తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Vishnu: చిరంజీవి పద్మ విభూషణ్‌పై మంచు విష్ణు కామెంట్స్.. ప్రభాస్, మహేష్, బాలకృష్ణ, బన్నీపై అలా!

Manchu Vishnu: చిరంజీవి పద్మ విభూషణ్‌పై మంచు విష్ణు కామెంట్స్.. ప్రభాస్, మహేష్, బాలకృష్ణ, బన్నీపై అలా!

Sanjiv Kumar HT Telugu

24 March 2024, 12:48 IST

google News
  • Manchu Vishnu Chiranjeevi Prabhas Mahesh Babu Allu Arjun: తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవతిహి ఉత్సహం చేయనున్నట్లు మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. చిరంజీవిని వరించిన పద్మవిభూషణ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

చిరంజీవి పద్మ విభూషణ్‌పై మంచు విష్ణు కామెంట్స్.. ప్రభాస్, మహేష్, బాలకృష్ణ, బన్నీపై అలా!
చిరంజీవి పద్మ విభూషణ్‌పై మంచు విష్ణు కామెంట్స్.. ప్రభాస్, మహేష్, బాలకృష్ణ, బన్నీపై అలా!

చిరంజీవి పద్మ విభూషణ్‌పై మంచు విష్ణు కామెంట్స్.. ప్రభాస్, మహేష్, బాలకృష్ణ, బన్నీపై అలా!

Manchu Vishnu About Chiranjeevi: తెలుగు సినిమా పరిశ్రమ 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 'నవతిహి ఉత్సవం' చేయనున్నారు. గతంలో వజ్రోత్సవం నిర్వహించినట్లు ఈసారి నవతిహి ఉత్సవం జరిపించనున్నట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు తెలిపారు. దీనికి సంబంధించి శనివారం (మార్చి 23) హైదరాబాద్ పార్క్ హయత్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మా ప్రెసిడెంట్ మంచు విష్ణుతోపాటు వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, ఈసీ మెంబర్స్, పలువురు మలేషియా ప్రతినిధులు హాజరయ్యారు.

90 ఏళ్ల తెలుగు సినిమా

"మలేషియా నుంచి ఇక్కడికి వచ్చిన కమల్ నాథ్ గారికి, టూరిజం డిపార్ట్‌మెంట్ వారికి ధన్యవాదాలు. రెండేళ్ల క్రితం 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ చేయాలని నిర్ణయించుకున్నాం. తెలుగు సినీ పరిశ్రమ మొదలైన దగ్గర్నుంచి ఎంతోమంది నటీనటులను గుర్తుచేసుకుంటూ ఈ ఈవెంట్‌ని గ్రాండ్‌గా, చాలా సక్సెస్‌ఫుల్‌గా చేయాలని అనుకున్నాం. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం వాయిదా పడుతూ వస్తోంది" అని మంచు విష్ణు అన్నారు.

గోల్డెన్ ఎరా నడుస్తోంది

"అలాగే ఈ ప్రోగ్రాం నుంచి మా కోసం ఫండ్ రైజింగ్ కూడా చేద్దామనుకున్నాం. మలేషియా గవర్నమెంట్‌తో చేయాలని నిర్ణయించుకున్నాం. 'మా' తరపున బిగ్గెస్ట్ సినిమా ఈవెంట్‌ను జులైలో మలేషియాలో చేయబోతున్నాము. డేట్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సినీ పరిశ్రమ పెద్ధలతో‌ మాట్లాడి డేట్‌ను ప్రకటిస్తాం. అందరు ఈవెంట్‌కి వచ్చేలా చేస్తాము. ఇప్పుడు తెలుగు సినిమాకు గోల్డెన్ ఎరా నడుస్తోంది. తెలుగు నటీనటులుగా మేమంతా గర్విస్తున్నాము. తెలుగు సినిమా ఘన కీర్తిని తెలిపేలా ఈ నవతిహి ఉత్సవం చేయబోతున్నాము" అని మంచు విష్ణు తెలిపారు.

చిరంజీవి పద్మ విభూషణ్‌పై

"అమితాబ్, అనీల్ కపూర్ పలువురు నటులను సినిమాలకు తెలుగువారే పరిచయం చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా గొప్ప విషయం. మన జై బాలయ్య అనే మాట ఎక్కడికి వెళ్లినా వినిపిస్తుంది. నా బ్రదర్ అల్లు అర్జున్ ఫస్ట్ తెలుగు హీరో నేషనల్ అవార్డ్ తీసుకొచ్చాడు. ప్రభాస్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్. మహేష్-రాజమౌళి గారి సినిమా ఏషియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా కాబోతుంది" అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

రాజమౌళి-కీరవాణి

"తెలుగు సినిమాని ప్రపంచానికి రాజమౌళి పరిచయం చేశారు. కీరవాణి గారు ఫస్ట్ ఆస్కార్ పొందిన తెలుగువారు. ఇలా ఎన్నో సాధిస్తున్నాము. అందుకే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవటం కరెక్ట్ టైమ్ అని భావిస్తున్నాము. మలేషియా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. 'మా'లో దాదాపు 800కి పైగా ఆర్టిస్టులు ఉన్నారు. కానీ, అందులో కొంతమందే బాగా సెటిల్ అయినవాళ్లు. మిగిలిన వాళ్లకు మేము అండగా నిలబడటానికి ఈ ఫండ్ రైజింగ్ చేస్తున్నాము. ఇప్పటికే మేము చేస్తున్న మెడికల్ ఇన్స్యూరెన్స్ చాలా మందికి సపోర్ట్‌గా నిలిచింది" అని మంచు విష్ణు పేర్కొన్నారు.

ఇతర పరిశ్రమ నుంచి

"ఈ ఈవెంట్‌కి ఛాంబర్‌తో మాట్లాడాం. నటీనటులు అంతా రావాలి అని అడిగాం. మూడు రోజులు సినిమా ఇండస్ట్రీకి సెలవులు ఇవ్వాలని కోరాము. దిల్ రాజు, దాము గారు సపోర్ట్ చేస్తామన్నారు. త్వరలోనే ఈ నవతిహి ఈవెంట్ తేదిని ప్రకటిస్తాం. పక్క రాష్ట్రాల అన్ని సినీ పరిశ్రమలతో టై అప్ అయ్యాము. అన్ని పరిశ్రమలతో మాట్లాడాను. ఈవెంట్‌కి వేరే పరిశ్రమ నటీనటులు కూడా కొంతమంది రాబోతున్నారు" అని మంచు విష్ణు అన్న వివరాలు తెలిపారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం