Chiranjeevi: రెండుసార్లు చిరంజీవి సినిమా వద్దన్నా.. సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్-prithviraj sukumaran reveals he said no to chiranjeevi twice for the goat life aadujeevitham ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prithviraj Sukumaran Reveals He Said No To Chiranjeevi Twice For The Goat Life Aadujeevitham

Chiranjeevi: రెండుసార్లు చిరంజీవి సినిమా వద్దన్నా.. సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 23, 2024 07:21 AM IST

Chiranjeevi Prithviraj Sukumaran The Goat Life: సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్ లైఫ్ (ఆడు జీవితం). తాజాగా మార్చి 22న ది గోట్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో నటించడంపై పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

రెండుసార్లు చిరంజీవి సినిమా వద్దన్నా.. సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్
రెండుసార్లు చిరంజీవి సినిమా వద్దన్నా.. సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్

Prithviraj Sukumaran About Chiranjeevi: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం). ఈ సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ది గోట్ లైఫ్ చిత్రాన్ని బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు.

హాలీవుడ్ యాక్టర్‌తోపాటు

విజువల్ రొమాన్స్ బ్యానర్ ది గోట్ లైఫ్ మూవీని మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ది గోట్ లైఫ్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఆడు జీవితం టైటిల్‌తో విడుదల చేస్తోంది. మార్చి 22 శుక్రవారం రోజున ఆడు జీవితం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ బ్లెస్సీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, మైత్రీ నుంచి నిర్మాత వై రవి శంకర్, శశి పాల్గొన్నారు.

నా కెరీర్‌లో ముఖ్యమైన సినిమా

"ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) సినిమా జీరో కాంప్రమైజ్డ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఒక్క ఫ్రేమ్ కూడా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌లో రాజీ పడకుండా రూపకల్పన చేశాం. 2008 లో అనుకున్న సినిమా ఫైనల్‌గా 2024 మార్చి 28న మీ ముందుకు వస్తోంది. ఇంత కష్టపడిన ఈ సినిమాను పర్పెక్ట్‌గా రిలీజ్ చేయాలని అనుకున్నాం. అదృష్టవశాత్తూ తెలుగులో మైత్రీ మూవీ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇది నా కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన సినిమా అని రవి గారికి మెసేజ్ పంపాను. ఆయన డన్ సార్ అంటూ రిప్లై ఇచ్చారు" అని పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు.

ఇంకాస్తా చేసి ఉండాలి

"తమిళంలో రెడ్ జయింట్, కన్నడలో హోంబలే ఫిలింస్, నార్త్‌లో నా ఫ్రెండ్ అనిల్ రిలీజ్ చేస్తున్నారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌తో చేసిన సినిమా ఇది. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ ఎమోషన్స్ ఫీల్ అవుతారు. టెక్నికల్‌గా బ్రిలియంట్‌గా ఉంటుంది. ఈ సినిమా చూశాక ప్రేక్షకులెవరూ ఈ సినిమాను ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది అని అనరు. మీ అందరికీ ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) మూవీ నచ్చుతుందని ఆశిస్తున్నా" అని సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపాడు.

సేమ్ స్టోరీ చెబుతున్నావ్

"చిరంజీవి గారి సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ కీ రోల్ కోసం నన్ను అడిగారు. అప్పుడు ఈ మూవీ కోసమే ప్రిపేర్ అవుతున్నా. అందుకే నటించలేకపోతున్నా అని ఆ విషయాన్ని ఆయనకు వివరించాను. ఆ తర్వాత లూసీఫర్ తెలుగు రీమేక్ గాఢ్ ఫాదర్‌ మూవీని నన్నే డైరెక్టర్ చేయమన్నారు. అప్పడు కూడా గోట్ లైఫ్ సినిమా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నువ్వు సేమ్ స్టోరీ చెబుతున్నావ్ అని చిరంజీవి గారు అన్నారు" అని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చాడు.

కచ్చితంగా పనిచేస్తా

"మీ (చిరంజీవి) సినిమాలో నటించడం నాకెంతో ఇష్టం సార్ కానీ కుదరడం లేదు అని హంబుల్‌గా చెప్పాను. ఆ తర్వాత చిరంజీవి గారు రెగ్యులర్‌గా మెసేజెస్ పంపుతూ ఉండేవారు. గాడ్ ఫాదర్ రిలీజ్ రోజున కూడా మెసేజ్ పంపారు. ఫ్యూచర్‌లో అవకాశం వస్తే తప్పకుండా చిరంజీవి గారితో కలిసి పనిచేస్తా" అని రెండుసార్లు చిరంజీవి సినిమాలో నటించకపోవడానికి గల కారణం చెప్పాడు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా ప్రభాస్ సలార్ మూవీలో వరజరాజమన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

WhatsApp channel