తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Adipurush Trailer Out Now

Adipurush Trailer Release : ఇది నా రాముడి కథ.. ఆదిపురుష్ సినిమా ట్రైలర్ విడుదల

Anand Sai HT Telugu

09 May 2023, 14:36 IST

    • Adipurush Trailer Release : ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ట్రైలర్ విడుదలైంది. గ్రాఫిక్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. 
ఆదిపురుష్ ట్రైలర్ విడుదల
ఆదిపురుష్ ట్రైలర్ విడుదల

ఆదిపురుష్ ట్రైలర్ విడుదల

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ట్రైలర్(Adipurush Cinema Trailer) విడుదలైంది. రాముడి పాత్రలో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. గ్రాఫిక్స్ మాత్రం భారీ స్థాయిలో ఉంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ట్రైలర్ విడుదలైంది. ఓం రౌత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి సనన్ సీతగా నటిస్తోంది. మైథలాజికల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ యాక్ట్ చేయగా.. జానకి పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్స్, టీజర్‌కు అభిమానుల నుంచి భారీ రెస్పార్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు

Prasanna Vadanam Twitter Review: ప్రసన్నవదనం ట్విట్టర్ రివ్యూ- సుహాస్ ఫేస్ బ్లైండ్‌నెస్‌ సస్పెన్స్ థ్రిల్లర్ ఆకట్టుకుందా

Guppedantha Manasu Serial: దేవ‌యాని త‌ప్పుకు శైలేంద్ర‌కు శిక్ష - మ‌నుకు షాకిచ్చిన రాజీవ్ - రిషి త‌మ్ముడికి వ‌సు స‌పోర్ట్

Aa Okkati Adakku Twitter Review: ఆ ఒక్కటి అడక్కు ట్విట్టర్ రివ్యూ.. అల్లరి నరేష్ కమ్ బ్యాక్ కామెడీ మూవీ హిట్ కొట్టిందా?

Krishna mukunda murari today episode: మురారిని బోల్తా కొట్టించిన మీరా.. కృష్ణ మీద అమితమైన ప్రేమ చూపిస్తున్న భవానీ

ఇది నా రాముడి కథ అంటూ హనుమంతుడు చెప్పడంతో ట్రైలర్ మెుదలవుతుంది. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడు అయిన మహానీయుడు. ఆయన జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ అంటూ ట్రైలర్లో వాయిస్ ఓవర్ వస్తుంది. నా రాఘవుడి కథే రామాయణం అని చెప్పడంతో స్టోరీ మెుదలవుతోంది. ఆ తర్వాత రావణుడు పర్ణశాలకు వచ్చిన సీన్ చూపించారు. రాముడి ఆగమనం, ఆయోధ్య పరిచయం ఇలా కొనసాగించి చివరికి రామ, రావణ యుద్ధం షాట్లతో ట్రైలర్‌ను ముగించేశారు.

ఈ ట్రైలర్ విజువల్ వండర్ గా కనిపిస్తుంది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌(Prabhas Fans) కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చినట్టే ఉంది. టీజర్‌తో వచ్చిన నెగెటివిటీ అంతా ట్రైలర్‌తో పోతుంది. ట్రైలర్లో విజువల్స్ బాగా ఉన్నాయి. ప్రభాస్‌ లుక్స్‌(Prabhas Looks) విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా ఉన్నారు. ట్రైలర్‌ చివరి షాట్‌ మాత్రం బాగుంది. శివలింగం ముందు రావణుడు పూజ చేస్తున్న షాట్‌ సూపర్ గా ఉంది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ ఫ‌స్ట్‌వీక్‌లో తిరుప‌తిలో నిర్వహించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాగే తెలంగాణ‌లోని భ‌ద్రాచ‌లంలో ఓ స్పెష‌ల్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

రామాయణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ ద‌ర్శకత్వం వ‌హిస్తోన్నాడు. చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్రతీకగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తోన్నాడు. జాన‌కిగా కృతిస‌న‌న్ క‌నిపిస్తోంది. లంకాధిప‌తి రావ‌ణాసురుడిగా సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నాడు.

మోష‌న్‌క్యాప్చర్, త్రీడీ టెక్నాల‌జీతో దాదాపు ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఆదిపురుష్ మూవీ(Adipurush Movie) రూపొందుతోంది. ఐమాక్స్ వెర్షన్ లోనూ ఆదిపురుష్‌ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మెుదట ఆదిపురుష్‌ సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలోనే రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ టీజ‌ర్‌లోని గ్రాఫిక్స్‌పై పెద్ద ఎత్తున‌ విమర్శలు వచ్చాయి. వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ మార్పులు చేసిన త‌ర్వాతే సినిమాను రిలీజ్ చేయాల‌ని భావించిన చిత్ర యూనిట్ జూన్ 16న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.