తెలుగు న్యూస్  /  Entertainment  /  Ntr Asks Birth Day Treat From Allu Arjun Hilarious Party Leda Pushpa

NTR Sense of Humor: పార్టీ లేదా పుష్ప? తారక్ ట్వీట్‌కు బన్నీ ఫ్యూజులు ఔట్..!

08 April 2023, 22:11 IST

    • NTR Sense of Humor: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ చెప్పారు. అంతేకాకుండా తనదైన చమత్కారంతో కూడిన పోస్టును షేర్ చేశారు. దీంతో తారక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
అల్లు అర్జున్-ఎన్టీఆర్
అల్లు అర్జున్-ఎన్టీఆర్

అల్లు అర్జున్-ఎన్టీఆర్

NTR Sense of Humor: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన, డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆన్ స్క్రీన్‌పై ఆల్ రౌండర్‌లా అద్భుతంగా ఆకట్టుకునే మన తారక్..ఆఫ్ స్క్రీన్‌లోనూ అంతే హుషారుగా ఉంటారు. ముఖ్యంగా ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను ఎంతోమంది ప్రశంసిస్తుంటారు. సరైన టైమింగ్‌లో జోకులు పేల్చడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా తారక్ తన చమత్కారాన్ని మరోసారి బయటపెట్టారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా స్టైలిష్ స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్.. సోషల్ మీడియా వేదికగా హిలేరియస్‌గా నవ్వించారు.

ట్రెండింగ్ వార్తలు

Krishnamma: ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఒకే వేదికపై రాజమౌళి, సుకుమార్ సహా మరో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు

Ranveer Singh: రణ్‍వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ సినిమాకు టైటిల్ ఇదేనా?

Panchayat Season 3 OTT: పాపులర్ సిరీస్ పంచాయత్ మూడో సీజన్‍పై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్

Romeo OTT: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ సినిమా! కానీ..

బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పిన ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. "నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు బావ.. ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలి." అంటూ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు. ఇందుకు అల్లు అర్జున్ కూడా స్పందించారు. "విషెస్ చెప్పినందుకు నీకు థ్యాంక్యూ బావ.. నీకు నా హగ్స్" అంటూ స్టైలిష్ స్టార్.. తారక్‌ ట్వీట్‌కు స్పందించారు. అల్లు అర్జున్ ట్వీట్‌కు ఈ సారి అదిరిపోయే రిప్లయి ఇచ్చారు తారక్. "ఓన్లీ హగ్సేనా? పార్టీ లేదా పుష్ప" అంటూ లాఫ్ ఎమోజీని జత చేశారు. ఇందుకు అల్లు అర్జున్ కూడా వస్తున్నా అంటూ రిప్లయి ఇచ్చారు.

ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. తారక్‌లో మంచి చమత్కారి దాగున్నాడని, ఆయనలో మంచి టైమింగ్ ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో ప్రతి ఒక్కరిని నవ్విస్తుంటారని స్పష్టం చేశారు.

ఇప్పటికే అల్లు అర్జున్‌కు రామ్ చరణ్ కూడా బర్త్ డే విషెస్ చెప్పారు. ఇటీవల కాలంలో అల్లు-మెగా ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని వస్తున్న తరుణంలో చరణ్.. విషెస్ చెప్పి వాటన్నింటకీ చెక్ పెట్టేశారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో బిజీగా ఉండగా.. మరోపక్క తారక్ కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు. ఇది కాకుండా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కాకుండా ప్రశాంత్ నీల్‌తోనూ ఓ మూవీకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.