Brahmamudi February 21st Episode: బావతో కావ్య షికార్లు - తట్టుకోలేకపోయిన రాజ్ - రుద్రాణికి షాకిచ్చిన స్వప్న
Brahmamudi February 21st Episode: కావ్య ఆమె బావ కలిసి షికారుకు వెళతారు. వారిద్దరు షికారుకు వెళ్లిన విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పి కావ్యపై నింద మోపాలని రాజ్ ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Brahmamudi February 21st Episode: శ్వేతను పెళ్లి చేసుకున్నట్లుగా రాజ్ ఆడుతోన్న డ్రామాకు చెక్ పెట్టడానికి తన బావను రంగంలోకి దించుతుంది కావ్య. రాజ్ ముందు తన బావతో క్లోజ్‌గా మూవ్ అవుతుంది కావ్య. అది చూసి జెలసీగా ఫీలవుతాడు రాజ్. కావ్యను ఏడిపించడానికి కేక్ తెప్పిస్తాడు రాజ్. శ్వేతకు ఈ రోజే విడాకులు వచ్చాయని, ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికే కేక్ తెప్పించానని అంటాడు.
భార్య వద్దనుకున్న మనిషితో కలిసి ఉండాల్సిన అవసరం నీకేంటి అని రాజ్ ముందు ఆమె బావ అంటాడు. ఆ తర్వాత మాట మార్చేసి ఈ అమ్మాయికి పనేంటి అంటూ శ్వేతను చూపిస్తాడు. రాజ్, శ్వేత కలిసి కేక్ కట్ చేస్తారు. నువ్వేం దిగులు పడకు. త్వరలోనే నీ జీవితానికి ఓ చక్కటి దారి చూపిస్తానని శ్వేతకు మాటిస్తాడు రాజ్. రాజ్‌కు కేక్ తినిపించడానికి శ్వేత ఆలోచిస్తుంది. నువ్వేం భయపడకు. కావ్యది చాలా బ్రాడ్ మైండ్ అని అంటాడు రాజ్.
బావతో కావ్య రొమాన్స్...
కావ్యకు ఆమె బావ కేక్ తినిపించాలని అనుకుంటాడు. కానీ రాజ్‌ను చూసి ఆగిపోతాడు. మా ఆయన అబ్రాడ్‌లో చదువుకున్నాడని, ఆయనది బ్రాడ్ మైండ్ అని రాజ్‌పై రివర్స్ పంచ్ వేస్తుంది కావ్య. తన బావకు కూడా కావ్య ప్రేమగా కేక్ తినిపిస్తుంది. అతడి ముఖంపై కేక్ రుద్దుతుంది. చిన్నప్పుడు నీ ముఖాన్ని ఇలా కేక్‌లో ముంచేదానిని అంటూ పాత జ్ఞాపకాల్ని కావ్య, ఆమె బావ గుర్తుచేసుకుంటారు. వారి రొమాన్స్‌ను రాజ్ తట్టుకోలేకపోతాడు. కోపంగా శృతిని పిలుస్తాడు. కేక్‌ను వెంటనే ఇక్కడి నుంచి తీసేయమని చెబుతాడు.
బావతో షికార్లు...
బావతో కలిసి బయటకు వెళ్లబోతుంది కావ్య. ఆమెను రాజ్ అడ్డుకుంటాడు. రెండు గంటలు పర్మిషన్ కావాలని అంటుంది కావ్య. రెండు నిమిషాలు కూడా ఇవ్వనని, ఆఫీస్‌లో అర్జెంట్ పనులు ఉన్నాయని ఆఫీస్‌లో ఉండి తీరాల్సిందేనని రాజ్ కోపంగా కావ్యకు బదులిస్తాడు. హాఫ్ డే అని లీవ్ రాసుకొని సాలరీ కట్ చేసుకోమని కావ్య అంటుంది. నా పర్మిషన్ లేకుండా బయటకు వెళితే ఉద్యోగం తీసేస్తానని రాజ్ అంటాడు.
ఉద్యోగంలో నుంచి తీసేస్తే తనకు ఇంకా మంచిదని, అప్పుడు తన బావతో కలిసి బయటకు వెళ్లడానికి ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం ఉండదని కావ్య అంటుంది. తన కోసం కావ్య జాబ్ వదులుకోవడానికి సిద్ధపడటంతో ఆమెను పొగడ్తల్లో ముంచుతాడు = బావ. నీది ఎంత గొప్ప మనసు బుజ్జి అని ప్రేమను కురిపిస్తాడు. కావ్య ధాటికి రాజ్ చేతులేత్తేస్తాడు. చివరకు రెండు గంటలు పర్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. తాను రెండు అడగలేదని నాలుగు గంటలు కావాలని అన్నానని కావ్య మాట మార్చేస్తుంది. రాజ్ ఏం చేయలేక ఒప్పుకుంటాడు.
