Unstoppable 4 OTT Date: అన్‍స్టాపబుల్ 4 ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్, టైమ్ వెల్లడించిన ఆహా.. సీఎం చంద్రబాబు అతిథిగా..-unstoppable with nbk 4 first episode streaming date time on aha ott balakrishna with ap cm chandrababu naidu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable 4 Ott Date: అన్‍స్టాపబుల్ 4 ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్, టైమ్ వెల్లడించిన ఆహా.. సీఎం చంద్రబాబు అతిథిగా..

Unstoppable 4 OTT Date: అన్‍స్టాపబుల్ 4 ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్, టైమ్ వెల్లడించిన ఆహా.. సీఎం చంద్రబాబు అతిథిగా..

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 20, 2024 09:05 PM IST

Unstoppable Season 4 OTT Date, Time: అన్‍స్టాపబుల్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ డేట్, టైమ్‍ను ఆహా ఓటీటీ వెల్లడించింది. బాలకృష్ణ హోస్ట్‌గా ఈ ఎపిసోడ్‍కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అతిథిగా వచ్చారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ నేడు పూర్తయింది.

Unstoppable 4 OTT Date: అన్‍స్టాపబుల్ 4 ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్, టైమ్ వెల్లడించిన ఆహా.. సీఎం చంద్రబాబు అతిథిగా..
Unstoppable 4 OTT Date: అన్‍స్టాపబుల్ 4 ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్, టైమ్ వెల్లడించిన ఆహా.. సీఎం చంద్రబాబు అతిథిగా..

పాపులర్ టాక్ షో అన్‍స్టాపబుల్ 4వ సీజన్ మొదటి ఎపిసోడ్‍పై ఆసక్తి విపరీతంగా ఉంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఉన్న ఈ టాక్ షో.. కొత్త సీజన్ తొలి ఎపిసోడ్‍కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా వచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్‍పై హైప్ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆహా ఓటీటీలో అన్‍స్టాపబుల్ మూడు సీజన్లు చాలా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో సీజన్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎపిసోడ్‍తో మొదలుకానుంది. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్, డేట్ టైమ్‍ను ఆహా ఓటీటీ నేడు (అక్టోబర్ 20) వెల్లడించింది.

షూటింగ్ నేడే పూర్తి

అన్‍స్టాపబుల్ 4వ సీజన్ తొలి ఎపిసోడ్ షూటింగ్ నేడే (అక్టోబర్ 20) జరిగింది. హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్‍కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోస్ట్ బాలకృష్ణ వచ్చారు. అన్‍స్టాపబుల్ సెట్‍లో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. తన బావ సీఎం చంద్రబాబును బాలకృష్ణ ప్రశ్నలు అడిగారు. సరదాగా మాట్లాడారు.

స్ట్రీమింగ్ డేట్, టైమ్ ఇదే

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెస్టుగా పాల్గొన్న అన్‍స్టాపబుల్ 4 తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్, టైమ్‍ను ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. అక్టోబర్ 25వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ ఎపిసోడ్ ప్రీమియర్ అవుతుందని పేర్కొంది. షూటింగ్ పూర్తవటంతో నేడు (అక్టోబర్ 20) ఈ విషయాన్ని ఆహా ప్రకటించింది. అన్‍స్టాపబుల్ సెట్‍లో చంద్రబాబు, బాలకృష్ణ కలిసి ఉన్న ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.

శక్తివంతమైన మాటలతో పాటు ఎంటర్‌టైన్‍మెంట్ ఉంటుందంటూ ఈ ఎపిసోడ్ గురించి ట్వీట్ చేసింది ఆహా. “పవర్, ప్రశ్నలు, సూటైన సమాధానాలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్‍స్టాపబుల్ సీజన్ 4 మొదలుకానుంది. కష్టమైన ప్రశ్నలు, శక్తివంతమైన మాటలు, సర్‌ప్రైజ్‍లు, ఎంటర్‌టైన్‍మెంట్‍పై చంద్రబాబు మాట్లాడారు. అన్‍స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25న రాత్రి 8.30 గంటలకు ప్రీమియర్ కానుంది” అని ఆహా పోస్ట్ చేసింది.

రెండోసారి..

అన్‍స్టాపబుల్‍కు చంద్రబాబు నాయుడు రావడం ఇది రెండోసారి. ఈ టాక్ షో రెండో సీజన్ తొలి ఎపిసోడ్‍కు కూడా ఆయన వచ్చారు. 2022లో ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అన్‍స్టాపబుల్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అన్‍స్టాపబుల్ 4వ సీజన్‍కు వచ్చారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ భారీ విజయం సాధించింది. మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. హిందూపురం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు బాలకృష్ణ. వీరిద్దరి మధ్య ఏ మాటలు నడిచాయో.. అన్‍స్టాపబుల్ 4వ సీజన్ తొలి ఎపిసోడ్ ఎలా ఉండనుందో అనే ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 25న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది.

అన్‍స్టాపబుల్ 4వ సీజన్‍కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ ఎపిసోడ్‍లో గెస్టుగా రానున్నారు. ఇది కూడా ఇప్పటికే ఖరారైంది. ఈ ఎపిసోడ్‍కు కూడా ఫుల్ క్రేజ్ ఉండనుంది. లక్కీ భాస్కర్ మూవీ టీమ్‍తోనూ ఓ ఎపిసోడ్ జరగనుంది.

Whats_app_banner