Brahmamudi February 8th Episode: కావ్యకు ఇంటి బాధ్యతలు అప్పగించిన అపర్ణ -ధాన్యలక్ష్మి షాక్ -శోభనం ఆపేసిన అనామిక
Brahmamudi February 8th Episode: దుగ్గిరాల ఇంటి బాధ్యతల్ని కావ్యకు అప్పగిస్తుంది అపర్ణ. ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా నీ దగ్గరికే రావాలని కావ్యతో అంటుంది అపర్ణ. అపర్ణ నిర్ణయంతో రుద్రాణి, ధాన్యలక్ష్మి షాకవుతారు.ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Brahmamudi February 8th Episode: కళ్యాణ్, అనామిక శోభానానికి దుగ్గిరాల ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తుంది. రొమాంటిక్ పాటలు పాడుకుంటూ శోభనం గదిలో అనామిక కోసం ఎదురుచూస్తుంటాడు. అనామిక గదిలో అడుగుపెడుతుంది. ఆమె ఇచ్చిన పాలు వద్దని అంటాడు కళ్యాణ్. పంచ్ డైలాగ్స్ చెబుతాడు. అనామిక....నేను ఆగను ఇక అంటూ తనలోని కవికి పనిపెబుతాడు. శోభనం ఆపడానికి అనామిక ప్రయత్నాలు మొదలుపెడుతుంది. తనకు పీరియడ్స్ టైమ్ అని అబద్ధం ఆడుతుంది. మూడు రోజుల తర్వాతే శోభనమని కళ్యాణ్‌తో అంటుంది.
శోభనం క్యాన్సిల్…
శోభనం క్యాన్సిల్ అని తెలియడంలో కళ్యాణ్ డిసపాయింట్ అవుతాడు. కాలం మనతో కర్కశంగా ప్రవర్తిస్తూ ఇద్దరిని దూరం పెడుతుందని బాధపడతాడు. శోభనం గదిలో కాకుండా బయటపడుకోవడానికి కళ్యాణ్ దిండు, దుప్పటి తీసుకుంటాడు. కానీ నువ్వు బయటపడుకుంటే మనకు అరిష్టమని అందరూ అనుమానపడతారని, రూమ్‌లోనే పడుకోమని కళ్యాణ్‌తో అంటుంది అనామిక. అనామిక ప్లాన్ తెలియని కళ్యాణ్ అందుకు ఒప్పుకుంటాడు. అనామిక బెడ్‌పై పడుకుంటే తాను మాత్రం చాప తీసుకొని రూమ్‌లోనే కిందపడుకుంటాడు. ఆఫీస్‌కు నువ్వు బాస్, ఇంటికి నేను మహారాణిని అయ్యే వరకు ఈ నాటకాలు తప్పదని అనామిక అనుకుంటుంది.
కావ్యను ఆటపట్టించిన రాజ్...
కావ్యను ఆటపట్టించాలని రాజ్ ఫిక్సవుతాడు. కావ్య రూమ్‌లోకి వచ్చే ముందు శ్వేతకు వీడియో కాల్ చేస్తాడు. కావ్య ముందు హాయ్ స్వీటీ అంటూ శ్వేతపై ప్రేమను కురిపిస్తాడు. ఏంటి నీరసంగా ఉన్నావు. నేను పక్కన లేనని డిన్నర్ చేయడం మానేసావా చెప్పూ అంటూ రొమాంటిక్‌గా మాట్లాడుతాడు. నేను నీ దగ్గరకు రానా...హాస్పిటల్‌కు వెళ్దామా అని శ్వేతతో అంటాడు.
కనీసం జ్యూస్ అయినా తాగు లేదంటే నాకు నిద్ర పట్టదు అని శ్వేతతో ప్రేమగా మాట్లాడుతాడు. రాజ్, శ్వేతల రొమాన్స్ చూసి కావ్య ఉడికిపోతుంది. కోపం వస్తోన్న కంట్రోల్ చేసుకుంటుంది. ఇంట్లో ఉన్న పెళ్లాం తిన్నదో లేదో తెలియదు కానీ ఊళ్లో ఉన్న ఆడవాళ్ల గురించి మాత్రం తెగ ఆలోచిస్తుంటాడని లోలోన రాజ్ పై కోప్పడుతుంది.
