Telugu Cinema News Live October 20, 2024: The Raja Saab: రాజా సాబ్ నుంచి ప్రభాస్ స్పెషల్ పోస్టర్ వచ్చేస్తోంది.. ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్ మారుతి
20 October 2024, 22:06 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
- The Raja Saab: ది రాజా సాబ్ నుంచి ప్రభాస్ స్పెషల్ పోస్టర్ వచ్చేయనుంది. ప్రభాస్ పుట్టిన రోజు ముందే రివీల్ కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు మారుతీ వెల్లడించారు. ఆ వివరాలు ఇవే..
- Unstoppable Season 4 OTT Date, Time: అన్‍స్టాపబుల్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ డేట్, టైమ్‍ను ఆహా ఓటీటీ వెల్లడించింది. బాలకృష్ణ హోస్ట్‌గా ఈ ఎపిసోడ్‍కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అతిథిగా వచ్చారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ నేడు పూర్తయింది.
- War 2 Title: వార్ 2 సినిమాకు తెలుగులో వేరే టైటిల్ ఉంటుందంటూ కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు.
- Mechanic Rocky Trailer: ‘మెకానిక్ రాకీ’ సినిమా తొలి ట్రైలర్ వచ్చేసింది. కామెడీ, లవ్, యాక్షన్‍తో ఎంటర్‌టైనింగ్‍గా సాగింది. విశ్వక్ మార్క్ డైలాగ్స్ కూడా ఉన్నాయి.
- Vettaiyan OTT: వేట్టయన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టడం లేదు. అయితే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి బజ్ విపరీతంగా నడుస్తోంది. అనుకున్న దాని కంటే ముందుగానే స్ట్రీమింగ్‍కు రానుందనే రూమర్లు వస్తున్నాయి.
- Bigg Boss 8 Telugu - Manikanta: మణికంఠ ఇక మారడు అంటూ హోస్ట్ నాగార్జున కామెంట్ చేశారు. ఓ ఫన్ గేమ్ సందర్భంగా మణి గురించి నాగ్ ఇలా అన్నారు. నేటి ఆదివారం ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది.
- Double iSmart TV Premiere: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీవీలో ప్రసారమయ్యేందుకు సిద్ధమైంది. ఈ మూవీ టీవీ ప్రీమియర్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. ఈ యాక్షన్ మూవీ టెలికాస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజ సంజీవ్ వయోసంబంధిత సమస్యలతో ఆదివారం కన్నుమూసింది. ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్‌తోపాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సుదీప్ తల్లి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
- Prabhas on Love Reddy: ఓ చిన్న బడ్జెట్ చిత్రానికి ప్రభాస్ మద్దతుగా నిలిచారు. ఓ మూవీ గురించి ఇన్‍స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశారు. దీంతో ప్రభాస్‍పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Romantic Thriller OTT: టాలీవుడ్ టాప్ లిరిసిస్ట్ చంద్రబోస్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు మూవీ తుగ్లక్ థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Rishab Shetty: ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్‌లో హీరో ఫిక్సైనట్లు తెలిసింది. జై హనుమాన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో కాంతార ఫేమ్ రిషబ్‌శెట్టి హీరోగా నటించనున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Thalapathy Vijay: దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్‌గా తెలుగులో ఆరు సినిమాలు చేశాడు. అందులో మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఆ మూడింటిలో చిరంజీవి హీరో కావడం గమనార్హం.
Brahmamudi Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో కావ్య, రాజ్‌లను కలిపేందుకు అపర్ణ మరో ప్లాన్ వేస్తుంది. రాజ్‌కు బాస్‌గా కావ్యను తమ కంపెనీకి సీఈవోను చేయనున్నట్లు చెబుతుంది. కావ్యకు ఎండీ సీట్‌లో కూర్చునే అర్హత లేదని రాజ్ వాదిస్తాడు.
Anushka: సైలెంట్‌గా మలయాళం డెబ్యూ మూవీ కథనార్ షూటింగ్‌ను ఫినిష్ చేసింది అనుష్క శెట్టి. పీరియాడికల్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో జయసూర్య హీరోగా నటిస్తోన్నాడు. మలయాళంలో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ డిసెంబర్‌లో రిలీజ్ కానుంది.
Family Drama OTT: సుధీర్‌బాబు హీరోగా నటించిన మా నాన్న సూపర్ హీరో మూవీ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31 లేదా నవంబర్ 1 నుంచి ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు.