తెలుగు న్యూస్  /  Entertainment  /  Love Today Telugu Trailer Unveiled By Vijay Deverakonda

Love Today Telugu Trailer: ల‌వ్ టుడే తెలుగు ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ

17 November 2022, 12:41 IST

  • Love Today Telugu Trailer: ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టించిన ల‌వ్ టుడే తెలుగు ట్రైల‌ర్‌ను యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ గురువారం రిలీజ్ చేశారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ ట్రైల‌ర్ న‌వ్వుల‌ను పంచుతోంది.

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్
ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్

Love Today Telugu Trailer: కోలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుద‌లైన ల‌వ్ టుడే సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలిచింది. కేవ‌లం ఐదు కోట్ల వ్య‌యంతో రూపొందిన ఈ సినిమా యాభై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టిస్తూ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు ల‌వ్ టుడే కాన్సెప్ట్‌తో పాటు ప్ర‌దీప్ యాక్టింగ్, కామెడీపై ప్ర‌శంస‌లు ల‌భిస్తోన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu April 29th Episode: గుప్పెడంత మనసు- దొరికిన రాజీవ్ డెడ్ బాడీ- కోర్టుకు మను- శైలేందపై దేవయాని డౌట్

Krishna mukunda murari serial april 29th: ముకుంద ఉచ్చులో పడిన మురారి, కృష్ణ.. సర్ ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసిన భవానీ

Brahmamudi April 29th Episode: బ్రహ్మముడి- అనామికను కొట్టేంతపని చేసిన కనకం- ఇక పుట్టింటికే- పూల బొకేలో రాజ్ బిడ్డ రహస్యం

కార్తీకదీపం 2 సీరియల్.. పారిజాతం కన్నింగ్ ప్లాన్, ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. కోడలి గురించి బాధపడిన కాంచన

ల‌వ్ టుడే సినిమాను అదే పేరుతో తెలుగులో నిర్మాత దిల్‌రాజు డ‌బ్ చేస్తోన్నారు. గురువారం తెలుగు ట్రైలర్‌ను యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేశారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఆద్యంతం ట్రైల‌ర్ న‌వ్వుల‌ను పంచుతోంది. నీ గురించి నాకు మొత్తం తెలుసురా అంటూ హీరోయిన్‌ , నాకు నీ గురించి మొత్తం తెలుసు బేబీ అంటూ హీరో ఒక‌రికొక‌రు చెప్పుకునే డైలాగ్‌తో ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా మొద‌లైంది.

ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మైన ఓ జంట‌కు ఒక‌రిఫోన్‌ను మ‌రొక‌రు ఒక‌రోజు మార్చుకోవాలంటూ స‌త్య‌రాజ్ కండీష‌న్ పెట్ట‌డం ఆస‌క్తిని పంచుతోంది. ఆ కండీష‌న్ వ‌ల్ల వారి జీవితంలో ఎదుర‌య్యే ప‌రిణామాల‌ను వినోదాత్మ‌కంగా ఈ ట్రైల‌ర్‌లో చూపించారు. ఫోన్ కార‌ణంగా ఒక్కొక్క‌రి సీక్రెట్స్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాయో ఆవిష్క‌రించిన విధానం కొత్త‌గా ఉంది.

న‌వంబ‌ర్‌లో ల‌వ్ టుడే తెలుగు వెర్ష‌న్ రిలీజ్ కానుంది. తొలుత ఈ సినిమాను రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. మాతృక‌లోని ఫీల్‌ను రీక్రియేట్ చేయ‌డం క‌ష్టమ‌నే ఆలోచ‌న‌తోనే డ‌బ్ చేసిన‌ట్లు తెలిసింది. ల‌వ్ టుడే సినిమాలో ఇవానా, ర‌వీనా ర‌వి హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. రాధిక శ‌ర‌త్‌కుమార్‌, స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌ల్ని పోషించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.