Pushpa 2 Release Date: పుష్ప 2 రిలీజ్ డేట్ ఇదేనా? - లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసిన సుకుమార్‌-pushpa 2 update allu arjun pushpa the rule movie arriving in theatres on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Release Date: పుష్ప 2 రిలీజ్ డేట్ ఇదేనా? - లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసిన సుకుమార్‌

Pushpa 2 Release Date: పుష్ప 2 రిలీజ్ డేట్ ఇదేనా? - లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసిన సుకుమార్‌

HT Telugu Desk HT Telugu
Aug 25, 2023 10:45 AM IST

Pushpa 2 Release Date: పుష్ప 2 రిలీజ్ డేట్‌పై మేక‌ర్స్ ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్లు టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సీక్వెల్ ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉందంటే...

పుష్ప 2
పుష్ప 2

Pushpa 2 Release Date: పుష్ప సినిమాకు గాను ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకొని చ‌రిత్ర‌ను సృష్టించాడు అల్లు అర్జున్‌. ఉత్త‌మ న‌టుడితో పాటు మ్యూజిక్ డైరెక్ష‌న్ విభాగంలోనూ పుష్ప‌కు జాతీయ అవార్డు ద‌క్కింది. ఈ నేష‌న‌ల్ అవార్డ్‌తో పుష్ప 2 పై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.

ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రూల్ సినిమాను వ‌చ్చే ఏడాది మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉన్న‌ట్లు స‌మాచారం. లాంగ్ వీకెండ్‌, హాలీడేస్‌ను దృష్టిలో పెట్టుకొని మార్చి 22ను ఈ సీక్వెల్ రిలీజ్ డేట్ గా క‌న్ఫార్మ్ చేసిన‌ట్లు చెబుతోన్నారు.

మార్చి 23, 24ల‌లో వీకెండ్‌, మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్‌ఫ్రైడ్ రానున్నాయి. ఈ హాలీడేస్ పుష్ప 2కు అడ్వాండేజ్‌గా మారే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. ప్ర‌స్తుతం పుష్ప 2 షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న‌ల‌పై కీల‌క ఎపిసోడ్స్‌ను ద‌ర్శ‌కుడు సుకుమార్ చిత్రీక‌రిస్తోన్నారు.

ఈ సీక్వెల్‌లో ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. సునీల్‌, అన‌సూయ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించ‌బోతున్నారు. పుష్ప పార్ట్ వ‌న్‌లో పుష్ప‌రాజ్‌కు బ‌న్నీ మేన‌రిజ‌మ్స్‌, డైలాగ్స్‌కు చాలా పాపుల‌ర్ అయ్యాయి. సీక్వెల్‌లో బ‌న్నీ క్యారెక్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ సుకుమార్ మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా డిజైన్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో పుష్ప ది రూల్ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024