తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thaggedhe Le Song Out: 'తగ్గేదేలే' ఐటెమ్ సాంగ్ వచ్చేసింది.. ఆర్జీవీ బ్యూటీ ఎక్కడా తగ్గడం లేదు

Thaggedhe Le Song Out: 'తగ్గేదేలే' ఐటెమ్ సాంగ్ వచ్చేసింది.. ఆర్జీవీ బ్యూటీ ఎక్కడా తగ్గడం లేదు

14 October 2022, 17:34 IST

    • Thaggedhe Le Song Out: ప్రస్తుతం సోషల్ మీడియాలో తగ్గేదేలే సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఒక మిలియన్ వ్యూస్‌ను సాధించింది. ఆర్జీవీ బ్యూటీ నైనా గంగూలీ తన స్టెప్పులతో అదరగొట్టింది.
తగ్గేదేేలే సాంగ్ వచ్చేసింది
తగ్గేదేేలే సాంగ్ వచ్చేసింది

తగ్గేదేేలే సాంగ్ వచ్చేసింది

Thaggedhe Le Song Out: నవీన్ చంద్ర హీరోగా.. దివ్య పిళ్లై హీరోయిన్‌గా చేసిన చిత్రం తగ్గేదేలే. పుష్ప సినిమాలో యావత్ దేశాన్ని ఉర్రూతలూగిన అల్లు అర్జున్ పలికే మాట తగ్గేదేలే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాస రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. తగ్గేదేలే అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఈ పాట ఉర్రూతలూగిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

Murder in Mahim OTT Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మర్డర్ ఇన్ మహిమ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఈ ఐటెమ్ నెంబర్‌లో ఆర్జీవీ డేంజరస్ హీరోయిన్ నైనా గంగూలీ స్టెప్పులేసింది. తగ్గేదేలే అంటూ ఆమె డ్యాన్సులు కుర్రకారుకు ఊపుతెప్పిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ స్టెప్పులతో పాటు ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల నుంచి ఈ పాటపై రెస్పాన్స్ బాగా వస్తుంది.

హుషారైన ఈ సాంగ్‌ను ప్రముఖ గాయని మోహన భోగరాజు ఆలపించింది. ఈమెతో పాటు చరణ్ అర్జున్, శరత్ రవి పాడారు. ఈ పాటకు చరణ్ అర్జున్ సాహిత్యాన్ని అందించి.. అతడే సంగీతాన్ని సమకూర్చాడు. హుషారుగా సాగుతున్న పాటపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఒక మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోందీ పాట.

ఈ సినిమాలో నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై హీరో, హీరోయిన్లుగా చేస్తున్నారు. అనన్యా సేనుగుప్తా, నైనా గంగూలీ, రవిశంకర్, రాజా రవిందర్, నాగబాబు తదితరులు కీలక భూమికలు పోషిస్తున్నారు. భద్రా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రేమ్ కుమార్ పాండే, ఎన్ అఖిలేష్ రెడ్డి, పీవీ సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. దండుపాళ్యం దర్శకుడు శ్రీనివాస రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.