శ్వేతకు ఇష్టం లేకపోయినా రాజ్ కోసం డ్రామా కంటిన్యూ చేస్తుంది. భార్యాభర్తలు గదిలో ఉన్నప్పుడు డిస్ట్రబ్ చేయకూడదని కామన్స్ సెన్స్ లేకుండా కొంతమంది బతికేస్తూ ఉంటారని కావ్యపై సెటైర్ వేస్తుంది కావ్య. ఆమెపై ఫైర్ అవుతాడు రాజ్.
కావ్య తింగరిబుచ్చి...
నువ్వేం పట్టించుకోకు అది కొంచెం తింగరిబుచ్చి అని కావ్య గురించి శ్వేతకు చాడీలు చెబుతాడు రాజ్. అతడి మాటలతో కావ్య ఫైర్ అవుతుంది. ఫోన్‌లో ఫుల్ వాల్యూమ్‌తో పాటలు పెడుతుంది. ఆ గోల ఆపమని రాజ్ ఆమెను కోప్పడుతాడు. దాంతో నిద్ర పోతానని చెప్పి కావ్య లైట్ ఆఫ్ చేస్తుంది. నేను మాట్లాడుతున్నాగా ఎందుకు లైట్ ఆఫ్ చేస్తున్నావని కావ్యను అడుగుతాడు రాజ్. లైట్ ఉంటే నాకు నిద్ర రాదని కావ్య అంటుంది.
కావ్యకు కడుపుమంట...
మనం మాట్లాడుకుంటుంటే చాలా మందికి కడుపుమంటగా ఉందని శ్వేతతో అంటాడు రాజ్. వీడియో కాల్ కట్ చేస్తాడు. నన్ను ఏడిపించడమే నీ పనా అని కావ్యపై సెటైర్ వేస్తాడు. ఆ పనిచేస్తుంది మీరు అంటూ రాజ్‌కు ధీటుగా బదులిచ్చి కావ్య మరోవైపుకు తిరిగి నిద్రపోతుంది.
అప్పు పోలీస్ డ్రీమ్...
అప్పు పోలీస్ కావాలని ఫిక్సవుతుంది. అందుకోసం తనకు వచ్చిన పెళ్లి సంబంధాన్ని కూడా కాదనుకుంటుంది. నిన్న ఓ చిన్నారిని కాపాడినప్పుడు ఒకరికి సాయం చేయడంలో నిజమైన ఆనందం ఉందని అర్థమైందని, అందుకే పోలీస్ కావాలని నిశ్చయించుకున్నట్లు తండ్రితో చెబుతుంది అప్పు.
పోలీస్ కావడానికి జాబ్ మానేయాల్సివస్తుందని అప్పు బాధపడుతుంది. మీకు భారం అవుతానేమోనని తండ్రితో అంటుంది. కనీసం ఇలా అయినా నీ విషయంలో నా బాధ్యత తీర్చుకునే అవకాశం వస్తుందని, నువ్వు దేని గురించి ఆలోచించవద్దని కనకం, కృష్ణమూర్తి అప్పుకు హామీ ఇస్తారు.
అనామిక ప్లాన్...
శోభనం గదిలో నుంచి బయటకు వెళ్లబోతున్న కళ్యాణ్‌ను ఆపుతుంది అనామిక. శోభనం జరిగినట్లుగా అందరిని నమ్మించేందుకు అతడి జుట్టు చెరిపివేస్తుంది. షర్ట్‌పై లిప్‌స్టిక్, కాటుక మరకలను అంటిస్తుంది. అదే డ్రెస్‌లో కిందికివస్తాడు కళ్యాణ్. అతడిపై సుభాష్ కోప్పడుతాడు. శోభనం బట్టలతో బయటకు రాకూడదని అంటాడు. నిజంగానే కళ్యాణ్, అనామిక శోభనం జరిగిందని అందరూ నమ్ముతారు తన ప్లాన్ వర్కవుట్ అయినందుకు అనామిక హ్యాపీగా ఫీలవుతుంది.
కావ్యకు ఇంటి బాధ్యతలు...
కావ్యను పిలిచిన అపర్ణ...ఇంటి బాధ్యతలు మొత్తం ఆమెకు అప్పగిస్తున్నట్లు ప్రకటిస్తుంది. దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలిగా ఈ రోజు నుంచి ఆ బాధ్యతలు అన్ని నువ్వే చూసుకోవాలని అంటుంది. ఇంటి తాళాలను ఆమె చేతిలో పెడుతుంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా నీ దగ్గరకే రావాలని అంటుంది. ఆమె మాటలతో ధాన్యలక్ష్మి, రుద్రాణి, అనామిక షాకవుతారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.