OTT Horror Movie: యూట్యూబ్‌తోపాటు మరో 5 ఓటీటీల్లో వణికించే హారర్ మూవీ- కానీ, ఇదే పెద్ద ట్విస్ట్!
20 August 2024, 14:59 IST
Tarot Digital Premiere On 5 OTT Platforms: భయంతో వణికించే హారర్ సినిమా టారోట్ ఇప్పుడు ఏకంగా ఐదు ఓటీటీలతోపాటు యూట్యూబ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఆరింట్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న కూడా ఆ ఒక్క విషయం మాత్రం పెద్ద ట్విస్ట్‌గా మారింది. మరి అదేంటనే వివరాల్లోకి వెళితే..
యూట్యూబ్‌తోపాటు మరో 5 ఓటీటీల్లో వణికించే హారర్ మూవీ- కానీ, ఇదే పెద్ద ట్విస్ట్!
Tarot OTT Streaming: భయంతో వణికించే హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఒళ్లు గగుర్పొడిచే సీన్స్, థ్రిల్లింగ్ సస్పెన్స్, ఎంగేజింగ్‌గా ఉంచే టేకింగ్‌తో సాగే ఈ హారర్ మూవీస్ ఎప్పటికీ మంచి ఆదరణ పొందుతాయి. కథలో రొటీన్‌గా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేస్తే అవి మంచి హిట్స్ సాధిస్తాయి.
చేతబడి వంటి
అయితే, హారర్ సినిమాలు ఏదో ఒక కాన్సెప్ట్‌తో వస్తాయని తెలిసిందే. వాటిలో ఈ మధ్య అయితే ఇంట్లో దెయ్యం ఉండటం, లేదా ఓజా బోర్డ్ ఆడి ఆత్మలను పిలిచి కష్టాలు పాలవ్వడం, ఆభరణాలు, వస్తువుల ద్వారా దెయ్యాలు రావడం, మర్డర్ చేయడంతో ఘోస్ట్‌లుగా మారి రివేంజ్ తీసుకోవడం, చేతబడి వంటి ఇలాంటి కాన్సెప్ట్‌లతోనే ఎక్కువగా హారర్ సినిమాలు వస్తున్నాయి.
అలా ఓజా బోర్డ్ తరహాలో కార్డ్స్ గేమ్ ఆడే కాన్సెప్ట్‌తో వచ్చిన హారర్ మూవీనే టారోట్. ఓజా బోర్డ్‌లో ఆత్మలను పిలిచి వారిని ప్రశ్నలను అడిగే క్రమంలో చిక్కుల్లో పడతారు ఆ గేమ్ ఆడినవారు. అలాగే టారోట్ కార్డ్స్ అన్ని ఆత్మల బొమ్మలతో ఉంటాయి. ఒక్కో ఆత్మకు ఒక్కో శైలి ఉంటుంది. ఎవరికి ఏ కార్డ్ వస్తుందే అందులోని ఆత్మ బయటకు వచ్చి వారిని భయంతో పరుగులు పెట్టిస్తుంది.
3 భాషల్లో స్ట్రీమింగ్
ఈ క్రమంలో కొంతమంది చనిపోతారు కూడా. ఈ భయంకర గేమ్ నుంచి మరి ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారనేదే టారోట్ కథ. ఎన్నో వణికించే భయంకరమైన ట్విస్టులు, సీన్స్ ఉన్న టారోట్ మూవీ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్ట్ 3 నుంచి ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే, ఈ టారోట్ మూవీ ఇదివరకే ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ మాత్రమే కాకుండా యూట్యూబ్‌లో కూడా టారోట్ అందుబాటులో ఉంది. అయితే, ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. యూట్యూబ్‌లో టారోట్‌ను ఫ్రీగా చూసే అవకాశం లేదు. యూట్యూబ్‌లో టారోట్ చూడాలంటే రూ. 120 రెంట్ కట్టాల్సిందే.
అద్దె చెల్లిస్తేనే
రెంటల్ విధానంలోనే ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో టారోట్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అయితే రూ. 119 అద్దె చెల్లించాల్సిందిగా ఉంది. కానీ, అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇందులో తెలుగుతోపాటు 11 భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు.
ఇక టారోట్ చూడాలంటే జీ5 ఓటీటీలో 99 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అలాగే, ఆపిల్ టీవీ ఓటీటీలో అయితే ఎక్కువగా రూ. 150 అద్దె చెల్లించాలి. గూగుల్ ప్లే మూవీస్‌లో కూడా 120 రూపాయలు చెల్లిస్తేనే టారోట్ చూసేందుకు వీలుంటుంది. వీటన్నింటిలో ఆపిల్ టీవీలో ఎక్కువగా.. జీ5 ఓటీటీలో తక్కువగా అద్దె రుసుము ఉంది.
ఇదే పెద్ద ట్విస్ట్ కదా!
కానీ, ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం ఎలాంటి రెంటల్ ఛార్జెస్ లేకుండా ఫ్రీగా చూడొచ్చు. అయితే, అందుకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ మాత్రం ఉండాలి. యూట్యూబ్‌తో కలిపి 5 ఓటీటీల్లో ఉన్న టారోట్ సినిమాను చూసేందుకు మాత్రం అద్దె చెల్లించిరావడం అనేదే ఇక్కడ పెద్ద ట్విస్ట్. ఇది సినిమాల్లో వచ్చే ట్విస్టుల కంటే భయంకరమైనదిలా ఉందని ఓటీటీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.
టాపిక్