Brahmamudi Promo: రాజ్ ఆఫీస్‌లోకి కావ్య రీఎంట్రీ - కోడలికి ప్రమోషన్ ఇచ్చిన అపర్ణ - రుద్రాణిపై కనకం పగ
Brahmamudi Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో కావ్య, రాజ్‌లను కలిపేందుకు అపర్ణ మరో ప్లాన్ వేస్తుంది. రాజ్‌కు బాస్‌గా కావ్యను తమ కంపెనీకి సీఈవోను చేయనున్నట్లు చెబుతుంది. కావ్యకు ఎండీ సీట్‌లో కూర్చునే అర్హత లేదని రాజ్ వాదిస్తాడు.
Brahmamudi Promo: రాజ్, కావ్యలను కలిపేందుకు అపర్ణ, ఇందిరాదేవితో పాటు కనకం కలిసి ఆడిన నాటకం దారుణంగా ఫెయిలవుతుంది. క్యాన్సర్ పేరుతో అత్త చేసిన మోసాన్ని రాజ్ సహించలేకపోతుంది. తాను జీవితాంతం ఒంటరిగానే బతుకుతానని, మళ్లీ నన్ను, కావ్యను కలపాలని ఎలాంటి ప్రయత్నం చేయద్దని తల్లితోపాటు నానమ్మకు చెబుతాడు రాజ్.ఇక నుంచి నాకు చెప్పే హక్కు కూడా మీరు పోగొట్టుకున్నారని అంటాడు. కొడుకు మాటలు అపర్ణ బాధపడుతుంది. రుద్రాణి మాత్రం సంతోషంగా ఫీలవుతుంది.
నిజాయితీగా చేయాలి...
అపర్ణ, ఇందిరాదేవిలను దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం తప్పుపడతారు. కావ్య, రాజ్‌లను కలపాలంటే నిజాయితీగా ప్రయత్నాలు చేయమని, ఇలాంటి నాటకాలు ఆడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సీతారామయ్య హెచ్చరిస్తాడు.
కనకం కన్నీళ్లు...
తాను ఆడిన నాటకం వల్ల కూతురు, అల్లుడు మధ్య మరింత దూరం పెరగడం చూసి కనకం కన్నీళ్లు పెట్టుకుంటుంది. తప్పులు, అబద్దాలతో మమ్మల్ని కలపగలవని ఎలా అనుకున్నావని తల్లిని నిలదీస్తుంది కావ్య. కానీ కృష్ణమూర్తి మాత్రం భార్యనే వెనకేసుకొస్తాడు. అందరి ముందు కనకం దోషిగా మారినా... తల్లిగా మాత్రం గెలిచిందని అంటాడు.
కావ్య తల్లికి అవమానం...
దుగ్గిరాల ఫ్యామిలీ అందరి ముందు తన తల్లి అవమానాల పాలు కావడం కావ్య సహించలేకపోతుంది. రుద్రాణి, రాజ్ అన్న మాటలు గుర్తొచ్చి బాధపడుతుంది. తన కాపురం వల్ల తల్లిదండ్రులు క్షోభకు గురవ్వకూడదని నిర్ణయించుకుంటుంది. ఇకపై నన్ను, నా భర్తను కలపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయద్దని తల్లిదండ్రులతో కోపంగా అంటుంది.
కనకం శాపం...
రుద్రాణినే తమ ప్లాన్‌ను చెడగొట్టిందని తెలిసి కనకం శాపాలు పెడుతుంది. కావ్య మాత్రం రుద్రాణిని వెనకేసుకువస్తుంది. మీ నాటకం బయటపెట్టి మంచి పనిచేసిందని అంటుంది. రాజ్, కావ్యలను కలపడానికి ఇందిరాదేవి, అపర్ణ, కనకం మరో ప్లాన్ వేస్తారు. తమ ఆఫీస్‌లో మళ్లీ ఉద్యోగంలో చేరమని కావ్యకు ప్రపోజల్ పెడుతుంది అపర్ణ. కానీ రాజ్ తనలో ఎప్పుడు తప్పులు వెతుకుతూ ఎప్పుడు బయటకు పంపిస్తాడో తెలియదని కావ్య భయపడుతుంది.
రాజ్ బాస్‌గా...
రాజ్ కింద కావ్య పనిచేయడం కాకుండా కావ్య కిందనే రాజ్ పనిచేసేలా కొత్త ఎత్తు వేస్తుంది అపర్ణ. నిన్ను మా కంపెనీకి సీఈవోను చేయాలని అనుకున్నట్లు అపర్ణ చెబుతుంది. ఆమె మాటలతో కావ్య షాకవుతుంది. రాజ్, కావ్య ఒకే ఆఫీస్‌లో కలిసి పనిచేస్తే వాళ్లిద్దరి మధ్య ప్రేమ బయటపడే అవకాశం ఉందని అపర్ణ అనుకంటారు. కావ్య ఆఫీస్ ఎండీ కానుందని తెలిసి రాజ్ జీర్ణించుకోలేకపోతాడు. కావ్యకు ఎండీ సీట్‌లో కూర్చునే అర్హత లేదని అంటాడు.
రాజ్‌కు బాస్‌గా...
రాజ్‌కు బాస్‌గా కావ్య ఆఫీస్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అపర్ణ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్‌తోపాటు రుద్రాణి, ధాన్యలక్ష్మి వ్యతిరేకించినట్లు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూపించబోతున్నట్లు సమాచారం. ఈ సారైనా అపర్ణ, కనకం వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? తనకు బాస్‌గా ఆఫీస్‌లో అడుగుపెట్టిన కావ్యను చూసి రాజ్ ఎలా రియాక్ట్ అయ్యాడన్నది బ్రహ్మముడి సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.