Double iSmart TV Premiere: టీవీలోకి రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా.. ఏ ఛానెల్‍లో.. ఎప్పుడు?
Double iSmart TV Premiere: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీవీలో ప్రసారమయ్యేందుకు సిద్ధమైంది. ఈ మూవీ టీవీ ప్రీమియర్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. ఈ యాక్షన్ మూవీ టెలికాస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా భారీ అంచనాలతో వచ్చి తీవ్రంగా నిరాశ పరిచింది. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‍కు ఈ చిత్రంతో మరో వైఫల్యం ఎదురైంది. సూపర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‍గా ఐదేళ్ల తర్వాత ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‍తో చతికిలపడింది.
డబుల్ ఇస్మార్ట్ సినిమా ఇప్పుడు బుల్లితెరలోకి వచ్చేందుకు రెడీ అయింది. టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ తర్వాత ఇప్పుడు టీవీలోకి అడుగుపెడుతోంది.
టెలికాస్ట్ డేట్, టైమ్
డబుల్ ఇస్మార్ట్ సినిమా అక్టోబర్ 27వ తేదీన ఆదివారం సాయంత్రం 6 గంటలకు ‘జీ తెలుగు’ టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు అధికారికంగా ఖరారు చేసింది. టెలికాస్ట్ టైమ్‍తో ఓ ప్రోమోను తీసుకొచ్చింది. అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్టు ఫిక్స్ చేసింది.
ఓటీటీలోనూ అంతంత మాత్రమే..
డబుల్ ఇస్మార్ట్ చిత్రం థియేటర్లలో డిజాస్టర్ అయింది. దీంతో థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. సెప్టెంబర్ 5వ తేదీనే ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
అయితే, ఓటీటీలోనూ డబుల్ ఇస్మార్ట్ చిత్రం పెద్దగా వ్యూస్ దక్కించుకోలేకపోయింది. అంతంత మాత్రంగానే పర్ఫార్మ్ చేసింది. ఈ చిత్రంలో కొన్ని సీన్లు ఓటీటీలోకి వచ్చాక బాగా ట్రోల్ అయ్యాయి. ఈ మూవీ హిందీ వెర్షన్ జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలోనూ ఈ చిత్రం నిరాశపరిచింది.
టీవీల్లో ఎలానో!
డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఓటీటీలోనూ పెద్దగా వ్యూస్ దక్కించుకోలేదు. దీంతో అక్టోబర్ 27న జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ మూవీకి టీఆర్పీ ఏ విధంగా వస్తుందో అనే ఆసక్తి ఉంది. పాజిటివ్ టాక్ ఉన్న చిత్రాలకే ఈ మధ్య టీవీల్లో పెద్దగా టీఆర్పీ దక్కడం లేదు. మరి డబుల్ ఇస్మార్ట్ ఈ మేరకు సాధిస్తుందో చూడాలి.
డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ హీరోయిన్‍గా నటించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ పాత్ర పోషించారు. ఈ చిత్రంలో సీనియర్ కమెడియన్ అలీ చేసిన క్యారెక్టర్ విమర్శలకు గురైంది. ఇరిటేట్ చేసేలా ఆ పాత్ర ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమమయ్యాయి. ఈ మూవీలో షాయాజీ షింజే, బానీ జే, మార్కండ్ దేశ్‍పాండే, ఝాన్సీ కీరోల్స్ చేశారు.
డబుల్ ఇస్మార్ట్ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రేక్షకులకు మెప్పించలేకపోయారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ మ్యూజిక్ రిపీట్ చేయలేకపోయారు. పూరితో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు చార్మీ. సుమారు రూ.50కోట్ల బడ్జెట్‍తో ఆ మూవీని నిర్మించినట్టు అంచనా. ఈ సినిమా కేవలం సుమారు రూ.18కోట్ల కలెక్షన్లు మాత్రం దక్కించుకొని డిజాస్టర్ అయింది.