Unstoppable with Prabhas Release Promo: ప్రభాస్‌, బాలయ్య, గోపీచంద్‌ నవ్వులే నవ్వులు-unstoppable with prabhas release promo guarantees fun ride ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Unstoppable With Prabhas Release Promo Guarantees Fun Ride

Unstoppable with Prabhas Release Promo: ప్రభాస్‌, బాలయ్య, గోపీచంద్‌ నవ్వులే నవ్వులు

ప్రోమోలో ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్ మధ్య ఓ సరదా సందర్భం
ప్రోమోలో ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్ మధ్య ఓ సరదా సందర్భం

Unstoppable with Prabhas Release Promo: ప్రభాస్‌, బాలయ్య, గోపీచంద్‌ నవ్వులతో అన్‌స్టాపబుల్ షో మరో ప్రోమో రిలీజ్‌ అయింది. బాహుబలి ఎపిసోడ్‌ అంటూ తొలి ఎపిసోడ్‌ను డిసెంబర్‌ 30న స్ట్రీమ్‌ చేసిన ఆహా ఓటీటీ.. జనవరి 6న మరో ఎపిసోడ్‌ను తీసుకొస్తోంది.

Unstoppable with Prabhas Release Promo: ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే షో ఇప్పటికే హిట్‌ టాక్‌ కొట్టేసింది. టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖులతో బాలకృష్ణ చేస్తున్న ఈ షో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. మెల్లమెల్లగా ఈ షోకు తీసుకొస్తున్న గెస్ట్‌ల విషయంలోనూ ఆహా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ మధ్యే యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో చేసిన ఎపిసోడ్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

ప్రభాస్‌ టాక్‌ షోను ఒకే ఎపిసోడ్‌తో ముగించడం కష్టమని భావించి.. రెండుగా చేశారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్‌ వచ్చే శుక్రవారం (జనవరి 6) స్ట్రీమ్‌ కానుంది. ఇందులో ప్రభాస్‌తోపాటు మ్యాచో స్టార్‌ గోపీచంద్‌ కూడా రానున్నాడు. దీనికి సంబంధించి బుధవారం (జనవరి 4) ఆహా ఓటీటీ ఓ రిలీజ్‌ ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ ప్రోమో చాలా సరదాగా సాగిపోయింది.

తొలి ఎపిసోడ్‌ కంటే రెండో ఎపిసోడ్‌ మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించనుందని ఈ ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. "ఏదన్నా ఫుల్లుగా చెప్పు.. సగంసగం మాత్రం.." అంటూ గోపీచంద్‌కు ప్రభాస్‌ వార్నింగ్‌తో ఈ ప్రోమో మొదలైంది. అంతలో బాలకృష్ణ కలగజేసుకొని.. ఈ సెక్షన్‌ ఏందంటే.. నిజం బయటపడిపోతుందని దబాయించేస్తారు అంటూ ప్రభాస్‌ను ఉద్దేశించి బాలయ్య సరదాగా కామెంట్ చేశాడు.

వార్నింగ్‌లు ఇవ్వొద్దని కూడా ప్రభాస్‌కు బాలకృష్ణ సూచించాడు. అదే సమయంలో గోపీచంద్‌ను సరదాగా తోసేస్తూ ప్రభాస్‌ కనిపించాడు. "మరి ఏ అమ్మాయి అని ఎందుకు అడిగారు" అని ప్రభాస్‌ అంటే.. అబ్బా నాకే ట్విస్టా అంటూ బాలయ్య సమాధానమిచ్చాడు. ఇలా ఈ ప్రోమో చాలా సరదాగా సాగిపోయింది.

తొలి ఎపిసోడ్‌లో ప్రభాస్‌ తన డేటింగ్‌ రూమర్లు, పెళ్లిపై స్పందించగా.. రెండో ఎపిసోడ్‌లో ప్రభాస్‌, గోపీచంద్‌ మధ్య ఒకప్పుడు గొడవ జరిగిందన్న వార్తలపై వాళ్ల రియాక్షన్‌ను సరదాగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రోమో గోపీచంద్‌ డైలాగ్స్‌ మాత్రం ఏమీ కనిపించలేదు.

సంబంధిత కథనం