తెలుగు న్యూస్  /  Entertainment  /  Love Today Ott Release Date Announced

Lovetoday OTT Release Date: ల‌వ్ టుడే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌ - నెక్స్ట్‌ వీక్ నుంచే స్ట్రీమింగ్

27 November 2022, 12:25 IST

  • Love today OTT Release Date: ల‌వ్ టుడే సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను సోమ‌వారం రివీల్ చేశారు. ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే...

ల‌వ్ టుడే
ల‌వ్ టుడే

ల‌వ్ టుడే

Love today OTT Release Date: త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన ల‌వ్ టుడే సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆదివారం రివీల్ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబ‌ర్ 2 నుంచి ల‌వ్ టుడే స్ట్రీమింగ్ కానుంది. త‌మిళంతో పాటు తెలుగు లాంగ్వేజ్‌లోనూ ఈ సినిమా రిలీజ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్లు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు

Romeo OTT: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ సినిమా! కానీ..

Mahesh Babu new look: పెళ్లి వేడుకకు కొత్త లుక్‌లో మహేష్ బాబు.. జుట్టు పట్టుకొని ఆట పట్టించిన అక్క మంజుల

Theatre releases this week: ఈ వారం థియేటర్లలోకి రానున్న 5 సినిమాలు.. డిఫరెంట్ జానర్లతో..

Bullet 50 Days: ప్రభాస్, గోపీచంద్ లాగా రవి వర్మ.. పాపులర్ డైరెక్టర్ కామెంట్స్

Love today OTT: ఐదు కోట్ల బడ్జెట్ - అరవై కోట్ల కలెక్షన్స్…

త‌మిళంలో ఐదు కోట్ల వ్య‌యంతో నిర్మిత‌మైన ఈ సినిమా అర‌వై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాను అదే పేరుతో దిల్‌రాజు తెలుగులోకి డ‌బ్ చేశారు. గ‌త‌ శుక్ర‌వారం తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. తెలుగులో ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

శుక్ర‌వారం ఒక్క‌రోజు దాదాపు రెండు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. శ‌నివారం రోజు కూడా కోటికిపైగా క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. వ‌సూళ్లు రోజురోజుకు పెరుగుతోన్న త‌రుణంలో ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్ దిల్‌రాజుకు షాక్ ఇచ్చింది. సోమ‌వారం నుంచి క‌లెక్ష‌న్స్ త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

Love today story: లవ్ టుడే కథేమిటి…

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ టుడే సినిమాను తెర‌కెక్కించాడు. అనుమానం ఉన్న‌చోట ప్రేమ చిగురించ‌ద‌నే పాయింట్‌తో ఫ‌న్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందింది. ఇందులో ఉత్త‌మ‌న్ ప్ర‌దీప్ అనే పాత్ర‌లో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ క‌నిపించ‌గా నిఖిత‌గా ఇవానా న‌టించింది.

ఒక‌రి గురించి మ‌రొక‌రికి పూర్తిగా తెలుసున‌నే భ్ర‌మలో ఉన్న ఓ యువ‌ జంట పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ‌తారు. కానీ ఒక‌రి ఫోన్‌ను మ‌రొక‌రు ఒక రోజు మార్చుకోవాల‌ని హీరోయిన్ తండ్రి పెట్టిన కండీష‌న్ వ‌ల్ల వారి ర‌హ‌స్యాలు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాయి? ఈ కండీష‌న్ వ‌ల్ల వారు విడిపోయే ప‌రిస్థితి ఎలా వ‌చ్చింద‌నేది కామెడీ, ఎమోష‌న్స్‌తో ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించిన తీరుకు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.