తెలుగు న్యూస్  /  Entertainment  /  Parineeti Chopra And Raghav Chadha Enjoy Ipl Match In Mohali

Parineeti Chopra : స్టేడియంలో రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా.. వదిన అంటూ ఫ్యాన్స్ కేకలు

Anand Sai HT Telugu

04 May 2023, 14:13 IST

    • Parineeti Chopra-Raghav Chadha : ప్రేమ, పెళ్లికి సంబంధించి సైలెన్స్ మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చారు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా. ఇప్పుడు ఓపెన్ అయ్యారు. తాజాగా ఈ జంట మెుహలీ స్టేడియంలో కనిపించింది.
పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా
పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా (Instagram)

పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) పెళ్లి చేసుకుంటారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. వీరిద్దరి డేటింగ్, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే పుకార్లు చాలా కాలంగా ఉన్నాయి. వారి నిశ్చితార్థం, పెళ్లి గురించి అందరూ మాట్లాడుకుంటున్నా.. ఈ జంట మాత్రం సైలెంట్ గా ఉంది. అయితే తాజాగా పరిణీతి చోప్రా, రాఘవ చద్దా(Parineeti Chopra-Raghav Chadha) మొహాలీలో జరిగిన పంజాబ్ కింగ్స్ Vs ముంబై ఇండియన్స్ IPL మ్యాచ్‌లో కనిపించారు. స్టేడియంలో వారు నిలుచున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Prasanna Vadanam Twitter Review: ప్రసన్నవదనం ట్విట్టర్ రివ్యూ- సుహాస్ ఫేస్ బ్లైండ్‌నెస్‌ సస్పెన్స్ థ్రిల్లర్ ఆకట్టుకుందా

Guppedantha Manasu Serial: దేవ‌యాని త‌ప్పుకు శైలేంద్ర‌కు శిక్ష - మ‌నుకు షాకిచ్చిన రాజీవ్ - రిషి త‌మ్ముడికి వ‌సు స‌పోర్ట్

Aa Okkati Adakku Twitter Review: ఆ ఒక్కటి అడక్కు ట్విట్టర్ రివ్యూ.. అల్లరి నరేష్ కమ్ బ్యాక్ కామెడీ మూవీ హిట్ కొట్టిందా?

Krishna mukunda murari today episode: మురారిని బోల్తా కొట్టించిన మీరా.. కృష్ణ మీద అమితమైన ప్రేమ చూపిస్తున్న భవానీ

రాఘ‌వ్ చ‌ద్దా(Raghav Chadha)తో క‌లిసి ప‌రిణీతి చోప్రా(Parineeti Chopra) మొహాలీ స్టేడియంలో హ‌ల్ చ‌ల్ చేసింది. రాఘవ్ తో ఉన్న ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన ఫ్యాన్స్.. వారిద్దరి మధ్య పెళ్లి నిజమే అని మాట్లాడుకుంటున్నారు. పరిణీతిని చూసిన ఫ్యాన్స్.. బాబి అంటూ కేకలు వేశారు. కొంతమంది వదిన అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

వీరికి సంబధించి.. ఓ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో ఫ్యాన్స్ ఈ జంటను ఉత్సాహపరుస్తూ, బాబి అని అరవడం వినిపిస్తోంది. ఇది విన్న పరిణీతి చోప్రా సిగ్గుపడినట్టుగా కనిపించింది. రాఘవ్, పరిణీతి చిరునవ్వుతో అభిమానుల వైపు తిరిగి చూశారు.

పరిణీతి చోప్రా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్త సోషల్ మీడియా(Social Media)లో చాలా రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఢిల్లీకి చెందిన అధికార పార్టీ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(MP Raghav Chadha)ను వివాహం చేసుకుంటారని చెబుతున్నారు. చాలా రోజులుగా వారిద్దరూ రిలేషన్ లో ఉన్నా.. మార్చిలో ఈ విషయం బయటకు వచ్చింది. ఇద్దరూ కలిసి.. ఓ హోటల్ లో డిన్నర్ డేట్ కు వచ్చినప్పుడు అసలు విషయం తెలిసింది. వెంటనే ఈ వార్త వైరల్ అయింది.

ఇక ఆ సమయం నుంచి ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ దీని మీద సరైన క్లారిటీ లేదు. అయితే మే 13న కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఫ్రెండ్ సమక్షంలో దిల్లీలో ఎంగేజ్ మెంట్ కూడా జరుగుతుందనే ప్రచారం ఉంది. అక్టోబర్లో వీరి పెళ్లి జరుగుతుందని అంటున్నారు. ఈ వార్తలపై ఇటు పరిణీతి చోప్రా, అటు రాఘవ్ కానీ ఏం మాట్లాడటం లేదు. తాజాగా స్టేడియంలో కనిపించేసరికి.. వీరి పెళ్లి నిజమేనని అంతా ఫిక్స్ అయిపోయారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.