Double Ismart OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్.. ఇక్కడ చూసేయండి!-double ismart ott streaming on amazon prime puri jagannadh ram pothineni double ismart ott release silently ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Double Ismart Ott: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్.. ఇక్కడ చూసేయండి!

Double Ismart OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Sep 05, 2024 08:12 AM IST

Double Ismart OTT Streaming: డబుల్ ఇస్మార్ట్ ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా నేటి నుంచి (సెప్టెంబర్ 5) సైలెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది డబుల్ ఇస్మార్ట్ మూవీ. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అయిందంటే..

సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్.. ఇక్కడ చూసేయండి!
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్.. ఇక్కడ చూసేయండి!

ppDouble Ismart OTT Release: టాలీవుడ్‌లో డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. విమర్శకులు సైతం ఆశ్చర్యపోయే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు వరుస సినిమాలతో ప్లాప్‌లతో కూరుకుపోయాడు హీరో రామ్ పోతినేని.

ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా

ఎలాగైనా హిట్ కొట్టాలన్న ధ్యేయంతో పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే డబుల్ ఇస్మార్ట్. 2019లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు బాగానే రెస్పాన్స్ వచ్చింది.

నెగెటివ్ టాక్

ముఖ్యంగా మార్ ముంతా చోడ్ చింతా పాట కాంట్రవర్సీ ఎదుర్కొంది. దీంతో డబుల్ ఇస్మార్ట్ సినిమాకు బాగానే ప్రమోషన్స్ జరిగాయి. ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైన డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ఊహించని రిజల్ట్ ఎదురైంది. డబుల్ ఇస్మార్ట్ మూవీ అదే రొటీన్‌గా సాగింది, కొత్తగా కథా కథనం ఏం లేవని నెగెటివ్ టాకా బాగానే వచ్చింది.

డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రిలీజ్

దాంతో బాక్సాఫీస్ వద్ద డబుల్ ఇస్మార్ట్‌ కలెక్షన్స్ పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రిలీజ్‌పై క్యూరియాసిటీ నెలకొంది. ఆ క్రమంలోనే సెప్టెంబర్ 27న ఓటీటీలోకి డబుల్ ఇస్మార్ట్ స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపించాయి. కానీ, అనూహ్యంగా తాజాగా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది డబుల్ ఇస్మార్ట్ మూవీ.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే సైలెంట్‌గా నేటి (సెప్టెంబర్ 5) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది డబుల్ ఇస్మార్ట్ మూవీ. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డబుల్ ఇస్మార్ట్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రిలీజ్ అయింది.

33 కోట్లకు ఓటీటీ రైట్స్

థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో డబుల్ ఇస్మార్ట్ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. అయితే, థియేటర్లలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. కాగా, డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ రూ. 33 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ ఓటీటీ

ఇదిలా ఉంటే, డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. సౌత్ భాషల్లో ఇవాళ (సెప్టెంబర్ 5) డబుల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి మరికొన్ని రోజుల్లోనే హిందీ వెర్షన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. లేదా ఇవాళే సాయంత్రం వరకు విడుదల చేయొచ్చు. డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లేదా జీ5లో ఓటీటీ రిలీజ్ అయే అవకాశం ఉంది.

డబుల్ ఇస్మార్ట్ రన్‌టైమ్

ఇక డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా రన్‌టైమ్ సుమారు 2 గంటల 42 నిమిషాలు ఉంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ మూవీని బ్రెయిన్ ట్రాన్స్‌ఫర్, మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కించారు.