తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan Shootings: అన్ని సినిమాల షూటింగ్‌లు ఆపేసిన పవన్‌ కల్యాణ్‌!

Pawan Kalyan Shootings: అన్ని సినిమాల షూటింగ్‌లు ఆపేసిన పవన్‌ కల్యాణ్‌!

HT Telugu Desk HT Telugu

14 November 2022, 16:13 IST

    • Pawan Kalyan Shootings: అన్ని సినిమాల షూటింగ్‌లు ఆపేశాడు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. రాజకీయాల్లో బిజీ అవుతున్న అతడు మెల్లగా తన చేతుల్లో ఉన్న ప్రాజెక్టులను పక్కన పెట్టేస్తున్నాడు.
రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్
రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్

రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్

Pawan Kalyan Shootings: టాలీవుడ్‌ పవర్‌స్టార్‌గా, జనసేన అధినేతగా రెండు పడవలపై ప్రయాణం పవన్‌ కల్యాణ్‌కు రానురాను కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రంజుగా సాగుతుండటం, సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పవన్‌ ఎక్కువ పార్టీ పనులకే సమయం కేటాయించాల్సి వస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

దీంతో సినిమాలకు తప్పనిసరి పరిస్థితుల్లో బ్రేక్‌ ఇవ్వాల్సి వస్తోంది. ఇప్పటికే పవన్‌ చేతుల్లో పలు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్‌సింగ్‌, వినోదయ సీతమ్‌ రీమేక్‌, మరో ప్రాజెక్ట్‌ ఉన్నాయి. కానీ కొన్నాళ్లుగా జనసేనకే ఎక్కువ సమయం ఇస్తున్న పవన్‌ వీటి షూటింగ్‌లు చేయలేకపోతున్నాడు. ఇప్పటికే హరిహరి వీరమల్లు షూటింగ్‌ సగం పూర్తయింది.

ఆ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఆ మూవీ షూటింగ్‌ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉంది. పైగా ఆ మూవీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. క్రిష్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చారిత్రక మూవీపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో తొలి ప్రాధాన్యతగా ఆ మూవీకి తన బిజీ షెడ్యూల్‌లోనూ కొన్ని డేట్లు ఇచ్చి ఎలాగోలా పూర్తి చేయాలని చూస్తున్నాడు.

ఆ ఒక్క మూవీ షూటింగ్ మాత్రం పూర్తి చేసి మిగతా వాటిని పక్కన పెట్టేయాలని పవన్‌ భావిస్తున్నాడు. ఇప్పటికే హరీష్‌ శంకర్‌ భవదీయుడు భగత్‌సింగ్‌ మూవీ పూర్తిగా అటకెక్కినట్లే కనిపిస్తోంది. ఇక వినోదయ సీతమ్‌ రీమేక్‌ కోసం కూడా పవన్‌ సంతకం చేశాడు. అయితే ఆ మూవీ షూటింగ్‌ ఇంకా ప్రారంభమే కాలేదు. దీంతో ఆ సినిమాను హోల్డ్‌లో ఉంచేశాడు.

సుజీత్‌ డైరెక్షన్‌లో మరో మాస్‌ ఎంటర్‌టైనర్‌కు కూడా పవన్‌ గతంలో ఓకే చెప్పాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమా కూడా ముందుకు సాగడం అసాధ్యం. 2024 సాధారణ ఎన్నికల తర్వాతే పవన్‌ మళ్లీ రెగ్యులర్‌గా సినిమా షూటింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆలోపు అతన్ని ఒక్క హరిహర వీరమల్లులో మాత్రమే చూసే అదృష్టం అతని అభిమానులకు దక్కనుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.