Brahmamudi February 27th Episode:రాజ్ ఈగో హర్ట్ చేసిన కావ్య - అపర్ణకు సుభాష్ లవ్ ప్రపోజ్ - కళ్యాణ్‌కు అవమానం
Brahmamudi February 27th Episode: నేటి బ్రహ్మముడి సీరియల్‌లో కళ్యాణ్ ఆఫీస్‌లో కవితలు రాస్తుండటం చూసి అనామిక తట్టుకోలేకపోతుంది. అతడివి పిచ్చి రాతలు అంటూ అవమానిస్తుంది. కళ్యాణ్‌ను కావ్యనే చెడగొడుతుందని నిందలు వేస్తుంది.
Brahmamudi February 27th Episode: కావ్యను తన ఆఫీస్‌లో టెంపరరీ ఎంప్లాయ్ అని ఎగతాళి చేస్తాడు రాజ్. పదేళ్లు నేను ఇక్కడే పనిచేయాలని మీరే అగ్రిమెంట్‌పై సంతకం చేశారని రాజ్‌కు గుర్తుచేస్తుంది కావ్య. అయినా అన్నేళ్లు ఇక్కడ ఉండనని, మా బావ రిజైన్ చేయమంటే ఈ రోజే, ఇప్పుడే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని రాజ్‌తో అంటుంది కావ్య.
మధ్యలోకి మీ బావ ఎందుకొచ్చాడని కావ్యతో అంటాడు రాజ్. మా బావ ఎలా చెబితే అలా చేస్తానని, అది నా ఇష్టమని అంటుంది. నేను ఎండీనని, తనకు అన్ని రైట్స్ ఉన్నాయని కావ్య డిజైన్స్‌ను అప్రూవ్ చేయకుండా ఆపేస్తాడు. మళ్లీ కొత్త డిజైన్స్ వేయమని ఆర్డర్ వేసి వెళ్లిపోతాడు.
సోషల్ మీడియాలో వైరల్...
వాలెంటైన్స్ డే రోజు కావ్య, రాజ్ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను సుభాష్, ప్రకాషం చూస్తారు. కావ్య, రాజ్‌ల వీడియో చూస్తే అపర్ణ, ధాన్యలక్ష్మి ఫైర్ అవుతారని, వాళ్లను కూల్ చేయడానికి ఓప్లాన్ వేస్తారు. వాలెంటైన్స్ రోజు అపర్ణను సర్‌ప్రైజ్ చేయాలని సుభాష్ అనుకుంటాడు.
సుభాష్, అపర్ణ రొమాన్స్ చూసి ధాన్యలక్ష్మి కోపం పట్టలేకపోతుంది. మీ మతిమరుపు మాస్టర్‌కు ఇలాంటి వాలెంటైన్స్‌డేలు గుర్తుండవని ధాన్యలక్ష్మిపై సెటైర్ వేస్తుంది రుద్రాణి. కానీ ప్రకాశం కూడా గులాబీ పువ్వు తీసుకొని ధాన్యలక్ష్మికి లవ్ ప్రపోజ్ చేయడానికి వస్తాడు. అపర్ణకు సుభాష్, ధాన్యలక్ష్మికి ప్రకాషం గులాబీ పువ్వులు ఇచ్చి ఐ లవ్ యూ చెబుతారు. దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషంగా వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం చూసి రుద్రాణి. తట్టుకోలేకపోతుంది. తనకే ఏ సరదా, సంతోషం లేకుండాపోయానని బాధపడుతుంది.
రుద్రాణికి షాక్...
వారి సంతోషాన్ని చెడగొట్టాలని అనుకుంటుంది. మా మతిమరుపు అన్నయ్య లోపలికి పిలిచి ఏం చెప్పాలో మర్చిపోయాడా అని ధాన్యలక్ష్మిని ఎగతాళి చేయాలని అనుకుంటుంది. కనీసం నాకు ఏం చెప్పాలో మర్చిపోయే మొగుడైనా ఉన్నాడు. నీకు మొగుడు కూడా లేడుగా అంటూ రుద్రాణిపై పంచ్ వేసి ధాన్యలక్ష్మి వెళ్లిపోతుంది.
రాజ్ ఈగో...
