Ananthika Sanilkumar: మ్యాడ్ హీరోయిన్ కొత్త సినిమా 8 వసంతాలు.. ఆ లొకేషన్లలో షూటింగ్!-mad actress ananthika sanilkumar new movie 8 vasanthalu shooting in kashmir agra varanasi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ananthika Sanilkumar: మ్యాడ్ హీరోయిన్ కొత్త సినిమా 8 వసంతాలు.. ఆ లొకేషన్లలో షూటింగ్!

Ananthika Sanilkumar: మ్యాడ్ హీరోయిన్ కొత్త సినిమా 8 వసంతాలు.. ఆ లొకేషన్లలో షూటింగ్!

Sanjiv Kumar HT Telugu
Aug 20, 2024 06:41 AM IST

Ananthika Sanilkumar 8 Vasanthalu Shooting: మ్యాడ్‌ సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన అనంతిక సనీల్‌కుమార్ నటిస్తున్న మరో కొత్త సినిమా 8 వసంతాలు. ఈ సినిమాను అందమైన లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నారు. త్వరలో అనంతిక సనీల్‌కుమార్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు.

మ్యాడ్ హీరోయిన్ కొత్త సినిమా 8 వసంతాలు.. ఆ లొకేషన్లలో షూటింగ్!
మ్యాడ్ హీరోయిన్ కొత్త సినిమా 8 వసంతాలు.. ఆ లొకేషన్లలో షూటింగ్!

Ananthika Sanilkumar 8 Vasanthalu Shooting: హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లు నిర్మించడంలో పాపులరైన పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ కంటెంట్ రిచ్ ఫిల్మ్‌లను కూడా నిర్మిస్తోంది. వారి లేటెస్ట్ ప్రాజెక్ట్ '8 వసంతాలు' సినిమాను నిర్మిస్తోంది. ఈ కాన్సెప్ట్ బెస్డ్ మూవీకి మను ఫేంఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

క్యూరియాసిటీ పెంచేలా

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కామెడీ మూవీ మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటివలే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. త్వరలోనే ఈ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ త్వరలో విడుదల చేయనున్నారు.

అందమైన లొకేషన్లలో

ప్రస్తుతం 8 వసంతాలు చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఊటీ, హైదరాబాద్‌, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. మూవీ పూర్తి చేయడానికి టీమ్ నెక్ట్స్ షెడ్యూల్ కోసం కాశ్మీర్, ఆగ్రా, వారణాసిలోని విభిన్న ప్రదేశాలకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా జరుగుతోంది.

సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్

నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ వహిస్తున్నారు. అలాగే సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్ కాగా శశాంక్ మాలి ఎడిటర్, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

రాజమండ్రీ రోజ్ మిల్క్

ఇక 8 వసంతాలు సినిమాలో అనంతిక సనీల్‌కుమార్‌తోపాటు హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీర కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే అనంతిక సనీల్‌కుమార్ మొదట తెలుగులోకి రాజమండ్రీ రోజ్ మిల్క్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

రాని గుర్తింపు

2022లో విడుదలైన ఈ సినిమాలో అనంతిక సనీల్‌కుమార్ కీర్తి అనే పాత్రతో హీరోయిన్‌గా పరిచయం అయింది. కానీ, ఈ సినిమా ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. స్కూల్ ఏజ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించుకున్న హీరోయిన్‌గా అనంతిక సనీల్‌కుమార్ అంతగా క్లిక్ కాలేదు. కానీ, ఆ తర్వాత సంవత్సరం వచ్చిన మ్యాడ్ మూవీతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అనంతిక సనీల్‌కుమార్.

క్రష్‌గా మారిపోయిన అనంతిక

మ్యాడ్ మూవీలో జెన్నీ పాత్రలో అనంతిక సనీల్‌కుమార్ అదరగొట్టింది. ఎంతోమంది యూత్‌కు అనంతిక సనీల్‌కుమార్ క్రష్‌గా మారిపోయింది. అయితే, నిజానికి అనంతిక సనీల్‌కుమార్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ వివిధ రకాల కంటెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు షేర్ చేస్తుండేది.

కేరళకు చెందిన

అనంతిక సనీల్‌కుమార్‌కు కర్రసాము వంటి మార్షల్ ఆర్ట్స్ విద్యలతోపాటు క్లాసికల్ డ్యాన్స్ కూడా వచ్చు. కేరళకు సంబంధించిన సాంప్రాదయ నృత్యాలను చాలా బాగా చేస్తుంది. అనంతిక సనీల్‌కుమార్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, మ్యాడ్ మూవీతో మాత్రం హీరోయిన్‌గా అనంతిక సనీల్‌కుమార్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.