Prabhas Kriti Sanon: వచ్చే వారం మాల్దీవ్స్‌లో ప్రభాస్, కృతి సనన్ నిశ్చితార్థమట!-prabhas kriti sanon engagement in maldives next week says umair sandhu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Kriti Sanon: వచ్చే వారం మాల్దీవ్స్‌లో ప్రభాస్, కృతి సనన్ నిశ్చితార్థమట!

Prabhas Kriti Sanon: వచ్చే వారం మాల్దీవ్స్‌లో ప్రభాస్, కృతి సనన్ నిశ్చితార్థమట!

Hari Prasad S HT Telugu

Prabhas Kriti Sanon: వచ్చే వారం మాల్దీవ్స్‌లో ప్రభాస్, కృతి సనన్ నిశ్చితార్థమట. ఇప్పుడీ వార్త తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిని అభిమానులు మాత్రం చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. దీనికి కారణమేంటో చూడండి.

ప్రభాస్‌తో కృతి సనన్

Prabhas Kriti Sanon: ప్రభాస్, కృతి సనన్ డేటింగ్ పుకార్లు ఇప్పటికే ఎన్నోసార్లు తెరపైకి వచ్చిన సంగతి తెలుసు కదా. ఈ ఇద్దరూ కలిసి ఆదిపురుష్ మూవీలో రాముడు, సీతగా నటించారు. దీంతో అప్పటి నుంచే వీళ్ల మధ్య ఏదో నడుస్తోందన్న వార్తలు వచ్చాయి. ఆ మధ్య ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ప్రభాస్ కు చెమటలు పడుతుంటే కృతి తన దుపట్టా ఇస్తున్న వీడియో కూడా వైరల్ అయింది.

పైగా ఆ మధ్య ఓ షోలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కూడా ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్నట్లుగా చేసిన కామెంట్స్ ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చాయి. అయితే తర్వాత అతని కామెంట్స్ పై కృతి స్పందించింది. తమ ఇద్దరి మధ్య ఇలాంటి సరదా కౌంటర్లు కామనే అని స్పష్టం చేసింది. తన పెళ్లి తేదీని కూడా మరెవరో అనౌన్స్ చేసే ముందే ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నానని, ఈ వార్తలు పూర్తిగా నిరాధారమని తేల్చిచెప్పింది.

అయితే తాజాగా మరోసారి ఈ ఇద్దరి రిలేషన్షిప్ తెరపైకి వచ్చింది. ప్రముఖ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమేర్ సంధు చేసిన ట్వీట్ దీనికి కారణమైంది. వచ్చే వారమే ప్రభాస్, కృతి సనన్ మాల్దీవ్స్ లో నిశ్చితార్థం చేసుకుంటున్నారని, ఇది చాలా సంతోషకరమైన వార్త అంటూ ట్వీట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ గా మారింది.

అయితే అతని సినిమాల రివ్యూలలాగే ఈ వార్తను కూడా ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. పైగా కొందరు అభిమానులు ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. కేటిరింగ్ ఆర్డర్ కూడా నీకే దక్కిందటగా.. బిర్యానీ బాగా చేసేలా చూడు అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ఇక మరొకరు స్పందిస్తూ.. ప్రభాస్ ఈ ఈవెంట్ కు వస్తున్నాడా అని సరదాగా అన్నారు.

ఇంకొక అభిమాని ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. ఈ విషయం ఎవరు చెప్పారు? ప్రభాసే చెప్పాడా? కృతి సనన్ నీకు ఎంగేజ్‌మెంగ్ ఆహ్వానం అందిందా? అందితే ఆ స్క్రీన్ షాట్ పంపించు అని రాశారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈసారి ప్రభాస్, కృతి కాకుండా అభిమానులే తేల్చేయడం విశేషం.

సంబంధిత కథనం