Romantic Thriller OTT: ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది
Romantic Thriller OTT: టాలీవుడ్ టాప్ లిరిసిస్ట్ చంద్రబోస్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు మూవీ తుగ్లక్ థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Romantic Thriller OTT: ఆర్ఆర్‌ఆర్ మూవీలో నాటు నాటు పాటకుగాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్నారు చంద్రబోస్. ఆస్కార్‌తో పాటు గోల్డెన్ గ్లోబ్ అందుకున్న తొలి, ఏకైక భారతీయ గేయరచయితగా చరిత్రను తిరగరాశాడు. లిరిసిస్ట్‌గా సుదీర్ఘ సినీ ప్రయాణంలో నేషనల్, నందితో పాటు అనేక పురస్కారాలను అందుకున్నాడు చంద్రబోస్.
తొలిసారి కెమెరా ముందుకు...
తుగ్లక్ అనే మూవీతో చంద్రబోస్ ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చాడు. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ తెలుగు మూవీలో ఓ కీలక పాత్ర పోషించాడు. 2022లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి...
రెండేళ్ల తర్వాత తుగ్లక్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తుగ్లక్ మూవీలో రోహన్ సిద్ధార్థ్, చైతన్య ప్రియ హీరోహీరోయిన్లుగా నటించారు. రఘు కుంచె ఓ కీలక పాత్ర పోషించారు. ప్రణీత్ పండగ దర్శకత్వం వహించాడు.
రొటీన్ కాన్సెప్ట్...
చంద్రబోస్ ఫస్ట్ టైమ్ యాక్టర్‌గా నటించన మూవీ కావడంతో తుగ్లక్‌పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. కానీ రొటీన్ కాన్సెప్ట్ కారణంగా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో చంద్రబోస్ సినిమా డైరెక్టర్ పాత్రలో నటించాడు.
తుగ్గక్ మూవీ కథ ఇదే...
బోస్ (చంద్రబోస్) ఓ సినిమా డైరెక్టర్. వరుసగా ఆరు సినిమా హిట్ సినిమాలు చేస్తాడు. ఎవరూ ఊహించని కథతో ఏడో సినిమా చేయాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. స్టోరీ కోసం అన్వేషిస్తోన్న టైమ్‌లోనే అతడికి తుగ్లక్ (రఘు కుంచె) పరిచయం అవుతాడు. తుగ్లక్ ద్వారా కార్తిక్, హాసిని కథ తెలుసుకుంటాడు బోస్.
ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్న కార్తిక్, హాసిని కలిసి బతకడం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? విధి కారణంగా వారి ప్రేమప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది అన్నదే ఈ మూవీ కథ. తుగ్గక్ సినిమాకు అనిల్ మ్యూజిక్ అందించాడు.
పుష్ప 2తో పాటు...
ప్రస్తుతం తెలుగులో పుష్ప 2తో పాటు పలు సినిమాలకు లిరిసిస్ట్‌గా పనిచేస్తోన్నాడు చంద్రబోస్. ఇటీవల రిలీజైన ఇండియన్ 2, లవ్‌మీతో పాటు మరికొన్ని సినిమాలకు సాహిత్యాన్ని అందించాడు చంద్రబోస్.