Adipurush Trailer Event: 70 దేశాల్లో ఆదిపురుష్ ట్రైల‌ర్ రిలీజ్ - గ్లోబ‌ల్ ఈవెంట్ ప్లాన్ అదిరిందిగా-prabhas adipurush trailer to release in 70 countries ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Adipurush Trailer To Release In 70 Countries

Adipurush Trailer Event: 70 దేశాల్లో ఆదిపురుష్ ట్రైల‌ర్ రిలీజ్ - గ్లోబ‌ల్ ఈవెంట్ ప్లాన్ అదిరిందిగా

Nelki Naresh Kumar HT Telugu
May 06, 2023 08:38 AM IST

Adipurush Trailer Event: ప్ర‌భాస్ ఆదిపురుష్ ట్రైల‌ర్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. ట్రైల‌ర్ రిలీజ్ వేడుక‌ను గ్లోబ‌ల్ ఈవెంట్‌ గా భారీ స్థాయిలో నిర్వ‌హించ‌బోతున్నారు.

ప్ర‌భాస్ ఆదిపురుష్
ప్ర‌భాస్ ఆదిపురుష్

Adipurush Trailer Event: ప్ర‌భాస్ ఆదిపురుష్ ట్రైల‌ర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స‌యింది. మే 9న ఆదిపురుష్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు శ‌నివారం చిత్ర యూనిట్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. ఈ ట్రైల‌ర్ రిలీజ్ వేడుక‌ను గ్లోబ‌ల్ ఈవెంట్‌గా ప్లాన్ చేశారు.

70 దేశాల్లో ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్‌ ట్రైల‌ర్‌ను థియేట‌ర్ల‌లో స్క్రీనింగ్ చేయ‌బోతున్నారు. ఇందుకోసం తెలంగాణ‌, ఆంధ్రాలో దాదాపు 105 థియేట‌ర్ల‌ను సెలెక్ట్ చేసిన‌ట్లు తెలిసింది. త్రీడీలో ట్రైల‌ర్ స్క్రీనింగ్ ఉంటుంద‌ని స‌మాచారం.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ ఫ‌స్ట్‌వీక్‌లో తిరుప‌తిలో నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే తెలంగాణ‌లోని భ‌ద్రాచ‌లంలో ఓ స్పెష‌ల్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది.

రాముడిగా ప్ర‌భాస్‌...

రామాయణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్ర‌తీక‌గా తెర‌కెక్కుతోన్న‌ ఈ మూవీలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌ను పోషిస్తోన్నాడు. జాన‌కిగా కృతిస‌న‌న్ క‌నిపిస్తోంది. లంకాధిప‌తి రావ‌ణాసురుడిగా సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నాడు.

మోష‌న్‌క్యాప్చ‌ర్, త్రీడీ టెక్నాల‌జీతో దాదాపు ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఆదిపురుష్ మూవీ రూపొందుతోంది. ఐమాక్స్ వెర్ష‌న్‌లోనూ ఆదిపురుష్‌ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. తొలుత ఆదిపురుష్‌ సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలోనే రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు.

కానీ టీజ‌ర్‌లోని గ్రాఫిక్స్‌పై పెద్ద ఎత్తున‌ విమ‌ర్శ‌లొచ్చాయి. వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ మార్పులు చేసిన త‌ర్వాతే సినిమాను రిలీజ్ చేయాల‌ని భావించిన చిత్ర యూనిట్ జూన్ 16కు రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేసింది.

IPL_Entry_Point