తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas And Nag Ashwin Movie Major Schedule Completed

Prabhas | నాగ్ అశ్విన్-ప్రభాస్ మూవీ అప్డేట్.. మేజర్ షెడ్యూల్ పూర్తి

18 May 2022, 6:38 IST

    • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే గురించి ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలోని మేజర్ షెడ్యూల్ పూర్తయిందని, త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభమవుతుందని సదరు దర్శకుడు ట్విటర్ వేదికగా తెలిపారు.
ప్రభాస్
ప్రభాస్ (Pallav Paliwal)

ప్రభాస్

పాన్ఇండియా హీరో ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ చిత్రాలతో తీరిక లేకుండా ఉన్న ఆయన మరోపక్క ఇతర సినిమాలకు కూడా సమయం కేటాయిస్తున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌తో 'ప్రాజెక్ట్ కే' అనే సినిమాకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్‌ను బయటపెట్టారు దర్శకుడు. ఈ చిత్రం ఓ మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను ట్విటర్ వేదికగా స్పందనను తెలియజేశారు.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

"ప్రభాస్ ఇంట్రడక్షన్ సన్నివేశాలతో కూడిన ఓ మేజర్ షెడ్యూల్ పూర్తయింది. జూన్ నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. రిలీజ్ ఆర్డర్‌లో మనం లాస్ట్ కదా.. తరచుగా అప్డేట్స్ ఇవ్వడానికి ఇంకా సమయం పడుతుంది. నమ్మకంగా ఉండండి. అందరం ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం." అని నాగ్ అశ్విన్ ట్విటర్‌లో పేర్కొన్నారు.

'ప్రాజెక్ట్ కే' చిత్రాన్ని 400 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అమితాబ్, ప్రభాస్, దీపికా పదుకొణె లాంటి భారీ తారాగణం ఇందులో నటిస్తోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అన్నీ కుదిరితే 2023లో అత్యంత భారీ స్థాయిలో విడుదలయ్యే అవకాశముంది.

సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సాంకేతికత సహాయం కోసం నాగ్ అశ్విన్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద మహీంద్రాను సంప్రదించారు. ట్విటర్‌లో ఆయనను ట్యాగ్ చేస్తూ ఆయన మద్దతు కోరారు. అందుకు ఆనంద్ మహీంద్రా కూడా సానుకూలంగా స్పందించి దర్శకుడికి తగిన సహాయం అందేలా తన సిబ్బందిని పురమాయించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.