Allu Arjun Instagram: పుష్ప 2 ప్రపంచంలోకి తీసుకెళ్లిన అల్లు అర్జున్.. ఇన్‌స్టాగ్రామ్‌తో స్పెషల్ వీడియో అదుర్స్-allu arjun collaborates with instagram to make a special video in pushpa 2 sets ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Instagram: పుష్ప 2 ప్రపంచంలోకి తీసుకెళ్లిన అల్లు అర్జున్.. ఇన్‌స్టాగ్రామ్‌తో స్పెషల్ వీడియో అదుర్స్

Allu Arjun Instagram: పుష్ప 2 ప్రపంచంలోకి తీసుకెళ్లిన అల్లు అర్జున్.. ఇన్‌స్టాగ్రామ్‌తో స్పెషల్ వీడియో అదుర్స్

Hari Prasad S HT Telugu
Aug 30, 2023 10:00 AM IST

Allu Arjun Instagram: పుష్ప 2 ప్రపంచంలోకి తీసుకెళ్లాడు అల్లు అర్జున్. ఇన్‌స్టాగ్రామ్‌తో కలిసి అతడు చేసిన ఓ స్పెషల్ వీడియో అదుర్స్ అనిపించేలా ఉంది. ఒక రోజంతా ఇన్‌స్టాగ్రామ్ టీమ్ ఈ ఐకాన్ స్టార్ తోనే ఉంది.

ఇన్‌స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ స్పెషల్ వీడియో
ఇన్‌స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ స్పెషల్ వీడియో

Allu Arjun Instagram: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మనల్ని తన పుష్ప 2 మూవీ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఇన్‌స్టాగ్రామ్ తో కలిసి ఓ స్పెషల్ వీడియో చేసిన అతడు.. అందులో తన ఒక రోజు దినచర్యను చూపించాడు. ఉదయం లేచినప్పటి నుంచీ షూటింగ్ ముగిసే వరకూ తాను ఏయే పనులు చేస్తాడో ఆ వీడియోలో బన్నీ వివరించాడు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేయడం విశేషం. పుష్ప 2 సెట్స్ లోకి తీసుకెళ్లే ముందు తన ఇంట్లోనూ అర్జున్ ఓ టూర్ వేసి చూపించాడు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న పుష్ప 2 షూటింగ్ కు తీసుకెళ్లడంతోపాటు అక్కడ మూవీ కోసం వేసిన సెట్స్, తన కాస్ట్యూమ్స్, డైరెక్టర్ సుకుమార్, మూవీ షూటింగ్.. ఇలా ఈ వీడియోలో అంతా చూపించారు.

"సెట్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ ఉదయాన్నే కాస్త చిల్ అవుతాడు" అంటూ ఈ వీడియోను ఇన్‌స్టా పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ వీడియోలో బన్నీ చేసిన కామెంట్స్ ను కూడా క్యాప్షన్ రూపంలో చెప్పింది. "ఇండియాలో అభిమానులు చాలా భిన్నం. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటిది కనిపించదు. మీరు చూడాల్సిందే. దీనిని వర్ణించలేం" అంటూ తాను ఫిల్మ్ సిటీలోకి ఎంటరవుతున్న సమయంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న అభిమానులు చూపిస్తూ అర్జున్ చెబుతాడు.

"హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇది. ప్రపంచంలోని అతిపెద్ద స్టూడియోల్లో ఇదీ ఒకటి. పుష్ప 2: ది రూల్ కు ఇదే ఇల్లు ఇప్పుడు" అని ఫిల్మ్ సిటీ గురించి అతడు వివరించాడు. అభిమానులే తనకు మోటివేషన్ అని, వాళ్ల ప్రేమే తాను తన సరిహద్దులను చెరిపేస్తూ ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తోందని అన్నాడు. ఇక ఇదే వీడియోలో డైరెక్టర్ సుకుమార్ కూడా మాట్లాడాడు.

ఈ సందర్భంగా పుష్ప 2 మూవీ షూటింగ్ ఎలా సాగుతుందో కూడా ఈ వీడియోలో ఇన్‌స్టాగ్రామ్ చూపించింది. మూవీ కోసం వేసిన సెట్స్, అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్, అతడు సెట్లోకి ఎంటరయ్యే విధానం, యాక్షన్ నుంచి కట్ వరకూ షూటింగ్ సాగే తీరును ఈ వీడియోలో చూపించారు. ఇన్‌స్టాగ్రామ్ ఈ వీడియోను అలా పోస్ట్ చేసిందో లేదో అప్పుడే వైరల్ అయింది. లక్షల మంది లైక్స్, షేర్స్ చేస్తున్నారు.

మరోవైపు పుష్ప 2 మూవీ వచ్చే ఏడాది మార్చి 22న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పుష్ప మూవీ కోసం ఈ మధ్యే నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. ఈ సీక్వెల్ లో మరింత రెచ్చిపోయి నటించడం ఖాయంగా కనిపిస్తోంది.