Ram Pothineni: పూరి గన్ లాంటివాడు.. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే పనులు జరగవ్.. రామ్ పోతినేని కామెంట్స్
Ram Pothineni Comments In Double Ismart Pre Release Event: పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ పోతినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పక్కోడి గురించి పకోడీల గురించి పట్టించుకుంటే పనులు జరగవ్ అంటూ మాట్లాడారు.
Ram Pothineni Comments On Puri Jagannadh: రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రెండోసారి తెరకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి డబుల్ ఇస్మార్ట్ సీక్వెల్‌గా వచ్చిన విషయం తెలిసిందే. కావ్య థాపర్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ కానుంది.
తాజాగా వరంగల్‌లో డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ పూరి, నిర్మాత ఛార్మి, హీరో రామ్ పోతినేని, హీరోయిన్ కావ్య థాపర్, నటులు అలీతోపాటు ఇతర నటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ పోతినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
"హాయ్ వరంగల్. ఇస్మార్ట్ శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ఇక్కడికి వచ్చాం. మళ్లీ డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్‌కి ఇక్కడి రావడం చాలా హ్యాపీగా ఉంది. మణిశర్మ గారు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్‌కి మించి చేశారు. స్క్రీన్ మీద చూశాక పాటలు ఇంకా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తాయి. సంజయ్ దత్ గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఈ పాత్రని ఆయన తప్పితే మరొకరు చేయలేరు" అని రామ్ పోతినేని అన్నాడు.
"కావ్య చాలా మంచి అమ్మాయి. చాలా హార్డ్ వర్క్ చేసింది. విష్ హానెస్ట్‌గా తన పని తను చేస్తూ ఉంటాడు. ఛార్మి గారు ఫైటర్. ఆమె లేకుండా ఈ సినిమా పాజిబుల్ అయ్యేది కాదు. పూరి గారితో ఎనర్జీ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో పని చేసినప్పుడు వచ్చే కిక్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది" అని రామ్ పోతినేని చెప్పాడు.
"పూరి గారు మోస్ట్ ఇన్‌స్పైరింగ్ డైరెక్టర్స్ అఫ్ తెలుగు సినిమా. రైటర్, డైరెక్టర్ కావాలని వచ్చిన వారు పూరి గారి చూసి స్ఫూర్తి పొందే వస్తారు. పూరి గారు గన్ లాంటి వారు. నా ఫోన్‌లో పూరి గారి పేరు గన్ అని ఉంటుంది. పేల్చే గన్ బావుంటే బుల్లెట్ ఎంత ఫోర్స్‌గా అయినా వెళ్తుంది. పూరి గారు లాంటి గన్ అందరి యాక్టర్స్‌కి కావాలి. లవ్ యూ సర్. డబుల్ ఇస్మార్ట్ మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ క్యారెక్టర్. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు" అని ఉస్తాద్ రామ్ తెలిపాడు.
"ఇటీవల నేను సోషల్ మీడియాలో గానీ, బయట గానీ కొత్త ట్రెండ్ చూస్తున్నాను. 'అరే నీకు ఇది నచ్చిందా?' అంటే 'వాళ్లకు నచ్చుతుంది ఏమో? ఇంకొకరికి నచ్చుతుంది ఏమో?' అని పక్కన ఉన్న వాళ్లవైపు చూస్తున్నారు. ముందు మనకు నచ్చిందా అనేది చూసుకోవాలి" అని రామ్ పోతినేని సలహా ఇచ్చాడు.
"మనం తిన్న బిర్యానీ నచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న నలుగురు బాలేదని అంటే మన మీద మనకు డౌట్ రాకూడదు. నేను తిన్నాను. నాకు బావుంది అని చెప్పాలి. అది బిర్యానీ అయినా రేపు సినిమా అయినా, ఎల్లుండి కెరీర్ అయినా. నీకు నచ్చింది నువ్ చేయ్. పక్కనోడి ఒపీనియన్ వల్ల నీ అభిప్రాయం మార్చుకోవద్దు. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనలు జరగవ్ అన్నాయ్" అని చెప్పుకొచ్చాడు రామ్ పోతినేని.
"సాధారణంగా నేను ఎవరికీ అడ్వైజ్‌లు ఇవ్వను. నా అనుకున్న వాళ్లకు అడిగితేనే ఇస్తాను. మీరంతా నా వాళ్లు అనుకుని చెప్పాను. ఆగస్ట్ 15న కలుద్దాం. లవ్ యూ ఆల్" అని డబుల్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని తన స్పీచ్ ముగించాడు.