ఆఫీస్‌లో డిజైన్స్ చూస్తుంటాడు రాజ్. కావ్య వేసిన డిజైన్స్ కు ఎవరివి సాటిరావు. కావ్యపై ఈగోలకు పోయి అనవసరంగా తన కంపెనీని తానే నష్టపోయేలా చేస్తున్నానని రాజ్ బాధపడతాడు. అప్పుడే కావ్య ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి రాజ్ క్యాబిన్‌లోకి వస్తుంది. కానీ రాజ్ ఆమెను మాట్లాడనివ్వడు. నీ చెత్త డిజైన్స్ యాక్సెప్ట్ చేయనని, ఎంత బతిమాలిన లాభం లేదని అంటాడు. క్లయింట్స్ మిమ్మల్ని కలవడానికి వచ్చారని శృతి రాజ్‌తో అంటుంది. క్లయింట్స్ పేరువినగానే రాజ్ కంగారు పడిపోతాడు. మీరు వేసిన చెత్త డిజైన్స్ వల్ల అందరితో మాటలు పడాల్సివస్తుందని కావ్య ముందు బిల్డప్ ఇస్తాడు రాజ్.
రాజ్‌పై సెటైర్స్...
లోపలికి వచ్చిన క్లయింట్ కావ్య వేసిన డిజైన్స్ బాగున్నాయని మెచ్చుకుంటాడు. అతడి మాటలతో రాజ్‌కు పొలమారుతుంది. కావ్య వాటర్ ఇవ్వబోతే తీసుకోడు. మా ఆఫీస్‌లో కొందరికి ఆ డిజైన్స్ నచ్చలేదని క్లయింట్‌తో అంటుంది కావ్య. రాజ్ ఈ మాటలు అన్నాడని తెలియక మీ డిజైన్స్ నచ్చలేదని అన్న టేస్ట్ లెస్ ఫెల్లో ఎవడు, అలాంటి సన్నాసులు మీ ఆఫీస్‌లో ఉన్నారా అని క్లయింట్ అంటాడు.
దాంతో రాజ్‌కు ఏం మాట్లాడాలో తెలియక సెలైంట్‌గా ఉంటాడు. కావ్య వేసిన డిజైన్స్‌ను ప్రొడక్షన్ యూనిట్‌కు పంపించమని రాజ్ అంటాడు. తనవి చెత్త డిజైన్స్ అని రాజ్ అన్న మాటలు గుర్తొచ్చి ఆ డిజైన్స్ అతడికి ఇవ్వడానికి కావ్య అంగీకరించదు. ఆ డిజైన్స్‌ను ప్రొడక్షన్ యూనిట్‌కు ఇవ్వకపోతే శృతిని ఉద్యోగం తీసేస్తానని రాజ్ బెదిరిస్తాడు. శృతి ఉద్యోగం కోసం కావ్య బెట్టు దిగుతుంది.
రాహుల్‌పై స్వప్న ఫైర్...
వాలెంటైన్స్ డే ను రాహుల్‌తో సెలబ్రేట్ చేసుకోవాలని స్వప్న అనుకుంటుంది. రాహుల్ అందుకు ఇంట్రెస్ట్ చూపడు. వాలెంటైన్స్ డే అన్న విషయం తనకు తెలియదు అన్నట్లుగా మాటలు మాట్లాడుతాడు. ఏడాది క్రితం ఇదే రోజు తనకు లవ్ ప్రపోజ్ చేసిన విషయం అయినా గుర్తుందా అని రాహుల్‌తో అంటుంది స్వప్న.
ఆ పీడకలను ఎప్పుడో మర్చిపోయానని, అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు ఫీలవుతున్నానని స్వప్నకు బదులిస్తాడు రాహుల్. నువ్వు నన్నుప్రేమించినట్లు నటించావు. కానీ నేను ఎప్పుడు నటించలేదు అంటూ రాహుల్‌కు రోజ్ ఫ్లవర్ ఇచ్చి లవ్ ప్రపోజ్ చేస్తుంది స్వప్న. నా ప్రేమలో సిన్సియారిటీ లేనప్పుడు నువ్వు ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చన వేస్ట్ అని రాహుల్ అంటాడు. నీలో ఆ మార్పు వస్తుందనే నమ్మకం లేదని స్వప్న చెబుతుంది.
అనామిక కోసం కవిత...
