Vettaiyan OTT: నెలలోపే ఓటీటీలోకి రజినీకాంత్ సినిమా!.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానుందంటే..
Vettaiyan OTT: వేట్టయన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టడం లేదు. అయితే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి బజ్ విపరీతంగా నడుస్తోంది. అనుకున్న దాని కంటే ముందుగానే స్ట్రీమింగ్‍కు రానుందనే రూమర్లు వస్తున్నాయి.
వేట్టయన్ సినిమా అక్టోబర్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ ఈ మూవీలో హీరోగా నటించారు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లను దక్కించుకోలేకపోతోంది. మొదటి నుంచే మిక్స్డ్ టాక్ రావటంతో వసూళ్లు భారీగా రాలేదు. ప్రస్తుతం మోస్తరుగా థియేట్రికల్ రన్ సాగుతోంది. తెలుగులో అయితే ఈ చిత్రానికి నిరాశ ఎదురైంది. అయితే, వేట్టయన్ సినిమా ఓటీటీపై బజ్ నడుస్తోంది.
స్ట్రీమింగ్ ఎప్పుడు?
వేట్టయన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అనుకున్న దాని కంటే ముందుగానే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని రూమర్లు వస్తున్నాయి. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లో స్ట్రీమింగ్‍కు తెచ్చేలా మేకర్లతో ప్రైమ్ వీడియో డీల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే నవంబర్ 7వ తేదీన వేట్టయన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి డేట్‍పై ప్రకటన రావాల్సి ఉంది.
వేట్టయన్ చిత్రం థియేటర్లలో రిలీజైన నెలలోగానే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నవంబర్ రెండో వారంలోనే స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు ప్రైమ్ వీడియో షెడ్యూల్ చేసుకుందనే రూమర్లు బయటికి వచ్చాయి. ఈ మూవీపై ప్రైమ్ వీడియో ఓటీటీ ఎప్పుడు అప్‍డేట్ ఇస్తుందో చూడాలి.
వేట్టయన్ చిత్రానికి జైభీమ్ మూవీ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఎన్‍కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజినీకాంత్ నటించారు. ఈ చిత్రాన్ని యాక్షన్ డ్రామా మూవీగా దర్శకుడు తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు.. మంజూ వారియర్, రితికా సింగ్, దుషరా విజయన్, అసల్ కొలార్, కృష్ హాసన్, రోహిణి, అభిరామి కీరోల్స్ చేశారు.
వేట్టయన్ కలెక్షన్లు
వేట్టయన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది. మిక్స్డ్ టాక్ వచ్చినా రజినీకాంత్ స్టార్ డమ్‍తో ఈ చిత్రానికి స్టడీగా కలెక్షన్లు వస్తున్నాయి. తమిళంలోనే ఎక్కువగా వసూళ్లు దక్కుతున్నాయి. తెలుగులో ఈ మూవీ పెద్దగా కలెక్షన్లను దక్కించుకోలేదు. మూవీ టైటిల్‍ను తెలుగులోకి అనువదించలేదని ముందు నుంచే అసంతృప్తి వ్యక్తమైంది. అందులోనూ మిక్స్డ్ టాక్ రావటంతో తెలుగులో వేట్టయన్ పుంజుకోలేకపోయింది.
వేట్టయన్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని సుమారు రూ.300కోట్ల భారీ బడ్జెట్‍తో రూపొందించారని అంచనా. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఎల్ఆర్ కార్తీక్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ఫిలోమన్ రాజ్ ఎడిటింగ్ చేశారు.
రజినీకాంత్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‍తో ఓ మూవీ చేయనున్నారు. ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్ కూడా ఖరారైంది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ముఖ్యమైన రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది.