Naveen Chandra: ఓటీటీలో నవీన్ చంద్ర మూవీ రిపీట్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా చిత్రం
నవీన్ చంద్ర హీరోగా రూపొందిన చిత్రం రిపీట్. ఈ సినిమా డైరెక్టుగా ఓటీటీలో విడుదల కానుంది. ఆగస్టు 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
అందాల రాక్షసితో ప్రేమికుడి పాత్రలో మెప్పించిన నవీన్ చంద్రా.. అనంతరం చాలా వరకు అదే తరహా పాత్రల్లో కనిపించాడు. అయితే అరవింద సమేతతో రూట్ మార్చిన ఈ హీరో సపోర్టింగ్ రోల్స్‌కు కూడా ఓకే చెబుతున్నాడు. సినిమా, వెబ్ సిరీస్ అంటూ తేడా లేకుండా విభిన్న తరహా పాత్రల్లో మెప్పిస్తున్నాడు. ఇటీవల కాలంలో పరంపర అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించి నవీన్.. తాజాగా మరోసారి లీడ్ రోల్‌లో కనిపించనున్నాడు. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం రిపీట్. థియేటర్లో కాకుండా ఓటీటీలో ఈ సినిమా డైరెక్టుగా విడుదల కానుంది.
ట్రెండింగ్ వార్తలు
ఆగస్టు 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమాను ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో నవీన్ చంద్ర పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడు. తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నాడు.
ట్రైలర్‌ను గమనిస్తే.. "గేమ్ మొదలుపెట్టిన ఫస్ట్ మూవ్‌లోనే ఒకడు మనకి చెక్ పెడితే ఎలా ఉంటుందో అలా ఎదురైంది నాకీ కేసు. ప్రతి స్టెప్పులోనూ నాకు చెక్ పెడుతూనే వచ్చాడు." అంటూ నవీన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందించారు.
ట్రైలర్‌లోని సన్నివేసాలను బట్టి చూస్తే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కినట్లు తెలుస్తోంది. నవీన్ చంద్రా హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో స్మృతీ వెంకట్ హీరోయిన్‌గా చేస్తోంది. అలనాటి నటి మధు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. మధూ షా, మిమి గోపి, నవీనా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. జీబ్రాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు నిర్మాతగా వ్యవహిస్తున్నారు.
సంబంధిత కథనం