతూ మల్లు సినిమాలు ఓటీటీలో చూసుకుంటూ ఆహా ఓహో అని తెలుగు సినిమా మీద కామెంట్స్ చేసుకుంటూ బతికేయొచ్చు" అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు.
"ఇప్పుడే గామి చూశాను. తెలుగు సినిమాలు కొత్తగా చూసేవారు కచ్చితంగాచూడాల్సిన సినిమా ఇది. స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. స్లోగా స్టార్ట్ అయి క్లైమాక్స్‌కు వచ్చేసరికి థ్రిల్లింగ్ ఇస్తుంది. ఔట్ స్టాండింగ్ ట్విస్ట్, టాప్ లెవెల్ బీజీఎమ్ అండ్ విజువల్స్ ఉన్నాయి. గుడిసేలో ఉమను శంకర్ టచ్ చేసే క్లైమాక్స్ సీన్‌ను చాలా బ్రిలియంట్‌గా ఎగ్జిగ్యూట్ చేశారు" అని ఒకరు తెలిపారు. "మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గానీ గుడి కట్టొచ్చు" అని మరొకరు రాసుకొచ్చారు.
"గామి సినిమా చూడటం ఇప్పుడే పూర్తయింది. సెకండ్ హాఫ్ కాస్తా స్లోగా ఉంది. కానీ, చివరి 20 నిమిషాలలో వెల్లడయ్యే సెంట్రల్ ప్లాట్ అదిరిపోయింది. ఇది భారతీయ సినిమాకు విశిష్టతను తీసుకొస్తుంది. అయితే దాన్ని ఎవరు ఎలా స్వీకరిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే సెకండాఫ్‌లో క్లైమాక్స్ ట్విస్ట్ తప్ప మిగతావన్నీ ఫ్లాట్‌గా ఉన్నాయి. ఒక సినిమాటోగ్రఫీ, బీజీఎమ్ మాత్రం ఆద్యంతం ఆకట్టుకున్నాయి" అని మరో ట్విటర్ యూజర్ తెలిపాడు.