తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani-ravi Teja Multi Starrer: నేచురల్ స్టార్-మాస్ మహారాజా మల్టీస్టారర్.. ప్రాజెక్టుకు హీరోలు గ్రీన్ సిగ్నల్

Nani-Ravi Teja Multi starrer: నేచురల్ స్టార్-మాస్ మహారాజా మల్టీస్టారర్.. ప్రాజెక్టుకు హీరోలు గ్రీన్ సిగ్నల్

26 March 2023, 15:12 IST

  • Nani-Ravi Teja Multi starrer: నేచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ ఇద్దరూ కలసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని వీరిద్దరే స్వయంగా తెలిపారు. తమ నిర్మాణ సంస్థల్లోనే ఈ సినిమా రూపొందనుందట.

రవితేజ-నాని
రవితేజ-నాని

రవితేజ-నాని

Nani-Ravi Teja Multi starrer: నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు పోటీ ఏది లేనప్పటికీ ఓ వారం గ్యాప్‌లో మరో స్టార్ హీరో బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్నాడు. అతడే మాస్ మహారాజా రవితేజ. ఆయన నటిస్తున్న రావణాసుర ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది. దీంతో ఇద్దరు స్టార్లు తమ సినిమాల ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వీరిద్దరూ తమ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒకే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిద్దరూ మాత్రమ పాల్గొన్న ఈ చిట్ చాట్‌లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముందుగా రవితేజ మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నోసార్లు సినిమాల్లో అవకాశాలు రాక తిరస్కరణకు గురయ్యానని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

"డైరెక్టర్ కృష్ణవంశీ నిన్నే పెళ్లాడతా సినిమాలో తొలి అవకాశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత సింధూరం చిత్రంలో లీడ్ రోల్‌లో నటించే అవకాశాన్ని కల్పించారు. మొదట్లో కథంతా బ్రహ్మాజీ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉండేది. కానీ నా పాత్రలో ఫన్ ఉండటం వల్ల ఆ రోల్ పరిధిని పెంచారు." అని రవితేజ తెలిపారు.

అనంతరం నాని మాట్లాడుతూ నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నో ఆఫీసులు చుట్టూ తిరిగానని తెలిపారు. "యాక్టింగ్‌లో నాకు నిస్సహాయ స్థితే ఎదురైంది. కానీ డైరెక్టర్‌గా నా మొదటి సినిమాకే బాపుగారితో కలిసి పనిచేయడం అరుదైన గౌరవంగా భావిస్తున్నాను" అని స్పష్టం చేశారు. ఆ తర్వాత రవితేజ మాట్లాడుతూ తన కెరీర్‌లో రావణాసుర ఎంతో ప్రత్యేకమైన సినిమా అవుతుందని చెప్పారు. ఈ సినిమా చేయడంతో చాలా సంతృప్తి దొరికిందని స్పష్టం చేశారు.

ఇలా వీరి మాటల కొనసాగుతుండగానే మల్టిసారర్ చిత్రం చేయాలనే ప్రస్తావన వచ్చింది. దీంతో ఇరువురు కలిసి నటించేందుకు అంగీకరించారు. అంతేకాకుండా ఈ సినిమాకు వీరి ఉమ్మడి ప్రొడక్షన్‌లోనే రూపొందించాలని అనుకున్నారు. ఈ మల్టీస్టారర్‌ను రవితేజ ఆర్‌టీ టీమ్ వర్క్స్, నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.