Allu Arjun On Trolls: స్మ‌గ్ల‌ర్ పాత్ర‌కు నేష‌న‌ల్ అవార్డా? - ట్రోల్స్‌పై అల్లు అర్జున్ రియాక్ష‌న్ ఇదే!-allu arjun reacts to trolls on national awards ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Allu Arjun Reacts To Trolls On National Awards

Allu Arjun On Trolls: స్మ‌గ్ల‌ర్ పాత్ర‌కు నేష‌న‌ల్ అవార్డా? - ట్రోల్స్‌పై అల్లు అర్జున్ రియాక్ష‌న్ ఇదే!

HT Telugu Desk HT Telugu
Aug 27, 2023 07:59 AM IST

Allu Arjun On Trolls:పుష్ప సినిమాకుగాను బెస్ట్ యాక్ట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న బ‌న్నీపై ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లు వినిపిస్తోన్నాయి. స్మ‌గ్ల‌ర్ పాత్ర‌కు నేష‌న‌ల్ అవార్డ్ ఎలా ఇస్తారంటూ కొంద‌రు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్‌పై బ‌న్నీ రియాక్ట్ అయ్యాడు.

అల్లు అర్జున్‌
అల్లు అర్జున్‌

Allu Arjun On Trolls: పుష్ప సినిమాతో ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు అల్లు అర్జున్‌. బెస్ట్ యాక్ట‌ర్ కేట‌గిరీలో నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు న‌టుడిగా చ‌రిత్ర‌ను సృష్టించాడు. అయితే బ‌న్నీకి నేష‌న‌ల్ అవార్డ్ ప్ర‌క‌టించ‌డంపై ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లు వినిపిస్తోన్నాయి. పుష్ప సినిమాలో ఎర్ర చంద‌నం అక్ర‌మ ర‌వాణా చేసే పుష్ప‌రాజ్ అనే స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో బ‌న్నీ న‌టించాడు. స్మ‌గ్ల‌ర్ పాత్ర‌కు నేష‌న‌ల్ అవార్డు ఎలా ఇస్తారంటూ కొంద‌రు సినీ, రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ ట్రోల్స్‌పై బ‌న్నీ రియాక్ట్ అయ్యాడు. నేష‌న‌ల్ అవార్డ్స్‌, ఆస్కార్ ఎక్క‌డైనా న‌టుడి ప‌ర్ఫార్మెన్స్‌ను మాత్ర‌మే చూసి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డులు ఇస్తారు. బ్యాట్‌మెన్ లాంటి నెగెటివ్ క్యారెక్ట‌ర్‌కు ఆస్కార్ అవార్డ్ వ‌చ్చింది.

జంజీర్‌, అగ్నిప‌థ్ సినిమాల్లో అమితాబ్‌బ‌చ్చ‌న్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన డాన్ క్యారెక్ట‌ర్‌లో నటించాడు. ఆ పాత్ర‌ల్లో ఆయ‌న న‌ట‌న‌కు నేష‌న‌ల్ అవార్డులు వ‌చ్చాయి. పుష్ప సినిమాలో నా న‌ట‌న‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని జాతీయ అవార్డు ఇచ్చార‌ని అనుకుంటున్నా. అంతే కానీ క‌థానేప‌థ్యం, పాత్ర స్వ‌భావం కాద‌ని నా న‌మ్మ‌కం అని అల్లు అర్జున్ అన్నాడు.

నేష‌న‌ల్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్ట‌ర్ కేట‌గిరీలో అల్లు అర్జున్‌తో పాటు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ కూడా పోటీలో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ పోటీ గురించి అల్లు అర్జున్ స్పందించాడు. బెస్ట్ యాక్ట‌ర్ కేట‌గిరీలో ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్ నుంచి 20కిపైగా నామినేష‌న్స్ వ‌చ్చాయ‌ని అల్లు అర్జున్ పేర్కొన్నాడు. ఈ పోటీలో లోక‌ల్ కంటే నేష‌న‌ల్ కాంపిటీష‌న్ పై ఎక్కువ‌గా దృష్టిపెట్టాన‌ని అల్లు అర్జున్ తెలిపాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.