తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lachchimi Song Release: అదిరిపోయిన అల్లరి నరేశ్ రొమాంటిక్ సాంగ్.. ఓ సారి వినేయండి

Lachchimi Song Release: అదిరిపోయిన అల్లరి నరేశ్ రొమాంటిక్ సాంగ్.. ఓ సారి వినేయండి

04 October 2022, 22:18 IST

    • Allari Naresh Next Movie: అల్లరి నరేశ్ నటించిన తాజా చిత్రం లచ్చిమీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ వచ్చింది. లచ్చిమీ అంటూ సాగే ఈ పాట అద్భుతంగా ఉంది.
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నుంచి లచ్చిమీ సాంగ్ విడుదల
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నుంచి లచ్చిమీ సాంగ్ విడుదల (Twitter)

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నుంచి లచ్చిమీ సాంగ్ విడుదల

First Single from Itlu Maredumilli Prajaneekam: కామెడీ సినిమాలు చేస్తూ తెలుగు నాట తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అల్లరి నరేశ్. అయితే వరుస ఫ్లాపుల పలకరించడంతో గతేడాది కాస్త రూటు మార్చి నాంది లాంటి వైవిధ్యభరితమైన సీరియస్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అల్లరి నరేశ్. ఆ సినిమా విజయం కావడంతో మరోసారి ఇలాంటి రొటీన్‌కు భిన్నమైన కథలకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం మన అల్లరోడు నటిస్తున్న తాజా చిత్రం ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ విడుదలై సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినినిమా నుంచి మొదటి పాట విడుదల చేశారు మేకర్స్. హీరో నితిన్ చేతుల మీదుగా ఈ సాంగ్ విడుదలైంది.

ట్రెండింగ్ వార్తలు

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

Laapataa Ladies Review: ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సెటైరికల్ కామెడీ మూవీ ఆకట్టుకునేలా ఉందా? లాపతా లేడీస్ రివ్యూ

Kamakshi Bhaskarla: నాగ‌చైత‌న్య‌తో వెబ్‌సిరీస్ చేయ‌నున్న పొలిమేర 2 హీరోయిన్ - దూత‌కు మించి థ్రిల్లింగ్‌!

'లచ్చిమీ' అంటూ సాగే ఈ ఆద్యంతం ఎంతో వినసొంపుగా ఉంది. ఈ మెలోడీ సాంగ్‌ను ప్రముఖ బాలీవుడ్ సింగర్ జావెద్ అలీ అద్భుతంగా ఆలపించగా.. శ్రీ చరణ్ పాకాల ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చారు. శ్రీమణి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ను చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంది. ఈ పాటలో అల్లరి నరేశ్, ఆనంది జోడీ చూడ ముచ్చటగా ఉంది. అర్ధవంతమైన సాహిత్యం, వినసొంపుగా ఉన్న ట్యూన్.. ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఈ సినిమా నవంబరు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా సీరియస్ డ్రామాగా తెరకెక్కుతోంది. అంతేకాకుండా మంచి సందేశం కూడా ఉంటుందని సమాచారం. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా చేస్తోంది. అంతేకాకుండా వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర లాంటి వారు కీలక పాత్రలు ఫోషిస్తున్నారు.

ఈ సినిమాకు అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తుండగా.. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా చేస్తున్నారు. వెంకట్ ఆర్ స్టంట్ మాస్టర్‌గా చేస్తున్నారు. ఈ ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. నాంది లాంటి సీరియస్ స్టోరీతో సూపర్ హిట్ కొట్టిన అల్లరి నరేశ్.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానికంతో మరోసారి కూడా సీరియస్ కథనే నమ్ముకున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.