ప్రేమికుల రోజు సందర్భంగా అనామిక కోసం ఓ కవిత రాస్తాడు రాజ్. ఆ కవితను ఎంప్లాయ్ అందరికి వినిపిస్తుంటాడు. అప్పుడే కళ్యాణ్‌కు లంచ్ ఇవ్వాలని అనామిక ఆఫీస్‌కు వస్తుంది. ఈ ఆఫీస్‌కు ఎప్పటికైనా తన భర్త కళ్యాణ్ రాజు కావాలని, తాను ఇంటికి రాణిని కావాలని అనుకుంటుంది. అప్పటివరకు తన కాపురాన్ని కూడా లెక్కచేయకూడదని ఫిక్సవుతుంది.
కళ్యాణ్ ఏ మీటింగ్‌లో బిజీగా ఉన్నాడోనని కలలు కంటూ అనామిక ఆఫీస్‌లో అడుగుతుపెడుతుంది. కానీ ఆఫీస్‌లో అందరికి కళ్యాణ్ కవితలు వినిపిస్తుండటం చూసి తట్టుకోలేకపోతుంది. బిజినెస్ చూసుకోవాలని నిన్ను ఆఫీస్‌కు పంపిస్తే నువ్వు వెలగబెట్టేది ఇదా...ఈ పిచ్చి రాతలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నావా...కట్టుకున్న భార్యను ఇంత దారుణంగా మోసం చేస్తావా అని కళ్యాణ్‌పై ఫైర్ అవుతుంది.
అబద్ధాలు చెప్పి తనను మభ్య పెట్టావని, నాకు నీపై నమ్మకం పోయిందని చెబుతుంది. అనామికకు సర్ధిచెప్పబోతుంది కావ్య. ఇది మా భార్యభర్తలకు సంబంధించిన విషయమని, ఇందులో జోక్యం చేసుకోవద్దని అంటుంది.
మగాడు అన్న తర్వాత...
నేను ఎవరిని మోసం చేయలేదని, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని అనామికకు సర్ధిచెప్పబోతాడు కళ్యాణ్. దుగ్గిరాల ఇంటి వారసుడితో పెళ్లి అంటే తాను ఎన్నో ఊహించుకున్నానని, కానీ గాలిలో కలిసే రాతలతో తన తలరాత మారదని ఇప్పుడే అర్థమవుతుందని కళ్యాణ్‌తో అంటుంది అనామిక. మగాడు అన్న తర్వాత పనిచేసి బతకాలని అందరి ముందు కళ్యాణ్ పరువు పోయేలా మాట్లాడుతుంది.
ఇది ఆఫీస్...ఇళ్లు కాదు...
అనామిక మాటలతో రాజ్ ఫైర్ అవుతాడు. ఏదైనా ఉంటే మీ భార్యభర్తలు ఇంట్లో నాలుగు గోడల మధ్య చూసుకోవాలని అనామికతో అంటాడు రాజ్. ఇది ఆఫీస్ అని, నీ భర్త ఇక్కడ ఎండీ హోదాలో ఉన్నాడని, అది గుర్తుపెట్టుకొని మాట్లాడమని చెబుతాడు. రాజ్ మాటలతో కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనామిక.
కావ్యపై కోపం...
కళ్యాణ్ కోసం హాల్‌లో కోపంగా ఎదురుచూస్తుంటుంది అనామిక. కళ్యాణ్ ఇంట్లో అడుగుపెట్టగానే అతడిపై తన మనసులో ఉన్న ద్వేషం మొత్తం బయటపెడుతుంది. కళ్యాణ్ ఆఫీస్‌కు వెళ్లి కవి సమ్మేళనం మొదలుపెట్టాడని, , కవితలు రాసుకుంటూ కూర్చుంటున్నాడని ఇంట్లో అందరి ముందు భర్త పరువు పోయేలా మాట్లాడుతుంది అనామిక.
కళ్యాణ్ కవితలు రాస్తాడని తెలిసే నువ్వు పెళ్లచేసుకున్నావు కదా అని అనామికతో అంటుంది కావ్య. కవులను, కళాకారులను గౌరవించాలని అంటుంది. కావ్య మాటలతో అనామిక మధ్యలోనే ఆపేస్తుంది. నా భర్తను చెడగొట్టేది నువ్వే. నా భర్తను అసమర్థుడిని చేసి నీ భర్తను మాత్రం మహారాజులా చూడాలని అనుకుంటున్నావని కావ్యతో కోపంగా అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.