NBK108: బాలయ్య-అనిల్ రావిపూడి కాంబో రెడీ.. తమన్ BGM అదిరింది.. థియేటర్లో పూనకాలే-here the nandamuri balakrishna and anil ravipudi new movie nbk108 update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Here The Nandamuri Balakrishna And Anil Ravipudi New Movie Nbk108 Update

NBK108: బాలయ్య-అనిల్ రావిపూడి కాంబో రెడీ.. తమన్ BGM అదిరింది.. థియేటర్లో పూనకాలే

Maragani Govardhan HT Telugu
Aug 11, 2022 06:03 PM IST

బాలకృష్ణ హీరోగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

NBK 108
NBK 108 (Twitter)

నందమూరి నటసింహం మంచి జోరు మీదున్నాడు. గతేడాది అఖండ్ లాంటి సూపర్ హిట్ తిరిగి గాడిలో పడిన మన బాలయ్య ఇప్పటికే గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం సెట్‌పై ఉండగా మరో ప్రాజెక్టుకు పచ్చా జెండా ఉపారు బాలకృష్ణ. ఇటీవలే ఎఫ్-3 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రానికి ఓకే చెప్పారు. NBK108 వర్కింగ్ టైటిల్‌గా ఇది రాబోతుంది. ఈ సినిమాపై అభిమానులు కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర అప్డేట్ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

బాలకృష్ణ-అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించి ప్రత్యేక వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. తమన్ తన బీజీఎంతో అదరగొట్టారు. NBK108ను ఎనౌన్స్ చేస్తున్నట్లు బీజీఎం కొట్టారు. దీంతో వీడియోను చూసిన అభిమానులు ఇప్పటికే అంచనాలు పెంచేసుకున్నారు. ఇంట్రోకే ఈ రేంజ్‌లో ఇస్తే.. ఇంక సినిమాలో నేపథ్య సంగీతం ఏ రేంజ్‌లో ఉంటుందోనని, పూనకాలతో ఊగిపోవడం ఖాయమని భావిస్తున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడు చూడని లుక్‌లో కనిపిస్తారని వినికిడి. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవనుంది. ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందొతున్న ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించనుంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి నిర్మిస్తున్నారు.

మరోపక్క బాలకృష్ణ.. గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. NBK 107 వర్కింగ్ టైటిల్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సాయి మాధవన్ బుర్రా సంభాషణలు రాశారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.