Chiranjeevi and Balakrishna Multi starrer: చిరంజీవి-బాలకృష్ణ మల్టీ స్టారర్.. అల్లు అరవింద్ ప్లాన్ సెట్ అవుతుందా?-allu aravind reveals he wants to plan chiranjeevi and balakrishna multi starrer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Allu Aravind Reveals He Wants To Plan Chiranjeevi And Balakrishna Multi Starrer

Chiranjeevi and Balakrishna Multi starrer: చిరంజీవి-బాలకృష్ణ మల్టీ స్టారర్.. అల్లు అరవింద్ ప్లాన్ సెట్ అవుతుందా?

బాలయ్య-చిరంజీవి
బాలయ్య-చిరంజీవి

Chiranjeevi and balakrishna Multi starrer: బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ 2 షోలో ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు బీఏ హాజరయ్యారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది.

Chiranjeevi and balakrishna Multi starrer: నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క వ్యాఖ్యతగానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం వీరసింహారెడ్డి చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న ఆయన.. అన్‌స్టాపబుల్ షోతోనూ ప్రేక్షకులకు కిక్ ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం అన్‌స్టాపబుల్ సీజన్ 2 నడుస్తోంది. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు నాలుగు ఎపిసోడ్లు రాగా.. ఐదో ఎపిసోడ్ శుక్రవారం ప్రసారం కానుంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్ విడుదలైంది.

ట్రెండింగ్ వార్తలు

ఈసారి ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్‌తో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా విచ్చేశారు. ఈ ప్రోమోను గమనిస్తే.. సెలబ్రేటింగ్ 90 ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమా అంటూ సీనియర్ ఎన్టీఆర్ కటౌట్ల చూపిస్తూ బాలకృష్ణ ఎంట్రీ ఇస్తారు. "తెలుగు సినిమా పొత్తిళ్లలో పుట్టినవాళ్లు, సినిమానే ప్రపంచంగా పెరిగినవాళ్లు ఇవాళ మన నిర్మాతలు" అంటూ అల్లు అరవింద్, సురేష్ బాబును ఆహ్వానిస్తారు బాలయ్య. "నాకు మీ ఇద్దరినీ చూస్తుంటే భలేదొంగ, మంచి దొంగ.. ఇలాంటి దొంగ సినిమాలన్నీ గుర్తుకొస్తున్నాయి." అని ఈ బడా నిర్మాతలపై బాలకృష్ణ పంచ్ వేస్తారు. "సురేష్ బాబుతో నా అనుబంధం గురించి తెలిసే ఉంటుంది.. ఇక పాయింట్ ఏంటంటే మనిద్దరి కాంబినేషనే బ్యాలెన్స్" అంటూ బాలకృష్ణ అల్లు అరవింద్‌ను అడుగుతారు.

ఇందుకు అల్లు అరవింద్ సమాధానం చెబుతూ.. మీరు, చిరంజీవి గారి కాంబినేషన్‌లో తీద్దామని వెయిట్ చేస్తున్నానని అంటారు. అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందని బాలయ్య చెప్పగానే.. సెట్‌లో ప్రేక్షకులు అరుపులు, ఈలలతో హోరెత్తించారు. ఇప్పటికే మెగా, నందమూరి అభిమానుల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుందనే విషయం అందరికే తెలిసిందే. అవన్నీ పక్కన బెట్టి ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించారు. తాజాగా అల్లు అరవింద్ ప్లాన్ చేసిన ప్రకారం చిరంజీవీ, రామ్ చరణ్ కలిసి నటిస్తే ఇంక వేరే లెవల్‌లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎంట్రీ ఇస్తారు. "రాఘవేంద్రరావు బీఏలో బీఏ అంటే అర్థం ఏంటో తెలుసా? బొడ్డు మీద యాపిల్" అంటూ అల్లు అరవింద్ నవ్వులు పూయిస్తారు. "న్యూటన్ ఆపిల్ పడినప్పుడు గ్రావిటీని కనిపెట్టాడు. నేను ఎక్కడ పడాలో కనిపెట్టాను" అంటూ రాఘవేంద్రరావు కూడా తనదైన రీతిలో వినోదాన్ని అందిస్తారు. మొత్తానికి ఈ ప్రోమో వినోదభరితంగా, ఆసక్తికరంగా సాగింది. శుక్రవారం సాయంత్రం 9 గంటలకు దీని పూర్తి ఎపిసోడ్ ఆహా వేదికగా విడుదల కానుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.