Telugu News  /  Entertainment  /  Mm Keeravani Shares Pawan Kalyan Photo From Hari Hara Veera Mallu Sets
పవన్ కల్యాణ్‌తో కీరవాణి
పవన్ కల్యాణ్‌తో కీరవాణి

Pawan Kalyan Movie Update: హరి హర వీర మల్లు నుంచి అదిరిపోయే అప్డేట్.. కీరవాణి పోస్ట్ వైరల్..!

30 September 2022, 15:55 ISTMaragani Govardhan
30 September 2022, 15:55 IST

MM Keeravani Shares Pawan Kalyan Pic: హరి హర వీర మల్లు షూటింగ్‌లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసిన దిగిన పొటోను షేర్ చేశారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఈ ఫొటోల పవర్ స్టార్ అసలైన వారియర్ వలే కనిపిస్తున్నారు.

Hari Hara veera Mallu Update: ఓ పక్క రాజకీయాలతో పాటు మరోపక్క సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు మన పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రెండు రంగాలను సమతూల్యంగా బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుత క్రిష్ దర్శకత్వంలో హరి హర వీర మల్లు సినిమాను చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవర్ స్టార్ పోరాట యోధుడి పాత్రలో కనిపించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఎంఎం కీరవాణి పవన్ కల్యాణ్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

నవరాత్రుల్లో నవ ఉత్తేజం అంటూ పవన్ కల్యాణ్‌తో తను దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల వేదికగా కీరవాణి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో పవర్ స్టార్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు.

భీమ్లా నాయక్ తర్వాత పవర్ స్టార్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానులు అంచనాలను భారీగా పెట్టేసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం చూస్తున్న సమయంలో కీరవాణి పెట్టిన ఈ పోస్ట్ వారిలో ఉత్సహాన్ని నింపింది. ఈ ఫొటోను గమనిస్తే హరి హర వీర మల్లుకు సంబంధఇంచిన వర్క్ షాప్ ప్రారంభమైనట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం హరి హర వీర మల్లు షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేయగా.. అక్టోబరు 17 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ ఎం రత్నం సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఇది విడుదల కానుంది.

టాపిక్