ధాన్యలక్ష్మి బాధ...
అనామిక, ధాన్యలక్ష్మి బాధపడుతూ కూర్చుండటం రుద్రాణి గమనిస్తుంది. వారిని తన మాటలతో దెప్పిపొడుస్తుంది రుద్రాణి. నువ్వు ఎంత ప్రయత్నించిన నీ తోడి కోడలు కంచు. తొనకదు బెదరదు అని ధాన్యలక్ష్మితో అంటుంది రుద్రాణి. మీరు ఇంటి పనులు, వంట పనులు చేయడం తప్ప ఆమెను ఏం చేయలేరని అంటూ ఎగతాళి చేస్తుంది. తెగదాకా లాగకూడదని ఆగిపోయానని లేదంటే వాటాలు పంచుకునేవరకు వెళ్లిపోవాలని అనుకున్నానని కోపంగా రుద్రాణితో అంటుంది ధాన్యలక్ష్మి.
వాటాలు పంచుకుంటే మీరే తిరిగి ఈ ఇంటికి పనిమనుషులుగా రావాల్సివస్తుందని ధాన్యలక్ష్మితో అంటుంది రుద్రాణి. ప్రకాషం, కళ్యాణ్ ఇద్దరికి బిజినెస్ చేసే తెలివితేటలు లేవని, సుభాష్, రాజ్ వారిని కాపాడుకుంటూ వస్తున్నారని చెబుతుంది. ప్రకాశం, కళ్యాణ్ ఆస్తిని హారతి కర్పూరం చేసి నాలుగు రోజులు రోడ్డున పడతారు. నాకు, రాహుల్‌కు అదే గతి పడుతుందని ఇక్కడే ఉంటున్నామని ధాన్యలక్ష్మితో చెబుతుంది రుద్రాణి.
ఎప్పటికైనా నువ్వు అపర్ణ కింద అణిగిమనిగి ఉండాల్సిందేజ. అనామిక కావ్య కింద అసిస్టెంట్‌గా బతకాల్సిందేనని చెబుతుంది. అపర్ణ, ఇందిరాదేవి మధ్య చిచ్చుపెట్టడమే కాకుండా కావ్యను అపర్ణకు దూరం చేస్తేనే ఇంట్లో మీ పెత్తనం చెల్లుబాటు అవుతుందని ధాన్యలక్ష్మితో చెబుతుంది రుద్రాణి.
స్వప్న ఎంట్రీ...
అప్పుడే స్వప్న అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఎవరైనా కలిసి ఉండమని సర్ధిచెబుతారు. ఇలా విడిపొమ్మని ఎవరూ చెప్పరని రుద్రాణికి క్లాస్ పీకుతుంది. మీ ఆయన మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్లిపోయాడో ఇప్పుడు అర్థమైందని అంటుంది. ఇలాంటి వారి చెప్పుడు మాటలు వింటే పచ్చని కాపురాలు ముక్కలైపోతాయని ధాన్యలక్ష్మి, అనామికకు సలహా ఇస్తుంది స్వప్న.
ఈ సోది ఆపి నాకు అర్జెంట్‌గా ఆరెంజ్ జ్యూస్ తీసుకొని రమ్మని రుద్రాణికి ఆర్డర్ వేస్తుంది స్వప్న. లేట్ అయితే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇస్తుంది. ముందు నీ కోడలిని కంట్రోల్‌లో పెట్టుకోవడం ఎలాగో చూసుకో...ఆ తర్వాత మా మధ్య గొడవలు పెట్టడం గురించి ఆలోచించు అని రుద్రాణిపై ధాన్యలక్ష్మి సెటైర్ వేస్తుంది.
నిజం చెప్పిన కావ్య...
కావ్య, ఆమె బావ ఆఫీస్ నుంచి బయటకు వస్తారు. మీ ఆయన శ్వేతను పెళ్లిచేసుకుంటున్నట్లుగా ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాడని కావ్యతో అంటాడు ఆమె బావ. వారిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందని, నాకు దూరమవ్వడానికే ఆయన ఈ డ్రామా ఆడుతున్నాడని బావతో నిజం చెబుతుంది కావ్య. కానీ మీ ఆయనకు నీపై చాలా ప్రేమ ఉందని, మనిద్దరిని చూసి ఏం చేయలేక జుట్టు పీక్కుంటున్నాడని బావ అంటాడు.
కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం నా అత్మాభిమానాన్ని కాపాడుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నానని బావతో అంటుంది కావ్య. డోస్ ఎక్కువైతే ప్రమాదమని, తన భార్య మరొకరితో చనువుగా ఉండటం ఏ మగాడు తట్టుకోలేడని కావ్య బావ అంటాడు. రాజ్ నీపై అనుమానపడ్డ, మనిద్దరి స్నేహాన్ని అపార్థం చేసుకున్నా మన ప్రయత్నం బెడిసికొడుతుందని కావ్య బావ అంటాడు. ఎక్కడ దొరికిపోకుండా జాగ్రత్తగా నాటకం ఆడాలని కావ్య, ఆమె బావ అనుకుంటారు.
దుగ్గిరాల వంశం పరువు కోసం...
డ్రైవర్‌ను తీసుకెళ్లకుండా కావ్య, ఆమె బావ షికారుకు వెళ్లడం రాజ్ తట్టుకోలేకపోతాడు. నా ముందే తన కావ్య బావతో ఎలా షికారుకు వెళుతుంది అని కోపంగా శ్వేతతో అంటాడు. నువ్వు నాతో తిరిగినప్పుడు కావ్య ఆమె బావతో తిరిగే తప్పేంటని కావ్యను వెనకేసుకువస్తుంది శ్వేత. కావ్యను ఎలాగు వదిలించుకుందామని అనుకుంటున్నప్పుడు ఎవరితో తిరిగితే నీకేంటని రాజ్‌ను నిలదీస్తుంది శ్వేత.
దుగ్గిరాల వంశానికి ఓ పరువు ఉందని, నా భార్య ఎవరితోనే తిరిగితే నా కుటుంబ పరువు ఏం కావాలని రాజ్ అంటాడు. ఏ తప్పు చేయని నీ భార్యను వదిలేస్తే కుటుంబ పరువు నిలబడుతుందా అని రాజ్‌ను అడుగుతుంది శ్వేత. ఆమె ప్రశ్నలతో రాజ్ ఆలోచనలో పడతాడు. నీలో కావ్య పట్ల ప్రేమ ఉంది. అది ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది.దానినే జెలసీ అంటారని రాజ్‌కు క్లాస్ ఇస్తుంది శ్వేత.
రాజ్ ప్లాన్...
కావ్యపై తనకు ప్రేమ లేదని చెప్పడానికి రాజ్ మరో ఎత్తు వేస్తాడు. కావ్య తన బావతో షికారు వెళ్లిన విషయాన్ని ఇంట్లో అందరి ముందు చెప్పేయాలని అనుకుంటాడు. అలా నింద మోపితే కావ్య తనను వదిలివెళ్లిపోతుందని అనుకుంటాడు. శ్వేత వద్దన్న వినడు.
షాకిచ్చిన ఇందిరాదేవి...
కావ్యపై కోపంతో రాజ్ ఇంటికొస్తాడు. ఎదురుగా ఇందిరాదేవి కనిపిస్తుంది. ఫారిన్ నుంచి బావ రావడంతో ఆఫీస్ పనులు ఎగ్గొట్టి కావ్య షికారుకు వెళ్లిందని ఇందిరాదేవితో చెబుతాడు రాజ్. ఇలా షికార్లు కొడితే మన ఇంటికి ఎంత చెడ్డపేరు అని కావ్యపై చాడీలు చెబుతాడు రాజ్. కావ్య ఊరంతా షికార్లు చేయకుండా నేరుగా తన బావను ఇంటికే తీసుకొచ్చిందని ఇందిరాదేవి అంటుంది.
ఆమె మాటలు విని రాజ్ షాకవుతాడు. కావ్య చాలా మంచిదని, నువ్వే తనను అర్థం చేసుకోవడం లేదని రాజ్‌తో అంటుంది ఇందిరాదేవి. బావ సంగతి చెబుతానని కోపంగా రాజ్ ఇంట్లోకి వెళతాడు. కావ్య బావ హోటల్‌లో ఉంటున్నాడని తెలిసిన ఇందిరాదేవి మా ఇంట్లోనే ఉండమని చెబుతుంది. బామ్మ మాటలు విని రాజ్ షాకవుతాడు.