తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Masaba Gupta Wedding: వివ్ రిచర్డ్స్ కూతురిని పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు

Masaba Gupta Wedding: వివ్ రిచర్డ్స్ కూతురిని పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు

Hari Prasad S HT Telugu

27 January 2023, 12:44 IST

    • Masaba Gupta Wedding: వివ్ రిచర్డ్స్ కూతురిని పెళ్లి చేసుకున్నాడు బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రా. డిజైనర్ అయిన మసాబా గుప్తా.. తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.
సత్యదీప్ మిశ్రా, మసాబా గుప్తా
సత్యదీప్ మిశ్రా, మసాబా గుప్తా

సత్యదీప్ మిశ్రా, మసాబా గుప్తా

Masaba Gupta Wedding: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, బాలీవుడ్ నటి నీనా గుప్తా ముద్దుల తనయ మసాబా గుప్తా పెళ్లి చేసుకుంది. నటుడు సత్యదీప్ మిశ్రాతో ఆమె ఏడడుగులు వేసింది. ఈ విషయాన్ని ఇటు మసాబా, అటు సత్యదీప్ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు. హౌజ్ ఆఫ్ మసాబాలోనే తయారు చేసిన స్పెషల్ ఔట్‌ఫిట్స్ తో ఈ ఇద్దరూ పెళ్లి పీటలపై కూర్చున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

Vijay Deverakonda Birthday: విజయ్ దేవరకొండ పుట్టిన రోజున మూడు సినిమాల నుంచి అప్‍డేట్స్: వివరాలివే

NNS 7th May Episode: భూమ్మీదకు తిరిగి రానున్న అరుంధతి ఆత్మ.. అమర్ ఇంటికి వెళ్లిన రామ్మూర్తికి గుండెపోటు!

Tollywood: నాగ‌చైత‌న్య మూవీతో తెలుగులో హీరోయిన్‌గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కెరీర్ ప్రారంభం కావాల్సింది...కానీ

"ఇవాళ ఉదయమే నా శాంతి సముద్రాన్ని పెళ్లి చేసుకున్నాను" అంటూ మసాబా తన పెళ్లి విషయాన్ని పంచుకుంది. మసాబా ఈ పోస్ట్ చేయగానే వందల సంఖ్యలో అభిమానులు ఈ నవ దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేశారు. వీళ్లలో అతియా శెట్టి, ఆయుష్మాన్ ఖురానా, అనిల్ కపూర్, మీరా కపూర్, అనన్యా పాండేలాంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

అయితే ఈ జంట పెద్దగా హడావిడి లేకుండా కోర్టు హాలులో పెళ్లి చేసుకోవడం విశేషం. తమ కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకోవాలనుకొని ఇలా చేసినట్లు మసాబా వెల్లడించింది. ఇప్పుడు కూడా తమ పెళ్లిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోదలచుకోలేదని కూడా స్పష్టం చేసింది. అయితే కొంతమంది సన్నిహితుల కోసం మాత్రం రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

మసాబా గుప్తా మసాబా మసాబా అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలోనే ఆమె తొలిసారి సత్యదీప్ మిశ్రాను కలిసింది. మూడేళ్ల నుంచి వీళ్ల ప్రేమాయణం కొనసాగుతోంది. నిజానికి ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లే. గతంలో మసాబా ప్రొడ్యూసర్ మధు మంతెనను పెళ్లి చేసుకోగా.. నటి అదితి రావు హైదరీతో విడిపోయాడు సత్యదీప్ మిశ్రా.

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, బాలీవుడ్ నటి నీనా గుప్తాల మధ్య ఒకప్పుడు ప్రేమాయణం నడిచిన సంగతి తెలుసు కదా. వీళ్లెప్పుడూ పెళ్లి చేసుకోకపోయినా.. వీళ్లకు మసాబా గుప్తా జన్మించింది. ఆమె ఇప్పుడు డిజైనర్ గా పని చేస్తోంది. మరోవైపు సత్యదీప్ బాలీవుడ్ తోపాటు వెబ్ సిరీస్ లలో నటించాడు. బాంబే వెల్వెట్, నో వన్ కిల్డ్ జెస్సికా, విక్రమ్ వేదాలాంటి సినిమాల్లో అతడు కనిపించాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.