Keeravani: రసూల్ పూకుట్టిపై కీరవాణి అసభ్యకర కామెంట్.. అమ్మో అంత మాటన్నాడేంటి?-rrr music director mm keeravani lewd comment to resul pookutty ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Keeravani: రసూల్ పూకుట్టిపై కీరవాణి అసభ్యకర కామెంట్.. అమ్మో అంత మాటన్నాడేంటి?

Keeravani: రసూల్ పూకుట్టిపై కీరవాణి అసభ్యకర కామెంట్.. అమ్మో అంత మాటన్నాడేంటి?

Maragani Govardhan HT Telugu
Jul 07, 2022 03:28 PM IST

రసూల్ పూకుట్టిపై ఆర్ఆర్ఆర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అభ్యంతకరమైన కామెంట్ చేశారు. ఆయన పేరును అసభ్యకరంగా వాడుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

<p>రసూల్ పూకుట్టిపై కీరవాణి అసభ్యకర కామెంట్</p>
రసూల్ పూకుట్టిపై కీరవాణి అసభ్యకర కామెంట్ (Twitter)

ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఆస్కార్ విన్నర్ సాంకేతిక నిపుణుడు రసూల్ పూకుట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ కథను గే లవ్ స్టోరీగా సంబోధిస్తూ ఆయన చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేసింది. దీంతో అతడిపై రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులే కాకుండా నెటిజన్లు కూడా తెగ ఫైర్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా అతడికి తమ ట్వీట్ల రూపంలో స్ట్రాంగ్ రిప్లయి ఇస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన ఎంఎం కీరవాణి తనదైన శైలిలో ఆయనపై విరుచుకుపడ్డారు. ఇంకాస్త శృతి మించి అసభ్యకరమైన పదజాలాన్ని ఆయనపై వాడుతూ ట్వీట్ చేశారు.

కీరవాణి తన ట్విట్టర్‌లో రసూల్ పూకుట్టిని పేరును అభ్యంతకరమైన పదంతో ఉపయోగించారు. ఇంగ్లీష్ భాషలో "P*OKUtty" అంటూ ఆయన పేరును తెలుగులో అసభ్యకర పదం వచ్చేలా మెన్షన్ చేశారు.

"అక్షరాలను టైప్ చేసేటప్పుడు పెద్ద, చిన్న అక్షరాలను ఉపయోగించడంలో నాకు అంతగా రాకపోవచ్చు. కానీ రసూల్ పూకుట్టితో సహా ప్రతి వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛను నేను గౌరవిస్తాను" అంటూ కీరవాణి.. రసూల్‌కు బాహుబలి నిర్మాత శోభూ యార్లగడ్డ ఇచ్చిన రిప్లయికి ప్రతిస్పందనగా ఈ ట్వీట్ చేశారు. కీరవాణి ఈ పోస్టులో రసూల్ పూకుట్టి అనే పేరును అసభ్యకరమైన అర్థం వచ్చేలా రాశారు.

ఈ ట్వీట్‌ను చదివిన తెలుగువారికి ఎవ్వరికైనా.. కీరవాణి ఏ అర్థంతో ఆ పదం రాశారో సులభంగా అర్థమవుతుంది. ఆయన మెన్షన్ చేసిన పదంలో డాట్స్‌ను చూస్తే ఇట్టే కనెక్ట్ అవుతారు. అయితే కీరవాణి లాంటి దిగ్గజ సంగీత దర్శకుడి నుంచి ఇలాంటి ప్రతిస్పందనలు రావడం.. నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది. ఆయనను ఎక్కువ మంది విమర్శిస్తున్నారు. రసూల్.. ఆర్ఆర్ఆర్ చిత్రంపై చేసిన కామెంట్ తప్పే కావచ్చు.. కానీ కీరవాణి ఇలా వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.

అయితే తను చేసిన ట్వీట్ తప్పని అర్థం చేసుకున్నారో ఏమో తెలియదు.. కానీ ఆయన వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు. అప్పటికే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెట్టింట ఆయన చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్లు దర్శనమిస్తాయి. మొత్తానికి రసూల్ పూకుట్టి వ్యవహారం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

<p>కీరవాణి అభ్యంతకర ట్వీట్</p>
కీరవాణి అభ్యంతకర ట్వీట్ (Twitter)
Whats_app_banner

సంబంధిత కథనం