NBK108 Update: బాలకృష్ణ తదుపరి చిత్రంపై క్రేజీ అప్డేట్.. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్‌తో ప్రారంభం-blakrishna and anil ravipudi movie nbk108 begins with high voltage action scene
Telugu News  /  Entertainment  /  Blakrishna And Anil Ravipudi Movie Nbk108 Begins With High Voltage Action Scene
అనిల్ రావిపూడితో బాలకృష్ణ సినిమా
అనిల్ రావిపూడితో బాలకృష్ణ సినిమా (Twitter)

NBK108 Update: బాలకృష్ణ తదుపరి చిత్రంపై క్రేజీ అప్డేట్.. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్‌తో ప్రారంభం

06 December 2022, 10:59 ISTMaragani Govardhan
06 December 2022, 10:59 IST

NBK108 Update: నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 18న లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌ను మొదటి షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నారు.

NBK108 Update: నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలతో మంచి జోరు మీదున్నాడు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క అన్‌స్టాపబుల్ లాంటి రియాల్టీ షోల్లోనూ అదరగొడుతున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరిసింహారెడ్డి అనే చిత్రం చేస్తున్నారు. ఇది బాలయ్య నటిస్తున్న 107వ చిత్రం కావడం విశేషం. ఇది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఈ సినిమా పూర్తి కావస్తుంది. ఒ పక్క ఈ సినిమా పూర్తి చేస్తూనే.. తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు నందమూరి బాలకృష్ణ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఆయన.. ఆ సినిమా కోసం కసరత్తులు ప్రారంభించారు.

NBK108గా రానున్న ఈ చిత్రం కోసం అనిల్ రావిపూడి ఓ సాలిడ్ స్క్రిప్టు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇంతవరకు బాలయ్య పోషించని పాత్రను ఆయన కోసం అనిల్ సిద్ధం చేశారట. క్యారెక్టర్ కొత్తగా ఉండమే కాకుండా తన మార్కు వినోదం కూడా ఉంటుందని అనిల్ రావిపూడి గతంలో చెప్పారు.

ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఈ నెలలోనే జరుగుతాయని తెలుస్తోంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబరు 8వ తేదీన NBK108 లాంచ్ కానున్నట్లు సమాచారం. అంతేకాకుండా తదుపరి 12 రోజుల్లోనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేయనున్నారట. హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌తో ఈ సినిమా ప్రారంభం కానుందట. ఇందుకోసం హైదరాబాద్‍‌లో ఓ భారీ సెట్‌ను ఏర్పాటు చేశారట.

ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కీలక పాత్రలో నటించనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించి త్వరలోనే ఇతర వివరాలను చిత్రబృందం తెలియజేయనుంది.

సంబంధిత కథనం

టాపిక్